AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: చదువుకుంటూనే ర్యాపిడో నడిపిన బీబీఏ విద్యార్థి..! మూడు నెలల్లో ఎంత సంపాదించాడో తెలుసా?

ఈనాటి యువత కేవలం డిగ్రీ పట్టాలకే పరిమితం కాకుండా, సొంత కాళ్లపై నిలబడేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. స్వయం సమృద్ధి, ఆర్థిక స్వాతంత్య్రం పట్ల నేటి తరం ఎంత స్పృహతో ఉందో చాటిచెప్పే సంఘటన ఒకటి బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. ఒక వైపు బీబీఏ విద్యార్థిగా చదువుకుంటూనే, మరోవైపు ఖాళీ సమయంలో ర్యాపిడో క్యాప్టెన్‌గా బైక్ టాక్సీ నడుపుతున్న ఒక యువకుడి కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Watch: చదువుకుంటూనే ర్యాపిడో నడిపిన బీబీఏ విద్యార్థి..! మూడు నెలల్లో ఎంత సంపాదించాడో తెలుసా?
Bba Student Rapido Rider
Jyothi Gadda
|

Updated on: Aug 19, 2026 | 7:13 PM

Share

బెంగళూరుకు చెందిన ఒక బీబీఏ స్టూడెంట్‌ తన చదువుతో పాటు పార్ట్‌టైమ్‌గా ర్యాపిడో క్యాప్టెన్‌గా పనిచేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకని వార్తల్లో నిలిచాడు. తన ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడకుండా, ఖాళీ సమయంలో బైక్ టాక్సీ నడుపుతూ నెలకు మంచి సంపాదన అర్జిస్తున్నట్లు సదరు విద్యార్థి తెలిపాడు. ఈ పని ద్వారా కేవలం డబ్బు మాత్రమే కాకుండా, వివిధ రకాల ప్రజలతో మాట్లాడటం, వ్యాపార మెళకువలు, సమయ పాలన నేర్చుకున్నట్లు పంచుకున్నాడు. స్వయం సమృద్ధిని చాటుతున్న ఈ యువకుడి స్ఫూర్తిదాయక కథనం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

బెంగళూరులోని ఒక కాలేజీలో బీబీఏ చదువుతున్న సదరు విద్యార్థి, తన పాకెట్ మనీ, రోజువారీ ఖర్చుల కోసం తల్లిదండ్రులపై ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తనకున్న బైక్‌ను ఉపయోగించి ర్యాపిడో యాప్ ద్వారా రైడర్‌గా మారాడు. రోజూ కాలేజీ తరగతులు పూర్తయిన తర్వాత లేదా వారాంతాల్లో సమయం లభించినప్పుడు బైక్ టాక్సీని నడుపుతూ ఆదాయం పొందుతున్నాడు.

అతడు, తన అనుభవాలను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు.. ర్యాపిడో రైడర్‌గా పనిచేయడం వల్ల కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాక అనేక విషయాలు నేర్చుకున్నానని ఆ విద్యార్థి తెలిపాడు. రోజువారీ జీవితంలో వివిధ రంగాలకు చెందిన ప్రయాణికులతో మాట్లాడటం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగయ్యాయని పేర్కొన్నాడు. బీబీఏ విద్యార్థిగా తాను థియరీలో చదువుకున్న కస్టమర్ సర్వీస్, సమయ పాలన వంటి విషయాలను ఈ ఉద్యోగం ద్వారా ప్రత్యక్షంగా ఆచరణలో పెట్టగలిగానని వివరించాడు.

ఇవి కూడా చదవండి

My 3-month experience doing Rapido as a side hustle in Bangalore — ₹1.2k/day, algorithm, restaurants & what I learned by u/RapTer_OP in bangalore

ఏ పని తక్కువ కాదని, కష్టపడి సంపాదించడంలో ఉన్న తృప్తి వేరని నిరూపించిన ఈ బీబీఏ విద్యార్థిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శ్రమ నిష్టకు వయసుతో పనిలేదు, స్వశక్తిపై ఆధారపడే ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాయకమే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాలేజీ విద్యార్థులు ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా ఇలాంటి ఉపయోగకరమైన మార్గాల ద్వారా ఆదాయాన్ని అర్జించడంతో పాటు అనుభవాన్ని పొందవచ్చని ఈ కథనం నిరూపిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర