AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇదేం ట్విస్ట్.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 9.6 రేటింగ్

గత నెల చివరి వారంలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. కథ, కాన్సెప్ట్ పరంగా కొత్త సబ్జెక్ట్ అని ప్రశంసలు అందుకుంది. అయితే స్టార్ క్యాస్టింగ్ లేకపోవడంతో ఈ సినిమా లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. అయితే ఈ మిస్టరీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కేవలం మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: ఇదేం ట్విస్ట్.. సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 9.6 రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 17, 2026 | 2:56 PM

Share

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (ఏప్రిల్ 17) కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చేశాయి. ఉస్తాద్ భగత్ సింగ్, సంభవం అధ్యాయం పన్ను, యూత్, అలా చేరే సీతారాముని చెంతకు, టోస్టర్ వంటి సినిమాలతో పాటు పోచమ్మ, మట్కాకింగ్ లాంటి ఆసక్తికర వెబ్ సిరీస్ లు కూడా ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటు ఒక తెలుగు మిస్టరీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా.. గత నెల చివరి వారంలోనే ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. కథ, కాన్సెప్ట్ పరంగా చాలా బాగుందన్న ప్రశంసలు అందుకుంది. అయితే స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం, పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడంతో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో మూడు వారాలకే ఈ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హీరో ఒక ఫోలే ఆర్టిస్ట్. అంటే సినిమాల్లో వినిపించే రకరకాల సౌండ్స్ క్రియేట్ చేస్తుంటాడు. ఇతడికి చిన్నప్పటి నుంచి సుయోధన అనే ఓ మిస్టీరియస్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అప్పుడే కళ్ల ముందు దుర్యోధనుడి రూపం కనిపిస్తుంటుంది. అలా జరిగినప్పుడల్లా హీరో చాలా భయపడుతుంటాడు. మరోవైపు హీరో తండ్రి ప్రకాశ్(సాయికుమార్) నాటకాలు వేస్తుంటాడు. ఈయనకు ధుర్యోధనుడి పాత్రంటే చాలా ఇష్టం. అలా ఓ సారి ఈ పాత్ర వేసిన తర్వాత ఆయన దారుణ హత్యకు గురవుతాడు. అసలు సుయోధన అనే శబ్దం హీరోకి వినిపించడానికి కారణమేంటి? హీరో తండ్రిని ఎవరు చంపారన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు సుయోధన. ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో, హీరోయిన్లుగా నటించారు. అలాగే, డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ, విష్ణు, దేవి ప్రసాద్, రాజశ్రీ నాయర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మాధవ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై బోసుబాబు నిడుమోలు నిర్మించగా… జై క్రిష్ మ్యూజిక్ అందించారు. థియేటర్లలో పెద్దగా ఆడని ఈ సినిమా ఇప్పుడు ఏకంగా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా, జియో హాట్ స్టార్‌లోనూ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

రెండు ఓటీటీల్లో సుయోధన స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..