AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 నిమిషాల డెలివరీల వెనుక భయంకర నిజాలు.. హైదరాబాద్ డార్క్ స్టోర్లలో షాకింగ్ దృశ్యాలు..!

స్మార్ట్‌ఫోన్ ద్వారా ఒక్క క్లిక్ చేస్తే చాలు.. కేవలం 10 నిమిషాల్లో నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు, పిండి పదార్థాలు మన ఇంటి ముందరకు వచ్చేస్తున్నాయి. అయితే, మనం ఎంతో నమ్మకంతో ఆర్డర్ చేస్తున్న ఈ క్విక్-కామర్స్ డార్క్ స్టోర్స్ వెనుక ఎంతటి భయంకరమైన అపరిశుభ్రత దాగి ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల డార్క్ స్టోర్లలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.

10 నిమిషాల డెలివరీల వెనుక భయంకర నిజాలు.. హైదరాబాద్ డార్క్ స్టోర్లలో షాకింగ్ దృశ్యాలు..!
Hyderabad Dark Stores
Jyothi Gadda
|

Updated on: Oct 01, 2026 | 11:08 AM

Share

కేవలం 10 నిమిషాల్లో మీరు కోరిన నిత్యావసర సరుకులు, పండ్లు, పిండి పదార్థాలు మీ ఇంటి ముందు వాలిపోతున్నాయని మురిసిపోతున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే! మనం ఎంతో నమ్మకంతో ఆర్డర్ చేస్తున్న డార్క్ స్టోర్స్‌‌ వెనుక ఎంతటి భయంకరమైన అపరిశుభ్రత దాగి ఉందో తెలిస్తే మీరు దిగ్భ్రాంతికి గురవుతారు.

తనిఖీలలో బయటపడిన ప్రధాన అక్రమాలు:

ఈ తనిఖీల్లో వెలుగుచూసిన దృశ్యాలు వినియోగదారులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకుండా, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఏకంగా 4 డార్క్ స్టోర్లను అధికారులు అక్కడికక్కడే సీజ్ చేశారు.

క్రిమి కీటకాల స్వైరవిహారం: సరుకులు నిల్వ ఉంచే ర్యాక్‌లలో, బియ్యం, గోధుమపిండి, చిరుతిళ్ల ప్యాకెట్ల మధ్య బొద్దింకలు, క్రిమి కీటకాలు విచ్చలవిడిగా సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

బూజు పట్టిన ఆహారం: తగినంత గాలి, వెలుతురు లేకపోవడం, గదుల్లో తేమ శాతం ఎక్కువ అవ్వడంతో పండ్లు, కూరగాయలు, బ్రెడ్ ప్యాకెట్లపై మందపాటి బూజు పట్టి ఉంది.

ఎక్స్‌పైరీ ఉత్పత్తులు: గడువు ముగిసిన అనేక ఆహార పదార్థాలను పక్కన పడేయకుండా, నిల్వ ఉన్న మంచి సరుకులతో కలిపి ఉంచడం అధికారులను నివ్వేరపరిచింది.

లైసెన్సులు లేకపోవడం: కొన్ని డార్క్ స్టోర్లు కనీస అనుమతులు, FSSAI నమోదు పత్రాలు లేకుండానే విచ్చలవిడిగా వ్యాపారాలు సాగిస్తున్నట్లు తేలింది.

పరిశుభ్రతకు తిలోదకాలు:

10 నిమిషాల్లో డెలివరీ ఇవ్వాలనే తొందరలో సరుకుల నిల్వ, పరిశుభ్రతను నిర్వాహకులు పూర్తిగా గాలికి వదిలేశారు. డార్క్ స్టోర్ల నేల అంతా మురికిగా ఉండటం, తాగునీటి వ్యవస్థ సరిగా లేకపోవడం, ఆహార పదార్థాల ప్యాకింగ్ సరిగా లేక ఈగలు వాలుతుండటం గమనించిన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ తక్షణమే 4 కేంద్రాలను మూసివేయించింది. మిగిలిన నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

వినియోగదారులకు సూచనలు:

ఫాస్ట్ డెలివరీ పేరుతో వస్తున్న ఈ ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. డెలివరీ వచ్చిన వెంటనే ప్యాకెట్‌‌పై FSSAI మార్క్యు, ఎక్స్‌పైరీ డేట్‌ను తప్పక చెక్ చేయాలి. పండ్లు, కూరగాయలు, బ్రెడ్ వంటివాటిపై బూజు ఉందేమో పరిశీలించి, శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించాలి. ఏదైనా అపరిశుభ్రత కనిపిస్తే వెంటనే సదరు యాప్‌తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించడమైనది.

Follow Us