AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చింతపండు ఫేస్ ప్యాక్.. మీరు ఎన్నడూ వినని పుల్లని, ఘాటైన చిట్కా.. అప్లై చేశారంటే మెరిసే చర్మం మీ సొంతం!

ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా ఉండే తియ్యటి, పుల్లటి పదార్థం చింతపండు. వివిధ వంటకాలలో చింతపండును ఎలా ఉపయోగించాలో మనందరికీ తెలుసు. అలాగే, రాగి, ఇత్తడి పాత్రలపై చింతపండును రుద్దితే అవి చాలా మెరిసిపోతాయని కూడా మనకు తెలుసు. ఇప్పుడు అదే చింతపండును ఉపయోగించి ముఖంపై ఉన్న మచ్చలను ఎలా తగ్గించుకోవాలో చూద్దాం.

చింతపండు ఫేస్ ప్యాక్.. మీరు ఎన్నడూ వినని పుల్లని, ఘాటైన చిట్కా.. అప్లై చేశారంటే మెరిసే చర్మం మీ సొంతం!
Tamarind For Skin
Jyothi Gadda
|

Updated on: Apr 17, 2026 | 9:14 AM

Share

వంటగదిలో మనం వాడే చింతపండు (Tamarind) చర్మ సౌందర్యానికి, ముఖ్యంగా పిగ్మెంటేషన్ ( మంగు మచ్చలు) తగ్గించడానికి ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. చర్మంపై ఏర్పడిన నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్, ట్యాన్‌ను తొలగించడానికి చింతపండు ఫేస్ ప్యాక్ ఒక సహజ సిద్ధమైన పరిష్కారం. చింతపండులో విటమిన్ సి, బి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే టార్టారిక్ యాసిడ్ చర్మంపై ఉండే మురికిని మరియు మృతకణాలను తొలగించి సహజమైన గ్లోను ఇస్తుంది. చర్మం రంగును మెరుగుపరచడానికి, పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేయడానికి చింతపండును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..

చింతపండుతో తయారు చేయగల ఫేస్ ప్యాక్స్:

పిగ్మెంటేషన్ తగ్గించడానికి (చింతపండు + శనగపిండి): చింతపండును కొద్దిగా నీటిలో నానబెట్టి గుజ్జు తీయాలి. ఈ గుజ్జుకు ఒక స్పూన్ శనగపిండి, కొంచెం పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది చర్మంపై ఉన్న మొండి మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

కాంతివంతమైన చర్మం కోసం (చింతపండు + తేనె): చింతపండు గుజ్జులో ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. తేనె చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చింతపండు చర్మం రంగును మెరుగుపరుస్తుంది. ఈ ప్యాక్ పొడి చర్మం ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది.

ట్యాన్ తొలగించడానికి (చింతపండు + పెరుగు): ఎండవల్ల చర్మం నల్లగా మారితే (Tan), చింతపండు గుజ్జును పెరుగుతో కలిపి రాసుకోవాలి. ఇందులోని లాక్టిక్ యాసిడ్ మరియు విటమిన్ సి కలిపి చర్మాన్ని త్వరగా చల్లబరుస్తాయి. ట్యాన్‌ను తొలగిస్తాయి. మెరిసే, అందమైన చర్మం కోసం చింతపండు గుజ్జులో అర చెంచా పెరుగు, అర టీస్పూన్ తేనెను ఉపయోగించి చిక్కటి ఫేస్‌ ప్యాక్ తయారు చేసి వాడొచ్చు. తేనె, పెరుగు మీ చర్మానికి మరింత నిగారింపును ఇస్తాయి.

అయితే, చింతపండు ఫేస్‌ఫ్యాక్‌ అప్లై చేసే ముందు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి. ఎందుకంటే.. చింతపండులో ఎసిడిక్ గుణాలు ఉంటాయి. కాబట్టి ముఖానికి రాసే ముందు చేతిపై ప్యాచ్ టెస్ట్ చేయడం మర్చిపోవద్దు. మీకు చర్మంపై గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు ఉంటే చింతపండును నేరుగా వాడకూడదు. చింతపండు ప్యాక్ వేసుకున్న తర్వాత ఎండలోకి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా సన్‌స్క్రీన్ వాడాలి. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే వంటగదిలో దొరికే ఇలాంటి సహజమైన వస్తువులతో క్రమం తప్పకుండా సంరక్షణ తీసుకుంటే, చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..
తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తినొచ్చా
తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తినొచ్చా
ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?
ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?
టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?
టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?
శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..
శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..