HBD Anuapama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ జోరు.. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్..!
అనుపమ పరమేశ్వరన్.. తెలుగు కుర్రాళ్ల కలల రాకుమారి. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రోజు బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. వరుస విజయాలతో జోరు పెంచిన ఈ బ్యూటీ.. ఫిబ్రవరి 18న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. Ess Kay Gee ఎంటర్టైన్మెంట్, బెంచ్‌మార్క్ స్టో రీటెల్లర్స్ బ్యానర్లపై వస్తున్న ప్యాన్ ఇండియన్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది అనుపమ. ఈ కొత్త ప్రాజెక్ట్‌తో అనుపమ తన సినిమాల వేగం మరింత పెంచిందని చెప్పొచ్చు. ఒక ఇంటెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆర్జే షాన్ దర్శకత్వం వహిస్తున్నారు. విశేషం ఏమిటంటే.. గతంలో అనుపమ, షాన్ కాంబినేషన్‌లో వచ్చిన ఓ షార్ట్ ఫిల్మ్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై అద్భుతమైన ఆదరణ లభించింది. ఇప్పుడు ఆ విజయవంతమైన జోడీ వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది.
ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..
ఈ సినిమాను ప్రముఖ స్టూడియో భాగస్వామ్యంతో శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, కిరణ్ బల్లపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది. సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు, కానీ త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. అనుపమ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాజెక్ట్ వివరాలను అధికారికంగా వెల్లడించింది. డిజిటల్ హిట్ తర్వాత బిగ్ స్క్రీన్‌పై ఈ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని చిత్ర బృందం చాలా నమ్మకంగా ఉంది. నిర్మాణ సంస్థల విషయానికొస్తే.. ఇటీవల జటాధర వంటి చిత్రాన్ని నిర్మించిన ఎస్కేజీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాతో తమ ప్రొడక్షన్ స్కేల్‌ను మరింత పెంచుకుంటోంది.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..
ముఖ్యంగా నిర్మాత ప్రేరణ అరోరాకు బాలీవుడ్‌లో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. గతంలో ఆమె రుస్తుం, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి వంటి జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సినిమాలు అందించారు. అలాంటి అనుభవం ఉన్న నిర్మాతలు ఈ ప్రాజెక్టులో భాగం కావడం సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇక అనుపమ ట్రాక్ రికార్డ్ చూస్తే.. ప్రేమమ్ మొదలుకొని కార్తికేయ 2, రాక్షసుడు, టిల్లు స్క్వేర్ వరకు చాలా విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతూ, చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ సినిమాతో పాటు క్రేజీ కళ్యాణం అనే మరో సినిమా కూడా చేస్తుంది అనుపమ పరమేశ్వరన్. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వైవిధ్యం చూపిస్తోంది. ఈ కొత్త థ్రిల్లర్ సినిమాతో అనుపమ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపిస్తుందని.. బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Actress Pratyusha : హీరోయిన్ ప్రత్యూష మృతి కేసు.. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..
