AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చోరీ చేయడం ఈజీగా దొరికిపోవడం ఈ దొంగ ప్రత్యేకత

చోరీ చేయడం ఈజీగా దొరికిపోవడం ఈ దొంగ ప్రత్యేకత

Phani CH
|

Updated on: Apr 17, 2026 | 1:06 PM

Share

మేడారంలో చోరీకి పాల్పడిన ఓ పాత నేరస్తుడిని పోలీసులు అతడి విలక్షణ నడక ఆధారంగా పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన ఈ ప్రత్యేక నడక, గత నేరాల్లో అతడిని గుర్తించేందుకు సహాయపడింది. దివ్యాంగుడైన ఈ దొంగ, జాతర సీజన్‌లో తాళం వేసిన షాపులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తుంటాడు. చాకచక్యంగా దొంగతనాలు చేసినా, కెమెరాలకు చిక్కడం అతడికి అలవాటు. ప్రస్తుతం విచారణలో ఉన్నాడు.

కొన్నిసార్లు నేరస్తులు చేసే చిన్న తప్పులే వారిని పోలీసులకు దొరికిపోయేలా చేస్తాయి. కానీ, ఇక్కడ ఒక దొంగ విషయంలో అతని నడక శైలే కొంపముంచింది. మేడారంలోని ఒక షాపులో చోరీకి పాల్పడిన నిందితుడిని, అతని కదలికల ఆధారంగా పోలీసులు ఇట్టే పట్టేశారు. సీసీ కెమెరా ఫుటేజీలో అతని విలక్షణమైన నడకను చూసిన పోలీసులు.. వీడు మన పాత కస్టమరే! అని నిర్ధారించుకుని నిమిషాల్లో వేట మొదలుపెట్టారు. నార్లాపూర్‌కు చెందిన ఈ ప్రబుద్ధుడు పాత నేరస్తుడు. పైగా ఇతను దివ్యాంగుడు కావడంతో అతని నడకలో ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. కొద్దిరోజుల క్రితం మేడారంలోని ఒక దుకాణం తాళం పగలగొట్టి నగదు, సామాగ్రి అపహరించాడు. షాపులో ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. ఫుటేజీని పరిశీలించిన ఖాకీలు, ఆ నడకను బట్టి అతను గతంలో ఏటూరునాగారం ఆలయంలో, ఇతర ఇళ్లలో దొంగతనాలు చేసిన వ్యక్తి అని గుర్తుపట్టారు. జాతర సీజన్ కావడంతో మేడారానికి భక్తుల రద్దీ పెరుగుతుంది. ఇదే అదునుగా భావించి, తాళం వేసిన షాపులను టార్గెట్ చేస్తూ ఇతగాడు రెక్కీ నిర్వహిస్తుంటాడు. దొంగతనం చేయడంలో ఎంత ఆరితేరినా, ప్రతిసారీ కెమెరాకు చిక్కడం, పోలీసులకు దొరికిపోవడం ఇతని ప్రత్యేకత. ఇతని పరిస్థితి చూసి పోలీసులు కూడా “వీడికి దొంగతనమే ప్రవృత్తి.. కానీ దొరికిపోవడమే దరిద్రం” అని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ‘అదో టైపు’ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తల్లిదండ్రులు తినే చపాతీలలో ఎలుకల మందు కలిపిన కూతురు..

JD Chakravarthy: స్లో పాయిజన్‌ ఇచ్చారు.. చావు అంచులదాకా వెళ్లా..

‘హోటల్లో పని చేస్తున్నప్పుడు చూసి చిరు అవకాశం ఇచ్చారు.. కానీ

Sridevi: జురాసిక్ పార్క్ సినిమా హీరోయిన్ ఛాన్స్ !! లైట్ తీసుకుని నో చెప్పిన శ్రీదేవి

బెంగళూరులో రూ.500తో రోజు గడవడం సాధ్యమేనా ??

Follow Us