AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Murasu: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. ఏపీ సర్కార్ హైఅలర్ట్.. స్కూళ్లుకు సెలవు

Cyclone Murasu: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. ఏపీ సర్కార్ హైఅలర్ట్.. స్కూళ్లుకు సెలవు

Phani CH
|

Updated on: Nov 02, 2026 | 3:34 PM

Share

బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌కు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు-ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నందున ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. క్రమంగా బలపడుతూ కదులుతున్న ఈ తుఫాన్ ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నెల్లూరు-ఒంగోలు మధ్య ఒంగోలు సమీపంలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని అంచనా. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై, సీఎం చంద్రబాబు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయింది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తుఫాన్ కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, అధికారిక హెచ్చరికలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gautam Gambhir: టీమిండియాను గౌతమ్ గంభీర్ వదిలేస్తున్నారా? కోచ్ పదవికి గుడ్ బై చెప్పనున్నారా?

WhatsApp: వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!

సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు

పక్షవాతం అన్నాడు… ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు

Follow Us