కారం పెసరట్టు ఇలా చేస్తే.. పిల్లలు ఎంతో ఇష్టంగా లాగిస్తారు
Prasanna Yadla
17 April 2026
Pic credit - Pixabay
కారం పెసరట్టు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, దీనికి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు.
కారం పెసరట్టు
మరి, లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
ఎలా తయారు చేయాలంటే
కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు పెసలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం మొక్క, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచి తగినంత ఉప్పు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టేబుల్ స్పూన్ కారం, కొత్తిమీర, నూనెను తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
మీరు ముందుగా పెసలను కడిగి 12 గంటల పాటు నానాబెట్టుకోవాలి. ఆ తరవాత మిక్సీ పట్టుకోవాలి.
స్టెప్ -1
మిక్సీ పట్టుకున్న పెసలలో పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, జీలకర్ర కూడా మెత్తగా పట్టుకోవాలి.
స్టెప్ -2
ఉల్లిపాయ ముక్కలు, కారం, కొత్తిమీర కూడా దానిలో కలిపి మిశ్రమంలాగా చేసుకోవాలి
స్టెప్ -3
ఇప్పుడు పాన్ గ్యాస్ మీద పెట్టి దోసె పాన్ పెట్టి ఆయిల్ వేసి నూనె రాయాలి
స్టెప్ - 4
పాన్‌పై పోసి దోసె పోసి దానిలో కారం చల్లి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి.