AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అర్ధరాత్రి అపార్ట్‌మెంట్‌లో తచ్చాడుతూ కనిపించిన నల్లటి ఆకారం.. తెల్లారి సీసీ కెమెరా చూడగా..

భాగ్యనగరంలోని మలక్‌పేట నియోజకవర్గంలో అర్ధరాత్రి వేళ చోటు చేసుకున్న ఒక వింత ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఒంటిపై నూలుపోగు లేకుండా ఓ వ్యక్తి అపార్ట్‌మెంట్ ఫ్లోర్లలో కలియతిరుగుతూ, తలుపులు తడుతూ చేసిన హంగామా అంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.

Hyderabad: అర్ధరాత్రి అపార్ట్‌మెంట్‌లో తచ్చాడుతూ కనిపించిన నల్లటి ఆకారం.. తెల్లారి సీసీ కెమెరా చూడగా..
Apartment
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Apr 17, 2026 | 12:22 PM

Share

అర్ధరాత్రి సమయం ఓ వ్యక్తి అటూ.. ఇటూ.. ఒంటరిగా తిరుగుతున్నాడు. అది కూడా ఒంటిపై ఎలాంటి బట్టలు లేకుండా.. వయసు సుమారుగా 35 నుంచి 40 ఏళ్లపైనే ఉంటుంది. పైగా ఆ వ్యక్తి ప్రవర్తన సాధారణంగా అనిపించలేదు. కొంచెం విచిత్రంగా.. భయం కలిగించే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. అసలు ఎవరు ఆ వ్యక్తి.. ఎందుకు అలా తిరిగాడనే విషయాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వింత ఘటన మరెక్కడో జరిగింది కాదు.. మన హైదరాబాద్ మహా నగరంలోనే చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నగరంలోని మలక్‌పేటలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి ఓ వ్యక్తి బట్టలు లేకుండా అపార్ట్‌మెంట్‌లో సంచరించడం తీవ్ర కలకలం రేపింది. ముసారాంబాగ్ ప్రాంతంలోని గంగాధర్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన మొత్తం వ్యవహారం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. నలభయేళ్లకు దగ్గరగా ఉండే ఓ వ్యక్తి పూర్తిగా బట్టలు లేకుండా ఉండి ఆ అపార్ట్‌మెంట్‌లో అన్ని ఫ్లోర్లలో కలియతిరుగుతూ ఫ్లాట్లలోకి ప్రవేశించేందుకు చూశాడు. చాలా జుగుప్సాకరంగా వ్యవహరించాడు. ఒక్కో ఇంటి ముందు ఆగి తలుపును తట్టడం, తొంగి తొంగి చూసేందుకు ప్రయత్నించడం ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అలా తలుపును తట్టినప్పుడు ఎవరైనా స్పందించినా లేదా గమనించినా వెంటనే అక్కడి నుంచి పరుగులు తీస్తూ మరోచోటికి పరుగులు పెట్టాడు.

ఫ్లోర్లలో చాలాసేపు తిరిగిన అనంతరం భవనం కింద పార్కింగ్ ప్రదేశంలో కాసేపు పరుగులు తీశాడు. అటూ ఇటూ చుట్టుపక్కల విచిత్రమైన చూపులతో చూడడం, ఉన్నఫళంగా పరిగెత్తడం, దేనినైనా చూసి భయపడుతున్నట్లు వ్యవహరించడం ఇదంతా చాలా చాలా వింతగా ఉంది. అతని ప్రవర్తన బట్టి మతిస్థిమితం సరిగా లేనట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డవడంతో అది చూసి ఆ అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీంతో ఘటనపై అపార్ట్‌మెంట్‌ వాసులు మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కానీ, ఆ వ్యక్తి వింత ప్రవర్తనకు మాత్రం కారణాలు ఇంకా తెలియడం లేదు. వీడియోలో ఉన్న వ్యక్తి పోలికలతో చుట్టుపక్కల పరిసరాల్లో ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు పూర్తిస్థాయి కొనసాగిస్తున్నారు. వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని.. స్థానికులు పోలీసులకు సహకారం అందించాలని తెలిపారు.

ఇది చదవండి: హైదరాబాద్ టూ నరసాపురం.. పాస్టర్ ఇంటికి రెండు పే..ద్ద లగేజీలు.. ఓపెన్ చేయగా

Follow Us
అర్ధరాత్రి అపార్ట్‌మెంట్‌లో తచ్చాడుతూ కనిపించిన నల్లటి ఆకారం..
అర్ధరాత్రి అపార్ట్‌మెంట్‌లో తచ్చాడుతూ కనిపించిన నల్లటి ఆకారం..
అతనితో అలాంటిది ఏమీ లేదు.. అదే ఉంటే
అతనితో అలాంటిది ఏమీ లేదు.. అదే ఉంటే
ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు ఎంత పెరుగుతాయంటే..!
ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు ఎంత పెరుగుతాయంటే..!
హోటల్ లాంటి క్రిస్పీ దోశలు కావాలా? మీ వంటగదిలో ఈ పెనం ఉండాల్సిందే
హోటల్ లాంటి క్రిస్పీ దోశలు కావాలా? మీ వంటగదిలో ఈ పెనం ఉండాల్సిందే
ఐపీఎల్ 2026 నంబర్లు చూస్తుంటే సూర్య రిటైర్మెంట్ దగ్గర్లోనే ఉందా?
ఐపీఎల్ 2026 నంబర్లు చూస్తుంటే సూర్య రిటైర్మెంట్ దగ్గర్లోనే ఉందా?
తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు.. రైల్వేశాఖ శుభవార్త
తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు.. రైల్వేశాఖ శుభవార్త
నిప్పుల కొలిమిలా తెలంగాణ.. పలు జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ
నిప్పుల కొలిమిలా తెలంగాణ.. పలు జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ
సౌందర్య ఆ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది..
సౌందర్య ఆ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది..
అతి తక్కవ ధరలో అరకు అందాలు చూడొచ్చు.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్..
అతి తక్కవ ధరలో అరకు అందాలు చూడొచ్చు.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్..
నెలకు మీ ఇంట్లో ఎంత నూనె వాడుతున్నారు? ఆరోగ్యంగా ఉండాలంటే..
నెలకు మీ ఇంట్లో ఎంత నూనె వాడుతున్నారు? ఆరోగ్యంగా ఉండాలంటే..