AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి 6 నెలలకోసారి దేశం మారే విచిత్ర ద్వీపం.. 350 ఏళ్లుగా ఇదే జరుగుతోంది..!

ఒక ద్వీపం ఆరు నెలల పాటు ఒక దేశం నియంత్రణలో ఉండి, ఆ తర్వాత మరో దేశం స్వాధీనం చేసుకోవడాన్ని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇది ఒక కల్పనలా అనిపించవచ్చు, కానీ, ఇది నిజం.. ఇది వందల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇటీవల, అమితాబ్ బచ్చన్ తాను హోస్ట్ చేసే కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో ఆ ద్వీపం గురించి ఒక ప్రశ్న అడిగారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సుకతను రేకెత్తించింది. ఈ విచిత్ర ద్వీపం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ప్రతి 6 నెలలకోసారి దేశం మారే విచిత్ర ద్వీపం.. 350 ఏళ్లుగా ఇదే జరుగుతోంది..!
Pheasant Island Spain France
Jyothi Gadda
|

Updated on: Aug 19, 2026 | 8:13 PM

Share

ప్రపంచ భూగోళశాస్త్రంలో ప్రతీ దేశానికి నిర్దిష్టమైన సరిహద్దులు, ప్రాంతాలు ఉంటాయి. కానీ, ఒకే భూభాగం సంవత్సరంలో సగం రోజులు ఒక దేశంలో, మిగిలిన సగం రోజులు మరొక దేశంలో ఉంటుందని వింటే ఆశ్చర్యం కలగక మానదు. ఐరోపా ఖండంలోని స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల సరిహద్దుల్లో ఉన్న ఫెసెంట్ ఐలాండ్ అనే చిన్న ద్వీపం ఈ వింతకు కేంద్ర బిందువు.

బిడాసోవా నది మధ్యలో ఉన్న ఈ ద్వీపం సంయుక్త పాలన కింద పనిచేస్తుంది. కాలెండర్ ప్రకారం..ఫిబ్రవరి 1 నుండి జూలై 31 వరకు, ఈ ఆరు నెలల కాలం పాటు ఫెసెంట్ ఐలాండ్ స్పెయిన్ దేశ అధికార పరిధిలోకి వస్తుంది. ఆగస్టు 1 నుండి జనవరి 31 వరకు తర్వాతి ఆరు నెలల కాలంలో ఈ ద్వీపం ఫ్రాన్స్ దేశ పాలనలోకి మారుతుంది. ప్రపంచంలోనే సుదీర్ఘకాలంగా రెండు దేశాల మధ్య శాంతియుతంగా పంచుకోబడుతున్న ఏకైక ప్రాంతంగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది.

ఈ వినూత్న వ్యవస్థ వెనుక 350 ఏళ్లకు పైబడిన సుదీర్ఘ చరిత్ర ఉంది. 1659లో స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల మధ్య జరిగిన ముప్పై ఏళ్ల యుద్ధానికి ముగింపు పలుకుతూ ట్రీటీ ఆఫ్ ది పిరినీస్ అనే శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఫెసెంట్ ఐలాండ్‌లోనే సంతకాలు చేశారు. నాటి నుంచి రెండు దేశాల మధ్య మైత్రికి చిహ్నంగా ఈ ద్వీపాన్ని చెరో ఆరు నెలలు పంచుకోవాలని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

దాదాపు 200 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు మాత్రమే ఉన్న ఈ చిన్న దీవిలో సాధారణ పౌరులు లేదా పర్యాటకులు నివసించడానికి లేదా సందర్శించడానికి అనుమతి లేదు. కేవలం ఆయా దేశాల నౌకాదళ అధికారులు, సంరక్షణ సిబ్బంది మాత్రమే అధికార మార్పిడి సమయంలో, నిర్వహణ పనుల కోసం ఇక్కడికి వస్తుంటారు. సంవత్సరానికి రెండుసార్లు జరిగే ఈ అధికార మార్పిడి ప్రక్రియ ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
కలర్స్, స్పెషల్‌ ఎడిషన్‌లో ఆకట్టుకుంటున్న జావా బాబర్​ బైక్
కలర్స్, స్పెషల్‌ ఎడిషన్‌లో ఆకట్టుకుంటున్న జావా బాబర్​ బైక్
'రూ.25 కోట్ల ఆస్తి కోసం.. కొబ్బరి నీళ్లలో సైనైడ్‌ కలిపి ఇచ్చా..'
'రూ.25 కోట్ల ఆస్తి కోసం.. కొబ్బరి నీళ్లలో సైనైడ్‌ కలిపి ఇచ్చా..'
రోహిత్ పై త్రిగుణ్ సంచలన కామెంట్స్.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ కామెం
రోహిత్ పై త్రిగుణ్ సంచలన కామెంట్స్.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ కామెం
భారీ బ్యాటరీతో మార్కెట్‌లోకి కైనెటిక్​ ఈవీ.. వివరాలివే
భారీ బ్యాటరీతో మార్కెట్‌లోకి కైనెటిక్​ ఈవీ.. వివరాలివే
మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌
మేకప్‌ బాక్స్‌ అనే డౌట్‌ వచ్చే రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌
వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేదు
వీరి కోసం చక్రం తిప్పబోతున్న భారీ గ్రహం.. ఆర్థికంగా తిరుగులేదు
IND vs AFG: భారత్‌-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ..?
IND vs AFG: భారత్‌-అఫ్గానిస్థాన్ తొలి టీ20పై క్లారిటీ..?
తిరుమల వెళ్లేవారికి టీటీడీ అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు
తిరుమల వెళ్లేవారికి టీటీడీ అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 260 కోట్ల బ్లాక్ బస్టర్..తెలుగులోనూ ఉంది
ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన 260 కోట్ల బ్లాక్ బస్టర్..తెలుగులోనూ ఉంది
బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం..ఈ జిల్లాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు