OTT Cinema : బాల్యాన్ని గుర్తు చేసే మధుర జ్ఞాపకాలు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న సమ్మర్ హాలిడేస్..
బాల్య జ్ఞాపకాలు, స్నేహం, కుటుంబ బంధాల నేపథ్యంలో రూపొందిన తెలుగు చిత్రం సమ్మర్ హాలిడేస్. ఇన్నాళ్లు థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. డిసెంబర్ నెలలో ప్రతి శుక్రవారం కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ప్రముఖ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

వేసవి సెలవులు అనేది ప్రతీ ఒక్కరికీ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. బాల్యంలో గడిపిన వేసవి సెలవులు, స్నేహితులతో ఆడుకోవడం, అమ్మమ్మ, తాతయ్యలతో గడపడం, సొంత ఊరికి వెళ్లడం అనేవి ఎప్పటికీ తీపి గుర్తులుగానే ఉంటాయి. అలాంటి నోస్టాల్జిక్ ఫీలింగ్‌ను కలిగించేలా ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్న సినిమా సమ్మర్ హాలీడేస్. థియేటర్లో ఈ మూవీకి మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్ 4 నుంచి ఈ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. శ్రీకర్ నయన్ తన తొలి చిత్రంతోనే దర్శకుడిగా సత్తా చాటుకున్నారు. ‘సమ్మర్ హాలిడేస్’ సినిమాతో అందరినీ బాల్యంలోకి తీసుకు వెళ్లారు. గోదావరి ప్రాంతంలోని ఒక సుందరమైన పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఆర్.వి (అరుణ్ దేవ్) అనే బాలుడు తన వేసవి సెలవుల్లో తన అమ్మమ్మ (జయసుధ) ఊరికి వెళ్లడంతో ఈ చిత్రం మొదలవుతుంది. అక్కడ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కె.వి (రోహన్ రాయ్) అనే బాలుడితో మైత్రి మొదలవుతుంది. రెండు విభిన్న ప్రపంచాల నుండి వచ్చినప్పటికీ ఆ అబ్బాయిల మధ్య ఊహించని స్నేహం ఏర్పడుతుంది. ఒక సాధారణ వేసవి సెలవుగా ప్రారంభమైన వారి ప్రయాణం తరగతి గది పరిధిని దాటిన అన్వేషణ, నవ్వులు, సాహసం, జీవిత పాఠాలతో కూడిన ఒక అసాధారణ ప్రయాణంగా మారుతుంది.
ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..
బాల్యపు అమాయకత్వాన్ని చాటేలా ఈ చిత్రం ఉంటుంది. మానవ సంబంధాలలోని ఆత్మీయతను, స్నేహంలోని సౌందర్యాన్ని ప్రతిబింబించేలా సినిమాని తెరకెక్కించారు. జీవితంలోని అత్యంత విలువైన జ్ఞాపకాలు అత్యంత సాధారణ క్షణాల నుండే పుడతాయని ఈ చిత్రం సున్నితంగా గుర్తు చేస్తుంది. శ్రీకర్ నయన్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన సమ్మర్ హాలిడేస్ కథ గోదావరి ప్రాంతంలోని ఓ అందమైన గ్రామ నేపథ్యంలో సాగుతుంది. హైదరాబాద్ నుంచి వేసవి సెలవుల కోసం తన అమ్మమ్మ (జయసుధ) గ్రామానికి వెళ్లే ఆర్‌వీ (అరుణ్ దేవ్) చుట్టూ కథ తిరుగుతుంది. అక్కడ ఆర్థిక ఇబ్బందులతో ఎదుగుతున్న స్థానిక కుర్రాడు కేవీ (రోహన్ రాయ్)తో ఆర్‌వీకి పరిచయం ఏర్పడి, ఇద్దరి మధ్య ఏర్పడే ప్రత్యేక స్నేహం, చిన్ననాటి సంతోషాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.
ఈ చిత్రంలో రోహన్ రాయ్, అరుణ్ దేవ్, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించగా, వాసుకి ఆనంద్, రాజీవ్ కనకాల, బేబీ ఖుషి, హర్షవర్ధన్, రమణ భార్గవ్, హర్షిణి కొడూరి, మహేష్ చింతల కీలక పాత్రలు పోషించారు. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, వీజీబీ ఫిల్మ్స్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడిగా శ్రీకర్ నయన్ తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమా, చిన్నారులతో పాటు పెద్దలకు కూడా తమ వేసవి సెలవుల జ్ఞాపకాలను గుర్తుచేసేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. థియేటర్లలో విడుదలైన సమయంలో పెద్ద సినిమాల పోటీ ప్రభావం కనిపించినప్పటికీ, కథాంశం పరంగా మంచి గుర్తింపు పొందిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ వేదిక ద్వారా మరింత మంది కుటుంబ ప్రేక్షకులకు చేరువ కానుంది. చిన్నచిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కునే బాల్యంలోని సహజత్వాన్ని చూపే సమ్మర్ హాలిడేస్, డిసెంబర్ 4 నుంచి సోనీ లివ్‌లో వీక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..
