AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Gambhir: టీమిండియాను గౌతమ్ గంభీర్ వదిలేస్తున్నారా? కోచ్ పదవికి గుడ్ బై చెప్పనున్నారా?

Gautam Gambhir: టీమిండియాను గౌతమ్ గంభీర్ వదిలేస్తున్నారా? కోచ్ పదవికి గుడ్ బై చెప్పనున్నారా?

Phani CH
|

Updated on: Nov 02, 2026 | 3:31 PM

Share

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. అయితే, 2027 వన్డే ప్రపంచ కప్ వరకు గంభీర్ టీమిండియాతో ఒప్పందం కలిగి ఉన్నారు. ఆయన భవిష్యత్ నిర్ణయం బీసీసీఐతో ఉన్న కాంట్రాక్ట్, ఐపీఎల్ ఆఫర్లపై ఆధారపడి ఉంటుంది.

క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చుట్టూ ఐపీఎల్ వర్గాల్లో భారీ చర్చ నడుస్తోంది. ఏకంగా నలుగురు ఐపీఎల్ దిగ్గజ ఫ్రాంచైజీలు గంభీర్‌ను తమ కోచ్‌గా లేదా మెంటార్‌గా రిక్రూట్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా వైట్ బాల్ క్రికెట్‌లో అద్భుతమైన విజయాలను సాధించింది. ఆయన కోచింగ్ శైలి, వ్యూహాత్మక చతురతకు ఫిదా అయిన నాలుగు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆయనపై కన్నేశాయని రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే సీజన్ల కోసం లేదా 2028 మెగా ప్లాన్‌ల నిమిత్తం గంభీర్‌ను తమ గూటికి చేర్చుకోవాలని ఈ ఫ్రాంచైజీలు పావులు కదుపుతున్నాయి. అయితే, ప్రస్తుతానికి టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఒప్పందం 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఉంది. ఆయన బీసీసీఐతో ఉన్న కాంట్రాక్ట్ ముగిసే వరకు జాతీయ జట్టుతోనే కొనసాగాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వడం పూర్తిగా జాతీయ జట్టు కాంట్రాక్ట్ భవిష్యత్ పరిణామాలపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

WhatsApp: వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!

సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు

పక్షవాతం అన్నాడు… ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..

Follow Us