Beauty With Brains: బ్యూటీ విత్ బ్రెయిన్స్.. డాక్టర్లు, లాయర్లుగా రాణిస్తున్న మన హీరోయిన్లు..!
షూటింగ్ షెడ్యూల్స్, విదేశీ ప్రయాణాలతో ఎంత బిజీగా ఉన్నా సరే.. తమ చదువులను మాత్రం అస్సలు అశ్రద్ధ చేయడం లేదు. ఈ తరం హీరోయిన్లు కేవలం నటనకే పరిమితం కాకుండా డిగ్రీలు, పీజీలు, చివరికి డాక్టరేట్లు కూడా పూర్తి చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల గురించి.

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు గ్లామర్ ప్రపంచానికి, చదువుల లోకానికి మధ్య చాలా పెద్ద అగాథమే ఉండేది. సినిమాలు ఎంచుకుంటే చదువును పక్కన పెట్టాల్సిందే అనుకునేవాళ్లు. కానీ నేటి తరం హీరోయిన్లు ఆ పాత ఆలోచనలను పూర్తిగా చెరిపేస్తున్నారు. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ.. అటు వెండితెరపై స్టార్ డమ్ అనుభవిస్తూనే, ఇటు ఉన్నత విద్యలో గోల్డ్ మెడల్స్ సాధిస్తున్నారు. షూటింగ్ షెడ్యూల్స్, విదేశీ ప్రయాణాలతో ఎంత బిజీగా ఉన్నా సరే.. తమ చదువులను మాత్రం అస్సలు అశ్రద్ధ చేయడం లేదు. ఈ తరం హీరోయిన్లు కేవలం నటనకే పరిమితం కాకుండా డిగ్రీలు, పీజీలు, చివరికి డాక్టరేట్లు కూడా పూర్తి చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల గురించి. వరుస సినిమాలతో క్షణం తీరిక లేని షెడ్యూల్ ఉన్నప్పటికీ.. ఆమె తన ఎంబీబీఎస్ చదువును ఎక్కడా ఆపలేదు.
షూటింగ్ బ్రేక్స్‌లో, క్యారవాన్‌లో సమయం దొరికినప్పుడల్లా ఆన్‌లైన్ క్లాసులు వింటూ, సెట్స్ లోనే పుస్తకాలు చదువుతూ ఎంతో డెడికేషన్ చూపించారు. ఆ కష్టానికి ప్రతిఫలంగా తాజాగా ఆమె డాక్టర్ పట్టా అందుకున్నారు. ఇప్పుడు ఆమె అధికారికంగా క్వాలిఫైడ్ డాక్టర్. ఇటీవల ఆమె తన డిగ్రీని స్వీకరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. గ్లామర్ ప్రపంచంలో ఉంటూనే ఇంతటి కఠినమైన కోర్సును పూర్తి చేయడం నిజంగా గ్రేట్ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. శ్రీలీల మాత్రమే కాదు, మన టాలీవుడ్ లో డాక్టర్ కమ్ యాక్టర్ల సంఖ్య గట్టిగానే ఉంది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి కూడా వృత్తి రీత్యా వైద్యురాలే. ఆమె బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ పూర్తి చేశారు. కేవలం చదువు మాత్రమే కాదు, క్రీడల్లోనూ ఆమెకు మంచి ప్రవేశం ఉంది. హర్యానా తరపున స్టేట్ లెవెల్ స్విమ్మర్‌గా, బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా రాణించారు. డెంటల్ డాక్టర్‌గా చదువు పూర్తయ్యాకే ఆమె మోడలింగ్, సినిమాల వైపు అడుగులు వేశారు.
ఇక అందరి ఫేవరెట్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె, డాక్టర్ అయ్యాకే నటనను ఫుల్ టైమ్ కెరీర్‌గా మార్చుకున్నారు. ఇప్పటికీ ఆమెను అభిమానులు ప్రేమగా ‘డాక్టర్ సాయి పల్లవి’ అనే పిలుస్తుంటారు. భవిష్యత్తులో సినిమాలు మానేస్తే ఆసుపత్రి పెట్టుకుని సేవలందిస్తానని ఆమె చాలా సార్లు చెప్పారు. వీళ్ళ బాటలోనే మరికొందరు తారలు కూడా నడుస్తున్నారు. సీనియర్ హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని కూడా వైద్య విద్యను పూర్తి చేసింది. తండ్రి లాగే ఈమె కూడా డాక్టర్‌గా రాణించాలని ఆశ పడుతుంది. అనుకున్నట్లుగానే ఎంబిబిఎస్ పూర్తి చేయడమే కాదు.. ప్రాక్టీస్ కూడా చేస్తుంది శివానీ. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన ప్రొఫెషనల్ కెరీర్‌పై కూడా ఫోకస్ చేస్తుంది.
అలాగే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కూడా వృత్తి రీత్యా డాక్టరే కావడం విశేషం. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆమె తన వైద్య వృత్తిని గౌరవిస్తారు. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె, హీరోయిన్ అదితి శంకర్ కూడా ఈ డాక్టర్ల జాబితాలోకే వస్తారు. వీళ్లంతా గ్లామర్ ఫీల్డ్ లో ఉంటూనే, సమాజానికి సేవ చేసే వైద్య వృత్తిని కూడా అభ్యసించి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కేవలం వైద్య రంగమే కాదు, న్యాయశాస్త్రం, సైకాలజీ వంటి ఇతర రంగాల్లోనూ మన హీరోయిన్లు సత్తా చాటుతున్నారు. బలగం సినిమాతో అందరి మనసులు గెలుచుకున్న కావ్య కళ్యాణ్ రామ్ ఒక లాయర్ అని చాలా తక్కువ మందికి తెలుసు. పూణేలోని ప్రఖ్యాత సింబయాసిస్ లా స్కూల్ నుంచి ఆమె న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఇక ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సినిమాల్లో నటిస్తూనే సైకాలజీ కోర్సును చదువుతున్నారు. అలాగే మ్యాడ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న శ్రీ గౌరీప్రియ డిజిటల్ మార్కెటింగ్ చేస్తూనే సంగీతంలోనూ శిక్షణ తీసుకున్నారు. ఇలా నేటి తరం హీరోయిన్లు చదువు, సినిమా.. ఇలా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు.
సినిమాలతో పాటు చదువుల్లోనూ టాప్ మన హీరోయిన్లు.. బ్యూటీ విత్ బ్రెయిన్స్..
శ్రీలీల మెడిసిన్ అయిపోయింది.. డిగ్రీ కూడా తీసుకుంది.. అలా చదువుతో పాటు సినిమాలు చేస్తున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు మన దగ్గర
శ్రీలీల డాక్టర్
కావ్య కళ్యాణ్ రామ్ లాయర్
సాయి పల్లవి డాక్టర్
కృతి శెట్టి సైకాలజీ స్టూడెంట్
మీనాక్షి చౌదరి డెంటిస్ట్
రూప కొడియవార్ డాక్టర్
అదితి శంకర్ డాక్టర్
ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..
