AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెలకు మీ ఇంట్లో ఎన్ని లీటర్ల నూనె వాడుతున్నారు.? ఆరోగ్యంగా ఉండాలంటే ఈ హాఫ్ లీటర్ రూల్ పాటించండి!

చాలామంది హోటల్ ఫుడ్ కంటే ఇంటి భోజనం మేలు అనుకుంటారు. కానీ, ఇంట్లో వండే కూరలు, పప్పుల్లో నూనె ధారగా పోసే అలవాటు ఉంటే, అది తెలియకుండానే మిమ్మల్ని గుండె జబ్బుల వైపు నెడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో వండే ఆహారం ఎంత స్వచ్ఛమైనదైనా, అందులో వాడే నూనె పరిమాణం సరిగ్గా లేకపోతే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. ఒక కుటుంబం నెలకు ఎంత నూనె వాడాలి అనే దానిపై ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి.

నెలకు మీ ఇంట్లో ఎన్ని లీటర్ల నూనె వాడుతున్నారు.? ఆరోగ్యంగా ఉండాలంటే ఈ హాఫ్ లీటర్ రూల్ పాటించండి!
monthly oil consumption per family
Jyothi Gadda
| Edited By: |

Updated on: Apr 17, 2026 | 3:29 PM

Share

మన భారతీయ సంస్కృతిలో ఇంట్లో వండిన భోజనం ఉత్తమమైనదిగా చెబుతారు. మసాలాలతో నింపేసిన హోటల్ తిండి కంటే ఇంట్లో వండిన పప్పు – కూరగాయలు, చపాతీ, రొట్టె, అన్నంతో కూడిన సంపూర్ణ భోజనం ఎల్లప్పుడూ ఉత్తమమైనదని మనం గట్టిగా నమ్ముతాము. అయినప్పటికీ, ఇంట్లో వండిన ఆహారం తింటున్నప్పటికీ భారతీయ కుటుంబాల్లో ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఇంట్లో వండిన స్వచ్ఛమైన ఆహారం తిన్న తరువాత కూడా మనం ఎందుకు అనారోగ్యానికి గురౌతున్నామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? దీనికి ప్రధాన కారణం ఆహారంలో నూనెను అధికంగా వాడటమే అంటున్నారు పోషకాహార నిపుణులు.

ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబానికి నెలకు ఎంత నూనె సరిపోతుందో మనకు కచ్చితంగా తెలియదు. మనం ప్రతిరోజూ అవసరానికి మించి నూనెను వాడుతున్నాము. కొన్నిసార్లు పొరపాటున పప్పులో గానీ, కూరగాయలలో గానీ ఎంత పడితే అంత నూనె కలిపేస్తాము. ఇది అస్సలు చిన్న విషయం కాదు. మీరు ఒక నెలలో ఎన్ని లీటర్ల నూనెను వాడుతున్నారో ఎప్పుడైనా లెక్కించారా? మనలో చాలామంది ఇది చేయరు క్రమంగా ఈ నూనె అధిక వాడకం మన శరీరాన్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.

రోజువారీ పరిమితి ఎంత ఉండాలి?: న్యూట్రిషనిస్టుల ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు కేవలం 3 నుండి 4 చెంచాల (15-20 ml) నూనె లేదా ఫ్యాట్ మాత్రమే తీసుకోవాలి. ఇందులో మీరు వాడే వంట నూనె, నెయ్యి, వెన్న అన్నీ కలిసి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

బ్రేక్‌ఫాస్ట్: 1 స్పూన్

లంచ్: 1 స్పూన్

డిన్నర్: 1 స్పూన్

నెయ్యి: 1 స్పూన్

ఫ్యామిలీ లెక్కల విషయానికి వస్తే..:  ఒకవేళ మీ ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటే, రోజుకు మొత్తం 60 నుండి 80 ml నూనె సరిపోతుంది. ఈ లెక్కన ఒక కుటుంబానికి నెలకు 2 నుండి 2.5 లీటర్ల నూనె మాత్రమే ఖర్చు అవ్వాలి. దీనినే హాఫ్ లీటర్ రూల్’ అంటారు. అంటే ప్రతి వ్యక్తికి నెలకు సగటున 500 ml నుండి 600 ml నూనె కేటాయించాలి.

నూనె వాడకాన్ని తగ్గించడానికి చిట్కాలు:

స్పూన్ వాడండి: నూనెను బాటిల్ నుండి నేరుగా కడాయిలో పోయకండి. ఇలా చేయడం వల్ల ఎంత వాడుతున్నామో అంచనా ఉండదు. ఎప్పుడూ స్పూన్‌తో కొలిచి వేయండి.

స్మార్ట్ కుకింగ్: నాన్-స్టిక్ పాన్‌లను వాడటం వల్ల నూనె వాడకం తగ్గుతుంది. అలాగే వేయించిన ఆహార పదార్థాల కంటే ఉడికించిన లేదా స్టీమ్ చేసిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి.

కొవ్వు పూర్తిగా మానకండి: శరీరానికి విటమిన్ A, D, E, K లను గ్రహించడానికి కొవ్వు అవసరం. కాబట్టి నూనెను పూర్తిగా మానేయకుండా, పరిమితిలో వాడటం ముఖ్యం.

అధిక నూనె వాడకం రక్తనాళాల్లో అడ్డంకులను ఏర్పరుస్తుంది. కాబట్టి మీ వంటగదిలో నూనె వాడకాన్ని గమనించండి. హాఫ్ లీటర్ రూల్ పాటించడం ద్వారా మీ కుటుంబాన్ని ఊబకాయం, గుండె జబ్బుల నుండి కాపాడుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అన్నదాతల్లో ఆశలు రేపుతున్న ఆగస్టు.. రైతన్నకు వరుణుడి అదిరిపోయే..
అన్నదాతల్లో ఆశలు రేపుతున్న ఆగస్టు.. రైతన్నకు వరుణుడి అదిరిపోయే..
మనసులను కదలించే సినిమా.. సస్పెన్స్, థ్రిల్లర్ కాంబో సంచలనం..
మనసులను కదలించే సినిమా.. సస్పెన్స్, థ్రిల్లర్ కాంబో సంచలనం..
చైనా భీకర AI వార్‌ఫేర్ ప్లాన్.. భారత్ కౌంటర్ వ్యూహం ఇదే..!
చైనా భీకర AI వార్‌ఫేర్ ప్లాన్.. భారత్ కౌంటర్ వ్యూహం ఇదే..!
పుల్ షాట్‌తోనే పిచ్చెక్కిస్తారయ్యో.. ఫస్ట్ పేరు చూస్తే పూనకాలే..!
పుల్ షాట్‌తోనే పిచ్చెక్కిస్తారయ్యో.. ఫస్ట్ పేరు చూస్తే పూనకాలే..!
కుతుబ్‌షాహీల నుంచి తెలంగాణ వరకు.. కాలంతో పాటు ఎదిగిన మహానగరం
కుతుబ్‌షాహీల నుంచి తెలంగాణ వరకు.. కాలంతో పాటు ఎదిగిన మహానగరం
బ్రిజ్ భూషణ్‌కు బిగ్ రిలీఫ్.. లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా..
బ్రిజ్ భూషణ్‌కు బిగ్ రిలీఫ్.. లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా..
అమెజాన్‌లో ఫ్రీడమ్ సేల్.. ఫోన్‌ల నుండి ఏసీల వరకు 80 శాతం తగ్గింపు
అమెజాన్‌లో ఫ్రీడమ్ సేల్.. ఫోన్‌ల నుండి ఏసీల వరకు 80 శాతం తగ్గింపు
జాతకాలను ఎక్కువగా నమ్ముతాను.. అందుకే 10 వేలు ఖర్చు చేస్తా..
జాతకాలను ఎక్కువగా నమ్ముతాను.. అందుకే 10 వేలు ఖర్చు చేస్తా..
విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుందా?
విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుందా?
ప్రజలు వావి వరసలు లేకుండా వ్యవహరిస్తున్నారు.. రంగం భవిష్యవాణి ఇదే
ప్రజలు వావి వరసలు లేకుండా వ్యవహరిస్తున్నారు.. రంగం భవిష్యవాణి ఇదే