AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటిపై 250 టాటూలు.. అంతులేని హింస: భర్త వికృత చేష్టలకు బలైపోయిన 52 ఏళ్ల మహిళ కన్నీటి గాథ!

ఒక సంబంధం అనేది ప్రేమ, నమ్మకం మీద ఆధారపడి ఉండాలి, కానీ 52 ఏళ్ల జోక్‌కు అది ఒక అంతులేని పీడకలగా మారింది. ప్రేమ పేరుతో భాగస్వామిని హింసించడం, వారిపై అధికారం చెలాయించడం వంటి ఘటనలు సమాజంలో తరచూ వినిపిస్తుంటాయి. అయితే, ఒక వ్యక్తి తన ప్రేయసిని లొంగదీసుకోవడానికి ఆమె శరీరాన్నే ఒక బొమ్మలా మార్చి, ఏకంగా 250 సార్లు తన పేరును టాటూలుగా వేయించిన ఉదంతం ఇప్పుడు నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

ఒంటిపై 250 టాటూలు.. అంతులేని హింస: భర్త వికృత చేష్టలకు బలైపోయిన 52 ఏళ్ల మహిళ కన్నీటి గాథ!
Woman Forced to Tattoo Partner’s Name
Jyothi Gadda
|

Updated on: Apr 17, 2026 | 1:34 PM

Share

మనుషులు చేసే గాయాలు మానసికంగా ఎంత కృంగదీస్తాయో, వాటిని అధిగమించి నిలబడటం అంతకంటే ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుంది. ఒక విషపూరితమైన బంధంలో నలిగిపోయి, ప్రాణాపాయం నుండి బయటపడిన ఒక మహిళ తన జీవితాన్ని ఎంత ధైర్యంగా మార్చుకుందో ఈ వైరల్‌ స్టోరీ చెబుతుంది. ఒక మహిళ తన భాగస్వామి చేతిలో తీవ్రమైన వేధింపులకు గురైంది. ఆ హింస ఆమె శరీరంపై, మనసుపై చెరిగిపోని గాయాలను మిగిల్చింది. ఆ బంధం నుండి విముక్తి పొందిన తర్వాత కూడా, అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు ఆ పాత చేదు జ్ఞాపకాలు ఆమెను వెంటాడేవి.

తన మాజీ భాగస్వామి చేసిన పైశాచిక దాడి నుండి ప్రాణాలతో బయటపడిన ఒక మహిళ, తన శరీరంపై ఉన్న గాయాలను, ఆ చేదు జ్ఞాపకాలను చెరిపివేసి, తన జీవితాన్ని ఎలా పునర్నిర్మించుకుంటుందో తెలియజేసే ఒక సంఘటన షోషల్ మీడియాను సైతం షాక్‌ అయ్యేలా చేస్తుంది. తనపై జరిగిన ఘోరమైన దాడిలో శారీరకంగా, మానసికగా చితికిపోయిన సదరు మహిళ, తన రూపాన్ని పూర్తిగా మార్చుకుని ఒక సరికొత్త వ్యక్తిగా ఎదిగిన స్ఫూర్తిదాయక గాథ ఇది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వార్త పైశాచికత్వానికి పరాకాష్టగా కనిపిస్తోంది. తన భాగస్వామి నుండి ఎదురైన విపరీతమైన వేధింపుల కారణంగా ఒక మహిళ తన శరీరం, ముఖంపై సుమారు 250 సార్లు అతని పేరును టాటూలుగా వేయించుకోవాల్సి వచ్చింది. ఆ మహిళ తన భాగస్వామితో కలిసి ఉన్న సమయంలో అతను ఆమెను తీవ్రంగా వేధించేవాడని, ఆమె ఎక్కడికి వెళ్లినా, ఎవరితో మాట్లాడినా అనుమానించేవాడు. తనపై ఆమెకు ఉన్న భయాన్ని, తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి అతను ఆమె శరీరాన్ని టాటూలతో నింపేయాలని నిర్ణయించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఆమెకు ఇష్టం లేకపోయినా, శారీరక దాడులతో బెదిరించి ఆమె ముఖం, మెడ, చేతులు, వీపు.. ఇలా శరీరంలోని దాదాపు ప్రతి భాగంపై తన పేరును టాటూగా వేయించాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 250 సార్లు అతని పేరును పచ్చబొట్టుగా వేయించుకోవాల్సి రావడంతో ఆమె రూపమే మారిపోయింది. ఇది కేవలం శారీరక నొప్పి మాత్రమే కాకుండా, ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఒక మానసిక హింస. చాలా కాలం పాటు ఈ నరకాన్ని అనుభవించిన ఆమె, ఒకానొక సమయంలో ధైర్యం తెచ్చుకుని అతని నుండి తప్పించుకుంది. అనంతరం అధికారులను ఆశ్రయించి తనపై జరిగిన అఘాయిత్యాలను వివరించింది. సమాజంలో ఇలాంటి టాక్సిక్ సంబంధాల వల్ల మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదాలను ఈ ఘటన మరోసారి వెలుగులోకి తెచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us