AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ టాలీవుడ్ నటుడు చాలా గ్రేట్.. తన తల్లి జ్ఞాపకార్థంగా ఏం చేశాడో తెలిస్తే హ్యాట్సాఫ్ చెబుతారు

సాధారణంగా ఎవరి ఫ్యామిలీలోనైనా వారికి ఎంతో ఇష్టమైన వారు చనిపోతే వారి జ్ఞాపకార్థం రకరరకాల కార్యక్రమాలు చేస్తుంటారు. గొప్పగా సమాధులు కడుతుంటారు. లేదా విగ్రహాలు పెట్టడం వంటివి చేస్తారు. అయితే ఈ టాలీవుడ్ నటుడు మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. మరణించిన తన తల్లి జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా..

Tollywood: ఈ టాలీవుడ్ నటుడు చాలా గ్రేట్.. తన తల్లి జ్ఞాపకార్థంగా ఏం చేశాడో తెలిస్తే హ్యాట్సాఫ్ చెబుతారు
Tollywood Actor Sayaji Shinde
Basha Shek
|

Updated on: Feb 11, 2026 | 8:58 PM

Share

ఎన్నో తెలుగు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు సాయాజీ షిండే. తన అద్బుత నటనతో లెక్కలేనన్నీ పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నారు. కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా కన్నడ, తమిళం, హిందీ తదితర భాషల్లోన షిండే సినిమాలు చేశారు. ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోన్న సాయాజీ షిండే పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ నటుడిని మెచ్చుకుంటూ తెగ పోస్టులు షేర్ అవుతున్నాయి. ఇంతకీ సాయాజీ షిండే ఏం చేశారో తెలుసా? తన తల్లిని ఎంతో ప్రేమించే ఈ నటుడు తన సొంత గ్రామంలో 5000 మొక్కలను నాటారట. ఇప్పుడు ఆ మొక్కలు వృక్షాలుగా మారి ఆ ప్రాంతమంతా ఒక పచ్చని అడవిలా మారిపోయిందట. సహ్యాద్రి దేవ్ రాయ్ ప్రాజెక్టు ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సాయాజీ షిండే తన గ్రామంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో లక్షలాది మొక్కలు నాటారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘ మా అమ్మకు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. ఆమె ప్రకృతి ప్రేమికురాలు. అమ్మ చనిపోయినప్పుడు తన ఫోటో ఒక విగ్రహానికి తనని పరిమితం చేయటం ఇష్టం లేదు. అందుకే అమ్మకు ఎంతో ఇష్టమైన మొక్కలను నాటాను. ప్రతి మొక్క అమ్మ పేరు మీద నాటారు. ఇప్పుడు ఆ చెట్లలోనే మా అమ్మను చూసుకుంటున్నాను. ఈ మొక్కలున్నీ పెరిగి పెద్దయిన తర్వాత చెట్ల నుంచి వస్తున్న గాలి నీడ మా అమ్మ ఆశీస్సులుగా భావిస్తున్నాను’ అని అంటారు సాయాజీ షిండే.

ఇవి కూడా చదవండి

తల్లితో సాయాజీ షిండే..

కాగా ఈ టాలీవుడ్ నటుడు కేవలం తన తల్లి కోసమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ కోసం గత కొన్నేళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా మొక్కలు నాటుతున్నారు. ముఖ్యంగా అంతరించిపోతున్న అరుదైన చెట్ల జాతులను కాపాడుతూ వస్తున్నారు. దీంతో ఈ నటుడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ‘మీరు సినిమాలో విలన్ కావచ్చేమో కానీ, నిజ జీవితంలో మాత్రం గ్రేట్ హీరో సర్’ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కోలాటం ఆడుతోన్న సాయాజీ షిండే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? 'వంద దేవుళ్లు' రివ్యూ..
తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? 'వంద దేవుళ్లు' రివ్యూ..
నగ్నంగా రక్తపు మడుగులో భార్య | ముస్సోరీలో ఆ రాత్రి..ఏం జరిగింది?
నగ్నంగా రక్తపు మడుగులో భార్య | ముస్సోరీలో ఆ రాత్రి..ఏం జరిగింది?
పాన్ కార్డులో సిగ్నేచర్ మార్చుకోవడం ఎలా..?
పాన్ కార్డులో సిగ్నేచర్ మార్చుకోవడం ఎలా..?
ఐఐటీ క్యాంపస్‌లో చిరుత కలకలం.. సీసీటీవీలో రికార్డ్!
ఐఐటీ క్యాంపస్‌లో చిరుత కలకలం.. సీసీటీవీలో రికార్డ్!
ఆరోగ్యమే కాదండోయ్.. ఈ 5 మొక్కలు ఇంట్లో ఉంటే అదృష్టం కూడా...
ఆరోగ్యమే కాదండోయ్.. ఈ 5 మొక్కలు ఇంట్లో ఉంటే అదృష్టం కూడా...
క్రికెట్ హెల్మెట్ వెనుక షాకింగ్ స్టోరీ
క్రికెట్ హెల్మెట్ వెనుక షాకింగ్ స్టోరీ
తెలుగులో తోపు నటుడు.. ఆ ఒక్క తప్పుతో కోరి మరణం తెచ్చుకున్నాడు
తెలుగులో తోపు నటుడు.. ఆ ఒక్క తప్పుతో కోరి మరణం తెచ్చుకున్నాడు
చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓ.. ఇన్వెస్టర్స్‌ చూపు జియో ఐపీవో వైపు
చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓ.. ఇన్వెస్టర్స్‌ చూపు జియో ఐపీవో వైపు
ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్.. మళ్లీ పగ్గాలు చేపట్టనున్న దాదా
ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్.. మళ్లీ పగ్గాలు చేపట్టనున్న దాదా
ఎన్టీఏ మళ్లీ అదే మిస్టేక్! నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో..
ఎన్టీఏ మళ్లీ అదే మిస్టేక్! నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో..