AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridevi: జురాసిక్ పార్క్ సినిమా హీరోయిన్ ఛాన్స్ !! లైట్ తీసుకుని నో చెప్పిన శ్రీదేవి

Sridevi: జురాసిక్ పార్క్ సినిమా హీరోయిన్ ఛాన్స్ !! లైట్ తీసుకుని నో చెప్పిన శ్రీదేవి

Phani CH
|

Updated on: Apr 17, 2026 | 12:25 PM

Share

శ్రీదేవి జురాసిక్ పార్క్ ఆఫర్‌ను తిరస్కరించడం సినీ చరిత్రలో ఒక ఆశ్చర్యకరమైన విషయం. 1993లో స్టీవెన్ స్పీల్‌బర్గ్ అద్భుతమైన ఈ చిత్రాన్ని ఆఫర్ చేసినా, ఇండియన్ సినిమాను వదిలి హాలీవుడ్‌కు వెళ్ళడం ఇష్టం లేదని ఆమె తెలిపారు. కెరీర్ పీక్స్‌లో ఉండడం, అప్పట్లో హాలీవుడ్ చిత్రాల పట్ల ఆమె దృక్పథం ఈ నిర్ణయానికి దారితీశాయి. ఆమె నిర్ణయంతో, ఆ పాత్రను ఏరియానా రిచర్డ్స్ పోషించారు.

హాలీవుడ్‌ సినిమాల్లో అవకాశమొస్తే ఎగిరి గంతేస్తారు. డబ్బుకు డబ్బు.. ఇంటర్నేషనల్ బ్రాండింగ్.. ఇంకా కావాల్సినంత ప్రచారం. ఇవన్నీ వచ్చేస్తున్నప్పుడు ఎవరు కాదంటారు చెప్పండి. కానీ ఒక్కరు కాదన్నారు. ఏకంగా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బర్గ్‌ సినిమానే పక్కకు పెట్టేశారు. జురాసిక్ పార్క్ సినిమాలో నటించే ఛాన్స్‌నే లైట్ తీసుకున్నారు. అయితే ఇలా హాలీవుడ్ ఆఫర్ ను లైట్ తీసుకుంది ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి. 1993లో విడుదలైన ‘జురాసిక్‌ పార్క్‌’ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు కాసుల వర్షం కురిసింది. ఇండియాలోనూ రికార్డు కలెక్షన్లు సాధించింది. ఇప్పటికీ కూడా ఈ జురాసిక్ పార్క్ సినిమాలు వస్తున్నాయంటే ఫస్ట్ షోకు వెళ్లి చూసే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి చిత్రంలో నటించే అవకాశాన్ని శ్రీదేవి కాదనుకుందట. అందుకు గల కారణాన్ని స్వయంగా శ్రీదేవే ఓ సందర్భంలో పంచుకున్నారు. మీరెందుకు ‘జురాసిక్‌ పార్క్‌’ సినిమాలో నటించేందుకు నో చెప్పారు ఓ త్రోబ్యాక్ ఇంటర్వ్యూలో హోస్ట్ శ్రీదేవిని అడగగా.. ఆమె ఆన్సరిచ్చారు. ‘ఆ రోజుల్లో హాలీవుడ్‌ సినిమాలంటే ఏలియన్‌లా చేయడమే. కానీ, ఇప్పుడు అదొక గౌరవం. అయితే నాకు ఇండియన్ సినిమాలను వదిలి పెట్టి హాలీవుడ్ సినిమాలను చేయడం ఇష్టం లేదు అందుకే సున్నితంగా జురాసిక్ పార్క్ ఆఫర్ ను రిజెక్ట్ చేశానంటూ శ్రీదేవి చెప్పుకొచ్చారు. దీనికి తోడు ఆ సమయంలో శ్రీదేవి కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉందట. అందుకే ఉన్నట్లుండి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని విడిచి పెట్టడం ఇష్టం లేక స్టీవెన్ స్పీల్ బర్గ్ ఆఫర్ కు నో చెప్పారట శ్రీదేవి. అయితే శ్రీదేవి నో చెప్పడంతో.. ఆ పాత్రకు హాలీవుడ్‌ నటి ఏరియానా రిచర్డ్స్‌ను తీసుకున్నారు స్పీల్ బర్గ్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెంగళూరులో రూ.500తో రోజు గడవడం సాధ్యమేనా ??

ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు ఎంత పెరుగుతాయంటే..!

Telangana Orange Alert: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ

Follow Us