AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 1.5 కోట్ల స్కాలర్‌షిప్‌తో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి ఎంపికైన ఏకైక భారతీయ విద్యార్థిని ఫాతిమా!

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన అనీష్ ఫాతిమా అనే విద్యార్థిని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో అడ్వాన్స్‌డ్ కంప్యూటేషనల్ న్యూరోసైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కోర్సులో సీటు సాధించి అరుదైన ఘనత సాధించింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను 120 దేశాల విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక యువతిగా నిలిచింది.

రూ. 1.5 కోట్ల స్కాలర్‌షిప్‌తో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి ఎంపికైన ఏకైక భారతీయ విద్యార్థిని ఫాతిమా!
Indian Student At Oxford
Nalluri Naresh
| Edited By: |

Updated on: Aug 21, 2026 | 7:53 PM

Share

అనంతపురం జిల్లా గుంతకల్లు విద్యార్థిని అనీష్ ఫాతిమా అరుదైన ఘనత.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్య అభ్యసించేందుకు భారతదేశం నుంచి 2025-26 విద్యా సంవత్సరంలో ఎంపికైన ఏకైక యువతిగా గుర్తింపు పొందింది.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించడం ప్రతిభావంతులైన విద్యార్థులకు ఒక కల లాంటిది. అందులో సీటు సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అంతటి ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీలో అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన శాన్వాజ్ బేగం, జాకీర్ హుస్సేన్ ల కుమార్తె ఫాతిమా అనే విద్యార్థిని అర్హత సాధించింది. 2025-26 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పరీక్షలలో మొత్తం 120 దేశాల విద్యార్థులు పాల్గొనగా… భారతదేశం నుండి అర్హత సాధించిన ఏకైక విద్యార్థినిగా ఫాతిమ నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ నుంచి తనకు దక్కిన ఇటువంటి అరుదైన గౌరవం చాలా సంతోషాన్ని కలిగించిందని ఫాతిమా ఆనందం వ్యక్తం చేస్తుంది . పదవ తరగతి వరకు కేంద్రీయ విద్యాలయంలో విద్యనభ్యసించిన ఫాతిమా ఇంటర్మీడియట్ చదువు కోసం రిషి వ్యాలీ పాఠశాలకు వెళ్ళింది. ఎనిమిదవ తరగతి నుండి ఎలాగైనా ఉన్నత విద్యను ప్రఖ్యాత విద్యా సంస్థలలో విద్యను అభ్యసించాలన్న కోరికతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలలో పాల్గొని అర్హత సాధించింది.

ఇవి కూడా చదవండి

భారతదేశం నుండి ఇద్దరు అర్హత సాధించగా అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఫాతిమా మాత్రమే పరీక్ష రాసి అంతిమంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ కాంపిటేషన్ న్యూరో సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కోర్సులో అర్హత సాధించింది. ఇందుకు గాను ఏకంగా ఒక కోటి 50 లక్షల రూపాయల స్కాలర్షిప్ ను యూనివర్సిటీ ఫాతిమాకు మంజూరు చేసింది. అయితే ఇంత కష్టపడి అర్హత సాధించిన ఆమెకు అక్కడికి వెళ్లి చదవాలంటే మాత్రం పేదరికం అడ్డంకిగా మారింది. ప్రతి సంవత్సరం అక్కడ విద్యను అభ్యసించాలంటే కనీసం 35 నుంచి 40లక్షల వరకు ఖర్చు అవుతుంది… దీనికి గాను కోటి రూపాయలకు పైగా డబ్బు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా వీసా ప్రాసెసింగ్ కోసం కనీసం 35 లక్షల రూపాయలు బ్యాంకులో జమ చేయాల్సి ఉండగా మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఫాతిమా తల్లిదండ్రులు అంత డబ్బు సమకూర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.

ఫాతిమా ఇబ్బందులను గుర్తించిన స్థానిక కార్పొరేటర్ ఆంజనేయులు వీరి కుటుంబ సభ్యులను గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వద్దకు తీసుకెళ్లి ఎలాగైనా ఈ విద్యార్థిని పరిస్థితిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ దగ్గరకు తీసుకెళ్లాల్సిందిగా కోరారు. ఫాతిమా తల్లిదండ్రులను… అలాగే విద్యార్థిని ఫాతిమాను పేదరికం వల్ల ఉన్నత విద్య అభ్యసించడానికి అడ్డంకిగా మారకూడదని ఎమ్మెల్యే జయరాం…

ఇటీవల అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సమయంలో ఫాతిమాను మంత్రి నారా లోకేష్ వద్దకు తీసుకెళ్లి విషయాన్ని తెలియజెప్పారు. దీనిపై సానుకూలంగా స్పందించిన నారా లోకేష్ కచ్చితంగా దేశంలోనే ఒకే ఒక విద్యార్థిగా ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో విద్యను అభ్యసించే అవకాశాన్ని పొందిన ఫాతిమాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈనెల 25వ తేదీ లోగానే వీసా కు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయాల్సి ఉంది అందుకుగాను కేవలం నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది… అంతలోపు పూర్తి చేయలేకపోతే ఆమెకు దక్కిన ఈ అరుదైన అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని ఫాతిమ ఆందోళన చెందుతుంది…

అబ్దుల్ కలాం గారి మాటలే స్ఫూర్తిగా తాను ఈ లక్ష్యాన్ని సాధించానని…. అయితే తనకున్న ఆర్థిక ఇబ్బందులు అందుకు అడ్డంకిగా మారాయని… ప్రభుత్వం త్వరగా స్పందించి తనకు ఆర్థికంగా సహాయ… సహకారం అందించాలని అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వెచ్చించే నిధుల్లో కొంత భాగం తమకు అందిస్తే విదేశాలలో భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఖ్యాతిని కచ్చితంగా నిలబెడతానని విశ్వాసాన్ని ఫాతిమా వ్యక్తం చేశారు. ఇదంతా పూర్తి కావాలంటే ఆమెకు ఆర్థిక సహకారం అత్యవసరం ఈ సహకారాన్ని అటు ప్రభుత్వం కానీ ఇటు స్వచ్ఛంద సంస్థలు కానీ అందించి ఫాతిమాకు అండగా నిలబడాలని స్థానికులు కూడా కోరుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..