అన్ని వ్యాధులకు ఇదొక్కటే మందు.. పోషకాలు ఓ రేంజ్‌లో ఉంటాయి!
17 April 2026
Jyothi Gadda
ప్రకృతి ప్రసాదించిన మొక్కలలో బొప్పాయికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా మనం పండును తిని ఆకులను పక్కన పడేస్తుంటాం. కానీ బొప్పాయి ఆకులలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే!
పోషకాల నిధి బొప్పాయి ఆకుల్లో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. కేలరీలు తక్కువ, కానీ విటమిన్లు, మినరల్స్ మాత్రం ఫుల్‌గా ఉంటాయి.
ముఖ్యంగా, ఇమ్యూనిటీ పవర్‌ను పెంచే విటమిన్లు A, C, E, ఎముకలను బలంగా ఉంచే విటమిన్ K, బాడీకి ఎనర్జీ ఇచ్చే B విటమిన్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
అంతేకాదు, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ కూడా ఉండటంతో, ఈ టీ ఒక కంప్లీట్ న్యూట్రిషన్ డ్రింక్‌గా పనిచేస్తుంది.
డెంగ్యూ సోకినప్పుడు రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా పడిపోతుంది. బొప్పాయి ఆకు రసం తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్స్ పెరగడమే కాకుండా, జ్వరం వల్ల వచ్చే నీరసం తగ్గుతుందని అనేక పరిశోధనల్లో తేలింది.
బొప్పాయి ఆకుల్లో ఉండే ఎంజైమ్‌లు ప్రోటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేస్తాయి. దీనివల్ల మలబద్ధకం, అజీర్తి, కడుపులో మంట వంటి సమస్యలు దూరమవుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక చక్కని పరిష్కారం.
చర్మ, కేశ సంరక్షణ: ఈ ఆకుల్లో విటమిన్ సి మరియు ఇ పుష్కలంగా ఉంటాయి. దీని రసాన్ని చర్మానికి రాస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. అలాగే స్కాల్ప్‌పై రాస్తే చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
ఎలా తీసుకోవాలి?: తాజా బొప్పాయి ఆకులను శుభ్రంగా కడిగి, కొంచెం నీరు కలిపి మిక్సీ పట్టి రసం తీసుకోవాలి. ఈ రసం చాలా చేదుగా ఉంటుంది కాబట్టి, కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకుని తాగవచ్చు.