రితిక నాయక్ రీసెంట్ గా మిరాయ్, కొరియన్ కనకరాజు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పెరిగింది.
ప్రస్తుతం రితిక నటిస్తున్న కీలక చిత్రం పవర్ పేట. ఇందులో సందీప్ కిషన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.
పవర్ పేటలో రితిక నాయక్ పడమటి వీధి జానకి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఆమె ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
పవర్ పేట సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.
రితిక నటిస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ డ్యూయెట్. ఇందులో ఆనంద్ దేవరకొండ సరసన ఈమె నటిస్తోంది.
డ్యూయెట్‌ను 2026 డిసెంబర్ 25న విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు. మిథున్ వరదరాజ కృష్ణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
రితిక నాయక్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌లోనూ భాగమైంది. నితిన్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.