AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతను ఎక్కడ గంభీర్..? ఇక ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు.. రెండో మ్యాచ్‌ కూడా అస్సామే..!

India vs New Zealand Test: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మహమ్మద్ సిరాజ్ లేకపోవడంపై సునీల్ గవాస్కర్ టీం మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా విమర్శించారు. కీలక బౌలర్‌ను పక్కన పెట్టడం జట్టుకు నష్టమని గవాస్కర్ పేర్కొన్నారు. ప్రస్తుతం టీమిండియా బౌలర్లు కివీస్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోతుండటంతో జట్టు కష్టాల్లో పడింది.

అతను ఎక్కడ గంభీర్..? ఇక ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు.. రెండో మ్యాచ్‌ కూడా అస్సామే..!
Ind Vs Nz 2nd Test Gavaskar Comments
Venkata Chari
|

Updated on: Nov 28, 2026 | 7:21 AM

Share

India vs New Zealand Test: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీం ఇండియా బౌలింగ్‌లో పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. తొలి టెస్టులో ఎదురైన పరిస్థితులే రెండో టెస్టులోనూ పునరావృతమవుతున్నాయి. భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీసిన తర్వాత న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమవుతున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 246 పరుగులు సాధించింది. రాను రాను బ్యాటింగ్‌కు మరింత అనుకూలించే ఈ పిచ్‌పై బౌలర్లకు పెద్ద సవాలు ఎదురైంది. బౌలర్లకు ఏదైనా అవకాశం ఉందంటే అది తొలి రోజు ఆటలోనేనని, అయితే టీం ఇండియా బౌలర్లు ఈ అవకాశాన్ని కేవలం 50% మాత్రమే సద్వినియోగం చేసుకున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో, టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు వరుసగా రెండో టెస్టులో కూడా చోటు దక్కకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. వెల్లింగ్‌టన్ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన తర్వాత సిరాజ్‌ను పక్కన పెట్టడంపై విస్తృత చర్చ జరిగింది. రెండో టెస్టులోనైనా అతన్ని జట్టులోకి తీసుకుంటారని అంతా భావించినప్పటికీ, మరోసారి సిరాజ్ బెంచ్‌కే పరిమితం కావడంతో టీం మేనేజ్‌మెంట్‌పై అటు అభిమానుల నుంచి, ఇటు మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎక్కువమంది చదివినది: Team India: ముగ్గురు భారత ఆటగాళ్లకు షాక్.. వన్డే జట్టులో ఇకపై నో ఎంట్రీ..?

ఇవి కూడా చదవండి

ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో భాగంగా భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మహమ్మద్ సిరాజ్ కావడం గమనార్హం. ఆరేళ్ల క్రితం టెస్టుల్లో అరంగేటం చేసినప్పటి నుండి, ఒక సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా సిరాజ్ బెంచ్‌కే పరిమితం కావడం ఇదే మొదటిసారి. అతని ఫామ్, ప్రదర్శన దృష్ట్యా ఈ నిర్ణయంపై పలువురు మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

భారత మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఈ అంశంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. “టీం మేనేజ్‌మెంట్ తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు జట్టుకు సరైనవి కావు. సిరాజ్ జట్టులో ఉండి ఉంటే ఖచ్చితంగా కీలక సమయాల్లో వికెట్లు తీసేవాడు. అతను ప్రస్తుతం ఫామ్‌లో లేడా? ఈ మధ్య జరిగిన చివరి వన్డేలో కూడా రెండు కీలక వికెట్లు తీశాడు. అలాగే మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా WTC సైకిల్‌లో అతనికి అద్భుతమైన వికెట్ టేకింగ్ రికార్డ్ ఉంది. ఇలాంటి సమయంలో అతన్ని ఆడించకపోవడం టీం ఇండియాకే నష్టం” అని గవాస్కర్ మండిపడ్డారు.

ఎక్కువమంది చదివినది: Mohammed Siraj: 6 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన మహమ్మద్ సిరాజ్‌.. అదేంటంటే?

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టీం ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్వయంగా సిరాజ్‌ను “వరల్డ్ క్లాస్ బౌలర్” అని, అతను చాలా బాగా బౌలింగ్ చేస్తాడని ప్రశంసించారు. అలాంటి బౌలర్‌ను ఎందుకు పక్కన పెడుతున్నారో అర్థం కావడం లేదని, ఈ విషయంలో టీం మేనేజ్‌మెంట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. జట్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న బౌలర్‌ను కీలక టెస్టు మ్యాచ్‌లలో పక్కన పెట్టడం జట్టు వ్యూహంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. సిరాజ్ లేకపోవడం బౌలింగ్ విభాగానికి బలాన్ని తగ్గించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us