AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suman Setty: కోటి రూపాయలు ఇస్తే ఏం చేస్తావ్‌? సుమన్ శెట్టి ఆన్సర్ వింటే కళ్లు చెమర్చుతాయి

టాలీవుడ్ కమెడియన్, ప్రముఖ నటుడు సుమన్ శెట్టి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. విజేతగా నిలవకున్నా తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ అభిమానుల మనసులు గెల్చుకున్నారు. తాజాగా సుమన్ శెట్టి ఓ ఇంటర్వ్యూకు హాజరై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Suman Setty: కోటి రూపాయలు ఇస్తే ఏం చేస్తావ్‌? సుమన్ శెట్టి ఆన్సర్ వింటే కళ్లు చెమర్చుతాయి
Suman Shetty
Basha Shek
|

Updated on: Apr 16, 2026 | 9:45 PM

Share

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఓ వెలుగు వెలిగాడు సుమన్ శెట్టి. ‘అధ్యక్షా’ అంటూ తనదైన నటనతో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. అయితే ఉన్నట్లుండి ఇండస్ట్రీకి దూరమయ్యాడు సుమన్ శెట్టి. చాలా ఏళ్ల పాటు వెండితెరపైనే కనిపించలేదు.అయితే గతేడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడీ స్టార్ కమెడియన్. కప్పు కొట్టకపోయినా తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనుసులు గెల్చుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో సుమన్ శెట్టి పెర్ఫామెన్స్ చూసి అతనికి మళ్లీ సినిమా అవకాశాలు వస్తాయనుకున్నారు అభిమానులు. నటుడిగా మళ్లీ బిజీ అవుతాడనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. ఈ క్రమంలో తాజాగా ఓ టాక్ షోకు హాజరయ్యాడు సుమన్ శెట్టి. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇదే క్రమంలో కోటి రూపాయలు ఇస్తే మీరు ఏం చేస్తారు అన్న యాంకర్ ప్రశ్నకు సుమన్ శెట్టి ఇచ్చిన సమాధానం అందరినీ కదిలించింది. ‘ నేను ఆ డబ్బులను మొదట మా అక్కకు ఇస్తాను .ఎందుకంటే ఇంటి ఆడపిల్ల బాగుంటేనే మనం బాగుంటామని మా నాన్నగారు చెప్పారు. ఇంటి ఆడపిల్ల కన్నీరు పెట్టకుండా చూసుకోవాలని ఆయన చెప్పిన మాటలను నేను ఇప్పటికీ ఎప్పటికీ ఫాలో అవుతున్నాను’ అని చెప్పుకొచ్చారు సుమన్.

కాగా తనకు సినిమా అవకాశాలు రాకపోవడంపై సుమన్ శెట్టి బాగా ఎమోషనల్ అయ్యాడు. ‘సినిమా ఇండస్ట్రీలో గ్యాప్ అనేది ఎలా ఉంటుందో నాకు పెద్దగా తెలియదు. ఒకానొక సమయంలో నెలకు 30 రోజులు ఉంటే ఆ 30 రోజులు కూడా నేను షూటింగ్ లో పాల్గొన్నాను. నా నటనకు ప్రతీకగా ఒక నంది అవార్డు కూడా వచ్చింది. సినిమాలలో నాకు చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా ఉండదు. అయితే అవకాశాలు లేకనే నాకు గ్యాప్ వచ్చింది. నాకు కాళ్లు, చేతులలో ఫ్యాక్చర్ అయ్యాయి. నాలో ఉన్న లోపం ఏంటి? ఎందుకు నాకు సినిమా అవకాశాలు రావడం లేదు? నాకు సినిమా షూటింగ్ తప్ప ఇంకోటి తెలియదు.. రాదు…అందుకే నేను చాలా బాధపడుతున్నాను’ అని ఎమోషనల్ అయ్యాడు సుమన్ శెట్టి. ప్రస్తుతం ఈ కమెడియన్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ టీమ్ తో సుమన్ శెట్టి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?
ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?
RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్
రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
నేటి నుంచే బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌!
నేటి నుంచే బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌!
రామ్ ప్రసాద్‏ను ఎత్తిపడేసిన రోహిత్.. వంశీ ఆన్ ఫైర్..
రామ్ ప్రసాద్‏ను ఎత్తిపడేసిన రోహిత్.. వంశీ ఆన్ ఫైర్..
రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ విషయంలో ఏపీ సర్కార్ కీలక మార్పులు
రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ విషయంలో ఏపీ సర్కార్ కీలక మార్పులు
ప్రధాని మోదీ ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి సీక్రెట్స్‌ ఏంటో తెలుసా?
ప్రధాని మోదీ ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి సీక్రెట్స్‌ ఏంటో తెలుసా?