AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మగాళ్లలో శక్తికి.. దీర్ఘాయుష్షుకు అద్భుత ఫలం.. రోజుకు రెండు తింటే ఎన్ని లాభాలో..

ఎండు ఖర్జూరాలు పోషకాలతో నిండిన సహజ శక్తి ఆహారం. ప్రతిరోజూ రాత్రి నానబెట్టి ఉదయం ఒకటి లేదా రెండు ఎండు ఖర్జూరాలు తీసుకోవడం వల్ల శక్తి పెరగడంతో పాటు రక్తహీనత తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడటం, ఎముకలు బలపడటం, గుండె ఆరోగ్యం మెరుగుపడటం వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మగాళ్లలో శక్తికి.. దీర్ఘాయుష్షుకు అద్భుత ఫలం.. రోజుకు రెండు తింటే ఎన్ని లాభాలో..
Health Benefits Of Soaked Dry Dates
Shaik Madar Saheb
|

Updated on: Aug 03, 2026 | 9:42 AM

Share

ఖర్జూరం చెట్లు ప్రధానంగా ఎడారి ప్రాంతాలతోపాటు.. మైదాన ప్రాంతాల్లో కూడా విరివిగా పెరుగుతాయి. అవి అందించే ఖర్జూర పండ్లు రుచికరంగా ఉండటమే కాకుండా, ఎండిన తర్వాత కూడా వాటి రుచిలో ఏమాత్రం మార్పు ఉండదు. ఎండు ఖర్జూరాలలోని నీటి శాతం ఆవిరైపోవడంతో అవి మరింత తియ్యగా, పోషకాలతో నిండిన శక్తివంతమైన ఆహారంగా మారతాయి. ఈ ఎండు ఖర్జూరాలు మన ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు ఎన్నో.. అందుకే వీటిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.

వేరే డ్రై ఫ్రూట్స్ తో పోలిస్తే..ఎండు ఖర్జూరాలు చాలా సరసమైనవి.. నాణ్యతను బట్టి కేజీ సుమారు 350 నుంచి 600 రూపాయల వరకగ లభిస్తాయి. ఒక కేజీలో దాదాపు 200 ఎండు ఖర్జూరాలు ఉంటాయి. వీటిని వినియోగించే విధానం కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజూ రాత్రిపూట ఒకటి లేదా రెండు ఎండు ఖర్జూరాలను నీటిలో నానబెట్టి, ఉదయం విత్తనం తీసేసి తినడం వల్ల వాటిలోని పోషకాలను పూర్తిగా గ్రహించవచ్చు.. ఇంకా పాలతో తీసుకుంటే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి..

పోషకాల గని ఎండు ఖర్జూరం:

ఎండు ఖర్జూరంలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు సహజ చక్కెరలైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్, అలాగే ఐరన్, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్, విటమిన్ బి5 వంటి ఖనిజాలు, పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిలో ఉన్నాయి.

అనేక ఆరోగ్య ప్రయోజనాలు:

తక్షణ శక్తి, అలసట దూరం: ఎండు ఖర్జూరంలోని సహజ చక్కెరలు తక్షణ శక్తిని అందిస్తాయి. ఆఫీసు పనిలో ఉన్నప్పుడు లేదా ఇంటికి వచ్చాక అలసిపోయినప్పుడు ఒక నానబెట్టిన ఎండు ఖర్జూరాన్ని తినడం వల్ల అలసట దూరం అవుతుంది, శక్తి స్థాయిలు పెరుగుతాయి.

మానసిక చురుకుదనం: పరీక్షల సమయంలో అధికంగా చదువుకునే విద్యార్థులు నానబెట్టిన ఎండు ఖర్జూరాన్ని తినడం వల్ల మెదడు చురుకుగా మారుతుంది.. ఏకాగ్రత పెరుగుతుంది..

కండరాల బలోపేతం: ఎండు ఖర్జూరం శరీర కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వీటిని తినడం వల్ల గర్భాశయ కండరాలు బలపడి, సాధారణ ప్రసవానికి సహాయపడతాయి.

రక్తహీనత నివారణ: ఇందులో ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కీలకం. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్త వృద్ధికి దోహదపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఎండు ఖర్జూరం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఎముకలు, దంతాల ఆరోగ్యం: అధిక కాల్షియం ఉండటం వల్ల ఎముకలు, దంతాలు గట్టిపడతాయి. దంత సమస్యలు, ఎముకల వ్యాధులు ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం.

జీర్ణక్రియ మెరుగుదల: ఎండు ఖర్జూరంలో అధికంగా ఉండే డైటరీ ఫైబర్ ఆహారం చక్కగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించి, మల విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది.

కొలెస్ట్రాల్ నియంత్రణ, గుండె ఆరోగ్యం: ఎండు ఖర్జూరంలో కొలెస్ట్రాల్ ఉండదు. పైగా, ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపుతుంది. పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును అదుపులో ఉంచి, గుండె జబ్బులు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

చర్మానికి యవ్వన కాంతి: ఎండు ఖర్జూరంలోని విటమిన్ బి5 – యాంటీ ఆక్సిడెంట్లు కణాల విధ్వంసాన్ని ఆపి, కొత్త కణాలు ఏర్పడటానికి సహాయపడతాయి. ఇది చర్మాన్ని అందంగా, కాంతివంతంగా, ఆరోగ్యకరంగా మారుస్తుంది. వయస్సు పెరిగినా చర్మంపై వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

జుట్టు ఆరోగ్యం: విటమిన్ బి5 జుట్టుకు రక్త ప్రసరణను అందించి, జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

లైంగిక శక్తి వృద్ధి: ఎండు ఖర్జూరంలోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణను పెంచి లైంగిక శక్తిని వృద్ధి చేస్తాయి. లైంగిక సమస్యలు ఉన్నవారు రాత్రి నానబెట్టిన ఎండు ఖర్జూరాన్ని ఉదయం తినడం వల్ల వీర్య వృద్ధి కలిగి లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

ఒక్కొక్క ఎండు ఖర్జూరం ఖర్చు ఒక రూపాయి కన్నా తక్కువ ఉన్నప్పటికీ, అవి మనకు అందించే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం ఎంతో విలువైనవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us