WhatsApp: వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
టీనేజర్ల డిజిటల్ భద్రతను పెంచేందుకు వాట్సప్ కొత్త పేరెంటల్ కంట్రోల్స్‌ను తీసుకొచ్చింది. పిల్లల ప్రొఫైల్ ఫొటోలు, గ్రూపుల్లో చేరడం, స్టేటస్‌లు, ఛానెల్స్ వినియోగంపై తల్లిదండ్రులు నియంత్రణలు పెట్టుకోవచ్చు. సెట్టింగ్స్ మార్చాలంటే పేరెంటల్ పిన్ అవసరం. పిల్లలు కొత్త గ్రూపుల్లో చేరినా, సభ్యుల సంఖ్య మారినా తల్లిదండ్రులకు అలర్ట్స్ అందుతాయి. అయితే పిల్లల చాట్స్, కాల్స్ మాత్రం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తోనే రక్షితంగా ఉంటాయని వాట్సప్ స్పష్టం చేసింది.
సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లలో తమ పిల్లల డిజిటల్ భద్రత పట్ల ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ గుడ్‌న్యూస్ అందించింది. టీనేజర్ల రక్షణను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో మెటా యాజమాన్యం ప్రత్యేకంగా ‘పేరెంటల్ కంట్రోల్స్’ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఒత్తిళ్లు, పిల్లల భద్రతకు సంబంధించి వ్యక్తమవుతున్న న్యాయపరమైన సవాళ్ల నేపథ్యంలో వాట్సప్ ఈ నిర్ణయం తీసుకుంది. టీనేజర్ల ప్రొఫైల్ ఫోటోను ఎవరు చూడాలి, వారిని ఏ గ్రూప్‌లలో చేర్చాలనే అంశాలను ఇకపై తల్లిదండ్రులే నిర్ణయించవచ్చు. ఒకవేళ పిల్లలు ఈ సెట్టింగ్స్‌ను మార్చాలని ప్రయత్నించినా, తల్లిదండ్రులు సెట్ చేసిన ‘పిన్’ అనుమతి తప్పనిసరి. అలాగే పిల్లలు ఏదైనా కొత్త గ్రూప్‌లో చేరినా, బయటకు వచ్చినా లేదా ఆ గ్రూప్‌లో ఉన్నట్లుండి సభ్యుల సంఖ్య పెరిగినా తల్లిదండ్రులకు వెంటనే అలెర్ట్ అందుతుంది. ఇంకా.. పిల్లలు ఎవరి స్టేటస్‌లు చూడాలి? వారి స్టేటస్‌ను ఎవరు చూడాలి? ఛానెల్స్‌ను ఎలా ఉపయోగించాలనే విషయాలపై తల్లిదండ్రుల నిఘా ఉండేలా సెట్టింగ్స్ రూపొందించారు. ఈ పేరెంటల్ కంట్రోల్స్ ఫీచర్ పూర్తిగా ఆప్షనల్. అవసరాన్ని బట్టి ఎప్పుడైనా దీనిని మార్చుకోవచ్చు. అయితే, ఈ కంట్రోల్స్ ఆన్ చేసినప్పటికీ పిల్లల చాటింగ్‌లు, కాల్స్ ఎప్పటిలాగే ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్’ పరిధిలోనే ఉంటాయని వాట్సప్ స్పష్టం చేసింది. అంటే పిల్లల మెసేజ్‌లను తల్లిదండ్రులు లేదా వాట్సప్ యాజమాన్యం కూడా చదవడానికి వీలుండదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు… ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు

