AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Haasan: ఒకేరోజు రెండుసార్లు చావుతో దాగుడుమూతలు.. కమల్ జీవితంలో మరిచిపోలేని రోజు..!

లోక నాయకుడు కమల్ హాసన్ జీవితంలో అరుదైన సంఘటన జరిగింది. జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అలాగే చావు ఎప్పుడు ఎలా ఎదురుపడుతుందో ఊహించలేము. సోషల్ మీడియా లేని ఆ రోజుల్లోనే యావత్ దేశాన్ని ఒక్కసారిగా షాక్ కు గురి చేసిన సంఘటన ఇది. ఒకే రోజు రెండు ప్రమాదాలకు గురయ్యారు కమల్.

Kamal Haasan: ఒకేరోజు రెండుసార్లు చావుతో దాగుడుమూతలు.. కమల్ జీవితంలో మరిచిపోలేని రోజు..!
Kamal Haasan
Praveen Vadla
| Edited By: |

Updated on: Feb 18, 2026 | 6:48 AM

Share

ఇప్పుడంటే చీమ చిటుక్కుమన్నా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది మ్యాటర్. కానీ ఒకప్పుడు అలా కాదు కదా.. ఏం జరిగినా నెక్ట్స్ డే పేపర్ వచ్చేవరకో లేదంటే స్వయంగా జరిగిన విషయాన్ని వాళ్లే చెప్పేవరకో ఎవరికీ తెలియదు. అలాంటి అరుదైన సంఘటన కమల్ హాసన్ జీవితంలో జరిగింది. అయినా జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సోషల్ మీడియా లేని ఆ రోజుల్లోనే దావానలంలా వ్యాపించిన ఒక సంఘటన ఇది. అది 1986, సెప్టెంబర్ 29. షూటింగ్ కోసం చెన్నై నుండి ముంబై బయలుదేరిన లోకనాయకుడు కమల్ హాసన్.. ప్రయాణం మొదలైన కేవలం రెండు గంటల్లోనే తిరిగి ఆల్వార్‌పేటలోని తన ఆఫీసుకి ఫోన్ చేశారు. మేనేజర్ ఆశ్చర్యంగా ‘సార్, అప్పుడే ముంబై చేరిపోయారా?’ అని అడగగా.. ‘నేను చేరాల్సింది ముంబైకి కాదు, పైలోకానికి.. కానీ తృటిలో తప్పింది’ అంటూ కమల్ షాకింగ్ సమాధానం ఇచ్చారు. కారు పంపిస్తానన్న ఆఫర్‌ని కూడా సున్నితంగా తిరస్కరించి.. ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా ఒక సాధారణ టాక్సీలోనే ఇంటికి బయలుదేరారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..

అసలు ఏం జరిగిందంటే.. కమల్ ఫోన్ చేయడానికి సరిగ్గా గంట ముందు గాల్లో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మద్రాసు మీనంబాకం విమానాశ్రయం నుండి 185 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందితో గాల్లోకి లేచిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం సాంకేతిక లోపంతో ప్రమాదానికి గురైంది. ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులందరూ భయంతో వణికిపోయారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా పైలట్ అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించి, విమానాన్ని అత్యవసరంగా క్రాష్ ల్యాండ్ చేశారు. ఆ విమానంలో కమల్‌తో పాటు అప్పటి ప్రముఖ నటీమణులు శ్రీప్రియ, అంజలి నాయుడు కూడా ఉన్నారు. సినిమాల్లో సాహసాలు చేయడం వేరు, నిజజీవితంలో మృత్యువు కళ్ళముందు కనబడుతున్నప్పుడు ధైర్యంగా నిలబడటం వేరు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

దట్టమైన పొగ, మంటల మధ్య ఊపిరి ఆడటం కష్టంగా ఉన్నా, కమల్ హాసన్ తన ప్రాణాల గురించి మాత్రమే ఆలోచించలేదు. తోటి ప్రయాణికులకు మనోధైర్యాన్ని నూరిపోస్తూ.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా వాళ్ళను సురక్షితంగా బయటికి పంపడంలో కీలక పాత్ర పోషించారు. రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లో కూడా ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి నిజమైన హీరో అనిపించుకున్నారు. కానీ విధి అక్కడితో ఆగుతుందా..? మరో విచిత్రమైన నాటకం ఆడింది. విమానాశ్రయం నుండి ఇంటికి టాక్సీలో వెళ్తున్నప్పుడు, డ్రైవర్ ఆతృతగా ప్రమాదం వివరాలు అడిగాడు. తన వెనుక సీట్లో కూర్చున్నది అంత పెద్ద స్టార్ హీరో అని.. ఆయన స్వయంగా ఆ గగ్గుర్పాటు అనుభవాన్ని వివరిస్తున్నారని డ్రైవర్ ఉత్కంఠకు లోనయ్యాడు.

ఎక్కువ మంది చదివినవి : Actress Pratyusha : హీరోయిన్ ప్రత్యూష మృతి కేసు.. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం..

కమల్ మాటల్లో లీనమైపోయిన డ్రైవర్.. పరధ్యానంలో టాక్సీని నడుపుతూ నేరుగా వెళ్లి ఒక స్తంభానికి ఢీకొట్టాడు. విమాన ప్రమాదం నుండి బయటపడిన కమల్.. ఇలా ఇంటికి వెళ్లే దారిలో రోడ్డు ప్రమాదానికి గురవ్వడం నిజంగా విచిత్రమైన కాకతాళీయమే. అయినా సరే కమల్ తన స్థితప్రజ్ఞతను కోల్పోలేదు. నవ్వుతూ.. ‘బాబూ, విమాన ప్రమాదం ఎలాగూ ప్రపంచవ్యాప్తంగా హెడ్ లైన్స్ అవుతుంది, నువ్వు కూడా ఆ వార్తల్లో ఎక్కేద్దామని డిసైడ్ అయ్యావా?‘ అంటూ డ్రైవర్ భుజం తట్టి, మరొక వాహనంలో ఇంటికి చేరుకున్నారు. ఇంటికి క్షేమంగా వెళ్ళాక కుటుంబ సభ్యులు, మిత్రులతో మాట్లాడుతూ.. ‘ఈ ఒక్క రోజే నేను రెండుసార్లు చచ్చి బ్రతికాను, నాకు రెండు పునర్జన్మలు లభించాయి‘ అని చమత్కరించారు. ఉదయం ఆకాశంలో, మధ్యాహ్నం నేల మీద.. ఇలా ఒకే రోజు రెండు గండాలను దాటిన కమల్ హాసన్ నిజంగా మృత్యుంజయుడే..!

ఎక్కువ మంది చదివినవి :  Actress Prathyusha : స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్స్‏లో సూసైడ్.. హీరోయిన్ ప్రత్యూష ఎలా చనిపోయిం

Follow Us
ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్'లో రాముడిగా ఆ టాలీవుడ్ స్టార్ హీరో!
ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్'లో రాముడిగా ఆ టాలీవుడ్ స్టార్ హీరో!
పీఎం కిసాన్ మీకు వస్తాయో.. లేదో.. క్షణాల్లోనే ఇలా తెలుసుకోండి
పీఎం కిసాన్ మీకు వస్తాయో.. లేదో.. క్షణాల్లోనే ఇలా తెలుసుకోండి
మృత్యుంజయుడే.. ఒకేరోజు చావు అంచుల వరకు వెళ్లిన కమల్..
మృత్యుంజయుడే.. ఒకేరోజు చావు అంచుల వరకు వెళ్లిన కమల్..
మొబైల్ వేగం పెంచే టాప్ సీక్రెట్స్ ఇవే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
మొబైల్ వేగం పెంచే టాప్ సీక్రెట్స్ ఇవే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
రూమర్లకు రుణపడి ఉంటానంటూ సెటైర్లు వేసిన సీతారామం బ్యూటీ
రూమర్లకు రుణపడి ఉంటానంటూ సెటైర్లు వేసిన సీతారామం బ్యూటీ
పక్షులకు హాని చేయకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండిలా!
పక్షులకు హాని చేయకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండిలా!
పోల్ డ్యాన్స్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే!
పోల్ డ్యాన్స్ వెనుక ఉన్న అసలు రహస్యాలివే!
పేరెంట్స్ గొడవలతో పిల్లల్లో ఆందోళన.. ఆత్మవిశ్వాసం దెబ్బతింటే..
పేరెంట్స్ గొడవలతో పిల్లల్లో ఆందోళన.. ఆత్మవిశ్వాసం దెబ్బతింటే..
ఫేవరెట్ స్నాక్స్ గురించి చెప్పేసిన మ్యాన్ ఆఫ్ మాసెస్‌ తారక్‌
ఫేవరెట్ స్నాక్స్ గురించి చెప్పేసిన మ్యాన్ ఆఫ్ మాసెస్‌ తారక్‌
నిరుద్యోగులకు అలర్ట్.. 25,487 కానిస్టేబుల్ GD రాత పరీక్షలు వాయిదా
నిరుద్యోగులకు అలర్ట్.. 25,487 కానిస్టేబుల్ GD రాత పరీక్షలు వాయిదా