AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..

ఓ వ్యక్తి బయటకు వెళ్దామని ఇంటి దగ్గర పార్క్ చేసిన తన బైక్‌ను తీసుకునేందుకు వెళ్లాడు. బైక్‌ తీసి కీ ఆన్‌ చేద్దామని వెళ్లగా అక్కడ ఏవో శబ్ధాలు వినిపించాయి. ఏంటా అని కాస్తా ఎనక్కి జరిగి క్షుణ్నంగా పరిశీలించాడు. ఇంకేముంది ఓ నాగుపాము బైక్ దూమ్‌లో బుసలు కొడుతూ కనిపించింది. అది చూసి ఆవ్యక్తి ఒక్కసారిగా కంగుతిన్నాడు. స్థానికుల సహాయంతో పామును అక్కడి నుంచి వెళ్లగొట్టాడు.

Viral Video: బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
Cobra Found In Parked Motorcycle
P Shivteja
| Edited By: |

Updated on: Apr 17, 2026 | 2:04 PM

Share

సమ్మర్ వచ్చేసింది. బయట ఎండు మండిపోతున్న.. భానుడి భగభగలకు మానవులం మనమే తట్టుకోలేకపోతున్నాం, ఇక మూగజీవులు, క్షీరదాల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఎక్కడ చల్లగా అనిపిస్తే అందులోకి దూరేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. బయట వేడిని తట్టుకోలేక ఓ పాము ఇంటి దగ్గర పార్క్ చేసిన ఓ బైక్‌లోకి దూరింది. అది గమనించకుండా బైక్‌ డ్రైవ్ చేసిన వ్యక్తి మార్గ మధ్యలో పామును చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కుకుట్లపల్లి గ్రామానికి చెందిన జంగా ప్రశాంత్ అనే వ్యక్తి తన పల్సర్ బైక్ పై బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఎప్పటిలాగే ఇంటి వద్ద పార్క్ చేసిన బైక్ తీస్తుండగా అతనికి బైక్ ముందు భాగం నుంచి ఏవో వింత శబ్ధాలు వినిపించాయి. అనుమానం వచ్చి ఏంటా అని క్షుణ్నంగా పరిశీలించి చూడగా.. బైక్ డోమ్ లోపల నాగు పాము తిష్టవేసిన దృశ్యం కనిపించింది. అది చూసిన ప్రశాంత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

దీంతో భయాందోళనకు గురైన ప్రశాంత్ వెంటనే కేకలు వేసి స్థానికులకు సమాచారం అందించాడు..గ్రామస్తులు అక్కడికి చేరుకుని సుమారు అరగంట పాటు తీవ్రంగా శ్రమించి బైక్ డోమ్ భాగాలను విప్పి, అతి కష్టం మీద ఆ నాగుపామును బయటకు పారదోలారు..అప్పటివరకు ప్రాణభయంతో వణికిపోయిన ప్రశాంత్ కుటుంబం పాము వెళ్ళిపోవడంతో ఊపిరి పీల్చుకుంది. అక్కడే ఉన్న కొందరు ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
బయటకెళ్దామని బండి తీశాడు.. తాళం ఆన్ చేస్తుండగా కనిపించింది చూసి..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
మీరు కారుకు ఇలాంటి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయా? అయితే జాగ్రత్త
మీరు కారుకు ఇలాంటి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయా? అయితే జాగ్రత్త
వెల్లుల్లి కోడిగుడ్డు కారం.. హోటల్ స్టైల్ ఇంట్లోనే
వెల్లుల్లి కోడిగుడ్డు కారం.. హోటల్ స్టైల్ ఇంట్లోనే
చక్రపాణి 'చక్రవ్యూహం' అదిరిపోయిందిగా.. రూ. 2.65 కోట్లు స్వాహా..
చక్రపాణి 'చక్రవ్యూహం' అదిరిపోయిందిగా.. రూ. 2.65 కోట్లు స్వాహా..