AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకాశంలో ఎగరాల్సిన ప్లేన్ రోడ్డుపై ప్రత్యక్షం..రహదారిపై రయ్‌మంటూ దూసుకెళ్లిన వీడియో వైరల్‌..!

సాధారణంగా మనం రహదారులపై విభిన్నమైన డిజైన్లతో కూడిన లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ కార్లు లేదా మోడిఫై చేసిన వాహనాలను చూస్తుంటాం. కానీ, మీరు ఎప్పుడైనా రోడ్లపై సాధారణ ట్రాఫిక్ మధ్యలో ఒక ప్రైవేట్ జెట్ విమానం హాయిగా ప్రయాణించడం చూశారా? వినడానికి కాస్త వింతగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో వేదికగా సరిగ్గా ఇలాంటి అరుదైన దృశ్యమే చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్‌ అవుతూ దూసుకుపోతోంది. ఇంతకీ ఏమిటీ ఘటన?

ఆకాశంలో ఎగరాల్సిన ప్లేన్ రోడ్డుపై ప్రత్యక్షం..రహదారిపై రయ్‌మంటూ దూసుకెళ్లిన వీడియో వైరల్‌..!
Custom Jet Vehicle
Jyothi Gadda
|

Updated on: Aug 21, 2026 | 4:11 PM

Share

సాధారణంగా రోడ్లపై నిత్యం మనం ఎన్నో రకాల వాహనాలను చూస్తుంటాం..వీటిలో మోడిఫై చేసిన విభిన్న కస్టమ్ కార్లు, స్పోర్ట్స్ కార్లను చూస్తుంటాం. కానీ, ఎప్పుడైనా గాల్లో ఎగరాల్సిన విమానం రోడ్డుపై కార్ల మధ్య సాధారణంగా వెళ్లడం చూశారా? అమెరికాలోని ఫ్లోరిడాలో సరిగ్గా అలాంటి వింత, ఆసక్తికరమైన దృశ్యమే చోటుచేసుకుంది. ఫ్లోరిడాలోని డేటోనా బీచ్ వద్ద ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ వెళ్తుండగా, రోడ్డుపై వెళ్తున్న ఒక వాహనం వారి దృష్టిని ఆకర్షించింది. మొదటి చూపులోనే అది ఒక చిన్న ప్రైవేట్ జెట్ విమానంలా కనిపించింది. గాల్లో ఎగరాల్సిన ఆ విమానం రోడ్డుపై కార్లు, ఇతర వాహనాల మధ్య వేగంగా వెళ్తుండటంతో వారు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే తమ ఫోన్లలో ఆ దృశ్యాన్ని రికార్డ్ చేశారు.

వైరల్‌ వీడియో ప్రకారం.. ఆ వాహనాన్ని పరిశీలించి చూడగా, అది ఆకాశంలో ఎగిరే అసలైన విమానం కాదని తేలింది. ఒక చిన్న ప్రైవేట్ జెట్ విమానం బాడీ ఫ్రేమ్‌ను కస్టమ్ డిజైన్ చేసి, చక్రాలు అమర్చి కార్ రూపంలో తయారుచేశారు. దాని లుక్, ఫినిషింగ్ ఎంత అద్భుతంగా ఉందంటే చూసేవారు ఎవరైనా సరే దాన్ని నిజమైన విమానంగా పొరబడాల్సిందే. అన్ని రకాల ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా తయారుచేసిన ఈ ప్లేన్ కార్ సాధారణ రోడ్డుపై ఇతర వాహనాలతో పాటు సాఫీగా సాగిపోయింది.

వీడియో ఇక్కడ చూడండి…

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కాగానే నిమిషాల్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ విభిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. ఇది నేలపై నడిచే నిజమైన ఎగిరే వాహనం అని కొందరు అంటుంటే, మరికొందరు ఈ వాహనాన్ని తయారుచేసిన వ్యక్తి సృజనాత్మకతను, డిజైన్ నైపుణ్యాన్ని ఎంతో మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వింత కారు వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!