AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక ఇదే!

శరీరంలో చిన్నపాటి నొప్పి రాగానే మెడికల్ షాప్‌కు వెళ్లి పేయిన్ కిల్లర్లు కొనుగోలు చేయడం, లేదా సాధారణ జలుబు, జ్వరానికి సొంతంగా యాంటీబయాటిక్స్ వాడటం చాలామందికి అలవాటుగా మారింది. అయితే, ఇలా వైద్యుల సలహా లేకుండా ఇష్టారీతిన మందులు వాడటంపై భారతదేశపు కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ (CDSCO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేసింది.

నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక ఇదే!
Painkillers Without Prescription
Jyothi Gadda
|

Updated on: Oct 01, 2026 | 9:12 AM

Share

డాక్టర్ల సలహా లేకుండా పేయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడటం అత్యంత ప్రమాదకరమని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. చిన్నపాటి నొప్పులు, జలుబు, జ్వరాలకు వైద్యుల సూచన లేకుండా ఇష్టారీతిన ఈ మాత్రలు వేసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు మందులు పనిచేయకుండాపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ మందులను సరైన వైద్య పర్యవేక్షణలోనే వాడాలని సూచించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం:

స్టెరాయిడ్లు లేని నొప్పి నివారిణులు పరిమితి దాటి వాడటం వల్ల కిడ్నీలకు రక్తప్రసరణ తగ్గి, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, కిడ్నీ వైఫల్యం సంభవించే ప్రమాదం ఉందని CDSCO స్పష్టం చేసింది. ముఖ్యంగా వృద్ధులు, డీహైడ్రేషన్‌తో బాధపడేవారు, ఇప్పటికే గుండె లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు పేయిన్ కిల్లర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ముప్పు:

వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే సాధారణ జలుబు, ఫ్లూ వంటి సమస్యలకు యాంటీబయాటిక్స్ పనిచేయవు. అయినప్పటికీ చాలామంది అనవసరంగా యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని బ్యాక్టీరియా మందులకు లొంగని విధంగా రూపాంతరం చెందుతుంది. దీనివల్ల భవిష్యత్తులో ఏదైనా తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏ యాంటీబయాటిక్ కూడా పనిచేయక ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

CDSCO సూచనలు, నియమాలు:

సరైన మోతాదు: డాక్టర్లు సూచించిన తక్కువ మోతాదులో, తక్కువ వ్యవధికి మాత్రమే పేయిన్ కిల్లర్లను వాడాలి.

మిగిలిపోయిన మందులు వాడొద్దు: మునుపటి వాడకంలో మిగిలిపోయిన యాంటీబయాటిక్స్ వేసుకోవడం లేదా ఇతరులకు ఇవ్వడం చేయకూడదు.

మెడికల్ షాపులకు ఆదేశాలు: షెడ్యూల్ H1 కిందకు వచ్చే యాంటీబయాటిక్స్, తీవ్రమైన మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించకూడదని ఫార్మసిస్టులను ఆదేశించింది.

లక్షణాల ఉపశమనం సరిపోదు: నొప్పులు లేదా జ్వరం పదే పదే వస్తుంటే సొంత వైద్యం చేసుకోకుండా, అసలు కారణాన్ని తెలుసుకోవడానికి డాక్టర్‌ను సంప్రదించాలి. మందులు ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడతాయి. కానీ, వాటిని నిర్లక్ష్యంగా వాడితే అవే ప్రాణాల మీదకు తెస్తాయి. కాబట్టి డాక్టర్ సలహా మేరకు మాత్రమే పేయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడటం ద్వారా మీ కిడ్నీలను, ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us