AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్వతీపురం మున్సిపాలిటీలో కలకలం.. స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్..

Strong Room Key Missing: పార్వతీపురం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు వేళ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి కనిపించకపోవడంతో సిబ్బంది చాలాసేపు వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో అధికారులు తాళాన్ని పగలగొట్టించారు. ఈ ఘటనతో కౌంటింగ్ ఆలస్యమైంది. దీనిపై సీరియస్ అయిన ఎన్నికల అబ్జర్వర్ చినరాముడు.. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు.

పార్వతీపురం మున్సిపాలిటీలో కలకలం.. స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్..
Parvathipuram Municipality
Ram Naramaneni
|

Updated on: Nov 03, 2026 | 10:49 AM

Share

పార్వతీపురం మున్సిపాలిటీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి కనిపించకపోవడం తీవ్ర కలకలం రేపింది. తాళం చెవి కోసం సిబ్బంది చాలాసేపు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో చివరకు అధికారులు స్ట్రాంగ్ రూమ్ తాళాన్ని పగలగొట్టించారు.

ఈ ఘటనతో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. తాళం చెవి మిస్సింగ్ కావడం, కౌంటింగ్ ఆలస్యం కావడంపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల అబ్జర్వర్ చినరాముడు.. బాధ్యులుగా భావించిన ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.

సస్పెండ్ అయిన వారిలో నారాయణరావు, ఈశ్వర్‌రావు ఉన్నారు. దీంతో వారిద్దరూ విధులకు దూరమయ్యారు. మరోవైపు స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి ఎలా మిస్సయింది? ఎందుకు కనిపించకుండా పోయింది? అనే అంశాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Follow Us