AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం 6 నిమిషాలే..ఇలా ప్రతీ రోజూ చేశారంటే మీ శరీరంలో మ్యాజిక్ జరుగుతుంది!

మనం ఖాళీ దొరికితే చాలు మొబైల్ తీసి సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ గడిపేస్తుంటాం. ఇది మనకు తాత్కాలిక సంతోషాన్ని (Dopamine hit) ఇచ్చినప్పటికీ, దీర్ఘకాలంలో ఏకాగ్రత లోపించడం, అశాంతికి కారణమవుతోంది. రీల్స్, షార్ట్స్ చూడటం వల్ల మన ఏకాగ్రత దెబ్బతింటోందని, మానసిక ప్రశాంతత కరువవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. దీంతో మనకు నిరంతర జ్ఞానంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అదేలాగో పూర్తి వివరాల్లోకి వెళితే...

కేవలం 6 నిమిషాలే..ఇలా ప్రతీ రోజూ చేశారంటే మీ శరీరంలో మ్యాజిక్ జరుగుతుంది!
Reading Habit
Jyothi Gadda
|

Updated on: Apr 17, 2026 | 1:58 PM

Share

నేటి డిజిటల్ యుగంలో మనలో చాలా మంది మన సమయాన్ని మొబైల్ స్క్రీన్‌లను స్క్రోల్ చేయడానికే కేటాయిస్తున్నాము. ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు, మనం ఎక్కువ టైమ్‌ మొబైల్ స్క్రీన్‌లను స్క్రోల్ చేస్తూనే గడుపుతాము. విచ్చలవిడి ఇంటర్‌ నెట్‌ ప్రభావంతో మనం సమాచార వరదలో కొట్టుకుపోతున్నాం. కానీ, ఈ రీల్స్, షార్ట్స్ ప్రపంచంలో మనం మన ఏకాగ్రతను, మానసిక ప్రశాంతతను కోల్పోతున్నామనే విషయాన్ని ఎవరు గుర్తించటం లేదు. చాలా మందికి చదవడం ఇష్టం, కానీ, ఫోన్ వాడే అలవాటు ఎంతగా పాతుకుపోయిందంటే, ప్రతి ఐదు నిమిషాలకు, ఎవరి నుంచైనా సందేశం వచ్చినా రాకపోయినా, వారి చేయి ఫోన్ వైపు వెళ్తుంది. ఒక్కసారి ఫోన్ అన్‌లాక్ చేశాక, తర్వాతి 10-15 నిమిషాలు అలా గడిచిపోతాయి. అంతే సోషల్ మీడియా చూసే అలవాటును ఎలా వదిలించుకోవాలో, చదవడం పట్ల ప్రేమను ఎలా పెంపొందించుకోవాలో కొన్ని చిట్కాలను నేర్చుకుందాం.

సోషల్ మీడియా vs పుస్తక పఠనం:

సోషల్ మీడియా వల్ల ఆలోచనల్లో గందరగోళం పెరుగుతుంది. అదే పుస్తకం చదివితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిరంతరం రీల్స్ చూడటం వల్ల మన అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది. పుస్తకాలు చదవడం వల్ల ఊహాశక్తి, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయి. ఇతరుల జీవితాలతో మనల్ని మనం పోల్చుకోవడం వల్ల ఒత్తిడి వస్తుంది. పుస్తకం చదవడం వల్ల మనతో మనం సంభాషించుకునే అవకాశం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

పుస్తకాలు చదివే అలవాటును పెంచుకోవడానికి చిట్కాలు:

5-10 పేజీల సూత్రం: ఒకేసారి పెద్ద పుస్తకం చదవాలని అనుకోకండి. రోజుకు కేవలం 5 లేదా 10 పేజీలు చదవాలనే చిన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఇది మీ మెదడుకు భారం అనిపించదు.

బెడ్‌రూమ్‌లో మొబైల్ వద్దు: నిద్రపోయే అరగంట ముందు మొబైల్‌ను పక్కన పెట్టండి. డిజిటల్ స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్‌కు బదులుగా పుస్తకాన్ని చదవడం వల్ల మంచి నిద్ర పడుతుంది.

మీకు నచ్చిన విషయం ఎంచుకోండి: చదవడం అంటే కేవలం క్లిష్టమైన తత్వశాస్త్రం లేదా పెద్ద నవలలే కాదు. మీకు వంటలు, పెట్టుబడులు, ప్రయాణాలు లేదా జోక్స్ అంటే ఇష్టమైతే, అక్కడి నుండి ప్రారంభించండి.

చదవటం ఒక దివ్యౌషధం: పరిశోధనల ప్రకారం, కేవలం 6 నిమిషాల పాటు ప్రశాంతంగా చదవడం వల్ల ఒత్తిడి 68శాతం తగ్గుతుంది. ఇది మీ పదజాలాన్ని పెంచుతుంది, సంభాషణ చాతుర్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు ప్రపంచాన్ని చూసే కొత్త దృక్పథాన్ని అందిస్తుంది. పుస్తకాలు మనం జేబులో పెట్టుకుని తిరగగలిగే ఏకైక మాయాజాలం. కాబట్టి నేటి నుండే మీ పఠన ప్రయాణాన్ని ప్రారంభించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
సింగిల్‌గానే ఫుల్ హ్యాపీ అంటున్న హన్సిక..
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
అనాథాశ్రమంలో పెరిగింది.. రెండేళ్లు పానీపూరితో ఆకలి తీర్చుకుంది
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
బంగారం వేసుకుంటే ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఖాయం
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే మీ జేబుకు చిల్లే
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
ఒంటిపై 250 టాటూలు..భర్త వికృత చేష్టలకు బలైపోయిన మహిళ కథ!
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
కవలల అద్భుతం.. ఇంటర్‌లో ఒకే మార్కులు సాధించి సంచలనం
మీరు కారుకు ఇలాంటి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయా? అయితే జాగ్రత్త
మీరు కారుకు ఇలాంటి డోర్ హ్యాండిల్స్ ఉన్నాయా? అయితే జాగ్రత్త
వెల్లుల్లి కోడిగుడ్డు కారం.. హోటల్ స్టైల్ ఇంట్లోనే
వెల్లుల్లి కోడిగుడ్డు కారం.. హోటల్ స్టైల్ ఇంట్లోనే
చక్రపాణి 'చక్రవ్యూహం' అదిరిపోయిందిగా.. రూ. 2.65 కోట్లు స్వాహా..
చక్రపాణి 'చక్రవ్యూహం' అదిరిపోయిందిగా.. రూ. 2.65 కోట్లు స్వాహా..
కేవలం 6 నిమిషాలే..ప్రతీ రోజూ చేశారంటే మీ శరీరంలో జరిగేది మ్యాజిక్
కేవలం 6 నిమిషాలే..ప్రతీ రోజూ చేశారంటే మీ శరీరంలో జరిగేది మ్యాజిక్