Watch: హైదరాబాద్‌లో కదం తొక్కిన కమల దళం.. మహాపాదయాత్రలో అమిత్ షా.. లైవ్ ఇదిగో..
భాగ్యనగరంలో కమల దళం కదం తొక్కింది. ఇండియా కూటమికి కౌంటర్‌గా లోక్‌తంత్ర బచావో-అరాచకత హటావో నినాదంతో తెలంగాణ బీజేపీ తలపెట్టిన భారీ మహాపాదయాత్ర కొనసాగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఎంజే మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన కీలక ప్రసంగం చేస్తారు.
హైదరాబాద్‌లో బీజేపీ చేపట్టిన ప్రతిష్టాత్మక మహాపాదయాత్ర ప్రారంభమైంది. ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీల నిరసనలకు దీటుగా లోక్‌తంత్ర బచావో-అరాచకత హటావో (ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకవాదాన్ని అంతం చేద్దాం) నినాదంతో బీజేపీ శ్రేణులు కదం తొక్కాయి. నగరంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ మహాపాదయాత్రలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అంతకుముందు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు యాత్రలో పాల్గొన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొజంజాహి మార్కెట్ వరకు ఈ పాదయాత్ర సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో రహదారులన్నీ కాషాయమయంగా మారాయి. యాత్ర ముగింపు సందర్భంగా మొజంజాహి మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగించనున్నారు. అమిత్ షా రాకతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వెల్లివిరిసింది.
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు

