తగ్గేదే లే అంటున్న నిధి.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు
03 November 2026
Rajeev
నిధి అగర్వాల్ చేతిలో దాదాపు ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
హిందీ చిత్ర పరిశ్రమలో నిధి మూడు సినిమాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో భాగంగా ఉన్నట్లు సమాచారం. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.
ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు చెందిన స్టోన్ బెంచ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తమిళ సినిమాలో నిధి నటించనున్నట్లు సమాచారం.
నిధి కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచేలా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు 'తంత్ర' ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.
వరాహ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది.
ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఆమె పాత్ర చాలా భిన్నంగా ఉండబోతున్నట్లు విడుదలైన పోస్టర్ ద్వారా తెలుస్తోంది. కథలో మైథలాజికల్ అంశాలతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండనున్నాయి.
తెలుగులో మరో యంగ్ హీరో నిధి మరో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో నటించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాను అనౌన్స్ చేయనున్నారు.