AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయాన్నే పరగడుపున దాల్చినచెక్క ముక్క నమిలితే.. ఈ అద్భుత ప్రయోజనాలన్నీ మీ సొంతం!

మన వంటింట్లో లభించే మసాలా దినుసులలో దాల్చినచెక్కకు ప్రత్యేక స్థానం ఉంది. దీనిని కేవలం సువాసన, రుచి కోసం మాత్రమే కాకుండా ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్లుగా ఒక గొప్ప ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే పరగడుపున ఒక చిన్న దాల్చినచెక్క ముక్కను నోట్లో వేసుకుని మెల్లగా నమిలి, దాని లాలాజలాన్ని మింగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని శాస్త్రీయ పరిశోధనలు కూడా నిరూపిస్తున్నాయి.

ఉదయాన్నే పరగడుపున దాల్చినచెక్క ముక్క నమిలితే.. ఈ అద్భుత ప్రయోజనాలన్నీ మీ సొంతం!
Cinnamon On Empty Stomach
Jyothi Gadda
|

Updated on: Oct 01, 2026 | 6:45 AM

Share

రోజు ఉదయాన్నే పరగడుపున ఒక చిన్న దాల్చినచెక్క ముక్కను నోట్లో వేసుకుని నమలడం వల్ల శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. దాల్చినచెక్కలో ఉన్న సహజ సిద్ధమైన ఆంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయాన్నే దీనిని నమలడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి శరీరం రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. పరగడుపున దాల్చినచెక్క నమలడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ వివరంగా చూద్దాం..

రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ:

దాల్చినచెక్క ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. ఉదయాన్నే పరగడుపున దీనిని నమలడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్రావం క్రమబద్ధీకరించబడి, ఉదయపు టిఫిన్ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా అదుపులో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

వేగవంతమైన బరువు తగ్గింపు:

ఉదయాన్నే దాల్చినచెక్క నమలడం వల్ల శరీర జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది లాలాజలంతో కలిసి జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఆకలిని అదుపులో ఉంచి, ఎక్కువ సమయం కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఫలితంగా అనవసరమైన కేలరీలు తీసుకోకుండా ఉండి, శరీరంలోని చెడు కొవ్వు కరిగి బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

ఇవి కూడా చదవండి

వాపులు,నొప్పుల నివారణ:

దాల్చినచెక్కలో శక్తివంతమైన యాంటీ ఇన్‌‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వ్యాయామం చేసిన తర్వాత వచ్చే కండరాల నొప్పులు, ఆర్థరైటిస్ వల్ల కలిగే వాపులు, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

గుండె ఆరోగ్యం, మెరుగైన రక్త ప్రసరణ:

దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్, ఆంటీఆక్సిడెంట్ గుణాలు రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా నిరోధిస్తాయి. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ సీరై, గుండెజబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.

రోగనిరోధక శక్తి, క్యాన్సర్ నిరోధక గుణాలు:

దాల్చినచెక్కలో ఉండే ఫ్రీ రాడికల్స్ నిరోధక గుణాలు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ ఇస్తుంది.

ఉదయాన్నే టీ, కాఫీలు తాగే అలవాటుకు బదులుగా ఒక చిన్న దాల్చినచెక్క ముక్కతో రోజును ప్రారంభించడం శ్రేయస్కరం. పరగడుపున దాల్చినచెక్కను నమలడం వల్ల శరీరానికి సహజసిద్ధమైన శక్తి లభించడమే కాకుండా, సమగ్ర ఆరోగ్యం పెంపొందుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఉదయాన్నే పరగడుపున దాల్చినచెక్క ముక్క నమిలితే..ఈ అద్భుత ప్రయోజనాలు
ఉదయాన్నే పరగడుపున దాల్చినచెక్క ముక్క నమిలితే..ఈ అద్భుత ప్రయోజనాలు
పండగకు ముందు షాకిచ్చిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంత పెరిగిందంటే..
పండగకు ముందు షాకిచ్చిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంత పెరిగిందంటే..
ఓటీటీలోకి వచ్చేసిన కార్తీ లేటస్ట్ యాక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్
ఓటీటీలోకి వచ్చేసిన కార్తీ లేటస్ట్ యాక్షన్ స్పై యాక్షన్ థ్రిల్లర్
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. పండగకు ముందు ఊరట..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. పండగకు ముందు ఊరట..!
అక్టోబర్ 1 రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు
అక్టోబర్ 1 రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని లాభాలు
రష్యా వెళ్ళే భారత పౌరులకు విదేశాంగ శాఖ హెచ్చరికలు
రష్యా వెళ్ళే భారత పౌరులకు విదేశాంగ శాఖ హెచ్చరికలు
గౌహతి వన్డేలో భారత్ ఘన విజయం
గౌహతి వన్డేలో భారత్ ఘన విజయం
మాయదారి డైట్.. సోషల్ మీడియా డాక్టర్ల మాయలో జనాలు..
మాయదారి డైట్.. సోషల్ మీడియా డాక్టర్ల మాయలో జనాలు..
సేవింగ్స్ అకౌంట్లో అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఐటీ నోటీసులు..?
సేవింగ్స్ అకౌంట్లో అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఐటీ నోటీసులు..?
వన్డే చరిత్రలో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన శుభమన్ గిల్!
వన్డే చరిత్రలో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన శుభమన్ గిల్!