AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉప్పు ప్యాకెట్లపై సిగరెట్ తరహా హెచ్చరికలు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

మనం రోజూ తినే ఆహారంలో ఉప్పు చాలా కీలకమైనది. అయితే, ఈ ఉప్పు పరిమితి దాటితే శరీరానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. అధిక ఉప్పు వాడకం వల్ల పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, సిగరెట్ ప్యాకెట్ల మాదిరిగానే ఉప్పు ప్యాకెట్లపై కూడా హెచ్చరిక లేబుళ్లను ముద్రించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వినియోగదారులు కొనుగోలు చేసే సమయంలోనే ఉప్పు తెచ్చే ప్రమాదాల గురించి అవగాహన పెంచడం ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉప్పు ప్యాకెట్లపై సిగరెట్ తరహా హెచ్చరికలు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Salt Packet Warning Labels
Jyothi Gadda
|

Updated on: Oct 01, 2026 | 7:46 AM

Share

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు మాత్రమే తీసుకోవాలి. కానీ ప్రస్తుతం చాలామంది రోజుకు 9 నుండి 12 గ్రాముల ఉప్పును ఆహారంలో తీసుకుంటున్నారు. ఇది సిఫార్సు చేసిన పరిమాణం కంటే రెండింతలు ఎక్కువ. ఉప్పు పరిమితి దాటడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 30 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

అధిక ఉప్పు వల్ల కలిగే ప్రమాదాలు:

అధిక రక్తపోటు : ఉప్పులోని సోడియం రక్తంలో నీటి శాతాన్ని పెంచి, రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడిని తెస్తుంది. ఇది బిపి పెరగడానికి ప్రధాన కారణం.

గుండె జబ్బులు, పక్షవాతం: రక్తపోటు పెరగడం వల్ల గుండెపై భారం పడి, హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

కిడ్నీ సమస్యలు: రక్తంలో ఉండే అదనపు సోడియంను కిడ్నీలు బయటకు పంపాల్సి ఉంటుంది. ఉప్పు ఎక్కువైతే కిడ్నీలపై తీవ్ర ఒత్తిడి పడి, దీర్ఘకాలంలో కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంది.

దాగున్న ఉప్పు: మనం ఇంట్లో వండే ఆహారంలో ఉప్పు తగ్గించినప్పటికీ, బజార్లో లభించే చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, సాస్‌లు, బ్రెడ్‌లలో దాగివుండే ఉప్పు మనకు తెలియకుండానే శరీరంలోకి చేరుతోంది.

ప్రభుత్వ చర్యలు, పరిష్కారాలు:

కర్ణాటక ప్రభుత్వం కేవలం హెచ్చరిక లేబుళ్లతో ఆగకుండా, ప్రజలు సరైన కొలతలో ఉప్పును వాడేలా కొలత స్పూన్ ను కూడా ఉప్పు ప్యాకెట్లతో పాటు అందించే ఆలోచన చేస్తోంది. అంతేకాకుండా, ఫోర్టిఫైడ్ ఉప్పు వాడకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది.

అధిక ఉప్పు వాడకం మన దేశంలో సైలెంట్ ఎపిడెమిక్‌లా మారుతోంది. కాబట్టి, రోజువారీ ఆహారంలో సాధారణ ఉప్పును తగ్గించి, పొటాషియం ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, సహజసిద్ధమైన మూలికలను భాగం చేసుకోవడం ద్వారా గుండెను, కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us