Income Tax Rules: మీ కంపెనీ ఇచ్చే దీపావళి గిఫ్ట్ తీసుకుంటున్నారా..? ఈ విలువ దాటితే ట్యాక్స్ కట్టాల్సిందే.. భారీగా పెనాల్టీ..!
దీపావళికి మీ బాస్ లేదా మీ కంపెనీ యాజమాన్యం నుంచి బహుమతులు తీసుకుంటున్నారా..? ఎంత విలువైన బహుమతి తీసుకున్నా ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాదని అనుకుంటున్నారా..? అయితే మీరు చిక్కుల్లో పడతారు. ఒక పరిమితికి మంచి తీసుకునే బహుమతులు ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వస్తాయి.

దీపావళి పండుగ సందర్భంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు గిఫ్ట్‌లు అందిస్తూ ఉంటాయి. ప్రతీ దీపావళికి ఇలా తమ ఉద్యోగులకు గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటాయి. ఈ దీపావళికి కూడా చాలామంది ఉద్యోగులు తమ యాజమాన్యం నుంచి బహుమతుల అందుకుంటున్నారు. మీరు ఇప్పటికే గిఫ్ట్ అందుకున్నా లేదా తీసుకోబోతున్నా బహుమతులకు సంబంధించిన ట్యాక్స్ నిబంధనల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఆదాయపు పన్ను శాఖ నుంచి ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఒక పరిమితికి మించి విలువ గల బహుమతులపై ట్యాక్స్ పడుతుంది. ఇక పండక్కి ప్రకటించే బోనస్‌లపై కూడా ట్యాక్స్ వర్తిస్తుంది. ఈ ఐటీ రూల్స్ ఎలా ఉంటాయనేది తెలుసుకుందాం.
గిఫ్ట్ విలువ ఈ పరిమితికి పెరిగితే..
ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం యజమాని నుంచి ఉద్యోగి తీసుకునే బహుమతులపై ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.15 వేల వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు. గతంలో ఇది రూ.5 వేలుగా ఉండగా.. ఏప్రిల్ 1,2026 నుంచి పరిమితిని రూ.15 వేలు పెంచారు. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 2025 ప్రకారం ఇది అమల్లోకి వచ్చింది. ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.15 వేల కంటే విలువ చేసే బహుమతులు తీసుకుంటే పన్ను పరిధిలోకి వస్తాయి. 2026-27 పన్ను సంవత్సరం నుంచి ఇది వర్తిస్తుంది. నగదు రహిత, వోచర్లు, టోకెన్ల రూపంలో తీసుకునే బహుమతులన్నింటిని ఇది కవర్ చేస్తుంది. ఉద్యోగి కుటుంబసభ్యులకు అందించే బహుమతులు కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి. భౌతిక బహుమతులతో పాట డిజిటల్ గిఫ్ట్ కార్డులు ఈ పరిధిలోకి వస్తాయి.
రూ.15 వేలు దాటితే పన్ను కట్టాల్సిందే..
ఒక ఆర్ధిక సంవత్సరంలో మొత్తం బహుమతుల విలువ రూ.15,000 వేలు లేదా అంతకు మించినా బహుమతుల మొత్తం విలువను ఉద్యోగి జీతంలో భాగంగా పరిగణించి ట్యాక్స్ విధిస్తారు. ఇక దీపావళికి ఇచ్చే బోనస్, నగదు బహుమతులకు రూ.15 వేల లిమిట్‌తో సంబంధం లేకుండా మొత్తంలో 100 శాతం పన్ను విధిస్తారు. ఇక బహుమతుల విలువ రూ.15 వేలు దాటితే యాజమాన్యాలు టీడీఎస్ మినహాయించాల్సి ఉంటుంది. ఉద్యోగం జీతం నుంచి దీనిని కట్ చేస్తారు. మీరు నగదు రూపంలో బహుమతి తీసుకున్నా లేదా వస్తువుల రూపంలో తీసుకున్నా టీడీఎస్ కట్ అవుతుంది. ఆదాయపు పన్ను స్లాబుల్లోకి వచ్చే ఉద్యోగులు వీటి గురించి అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే ఇన్కమ్ ట్యాకకస్ చిక్కులు ఎదురురావడంతో పాటు భారీగా జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. దీపావళికి గిఫ్ట్‌లు తీసుకునేవారు ఈ నియమాల గురించి తెలిసి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
