సమంత జిమ్ వీడియోపై నటి కృతి కర్బంద చేసిన "సెండింగ్ ఆల్ త్రీ ఆఫ్ యూ సో మచ్ లవ్" అనే కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యతో సమంతకు కవల పిల్లలు ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. కృతి ప్రస్తావించిన "ముగ్గురు" ఎవరు అనే విషయమై నెటిజన్లు ఆరా తీస్తూ, ఈ వార్తను వైరల్ చేస్తున్నారు.