AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్లడ్ షుగర్, అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం.. మెంతుల కాంబినేషన్‌తో రోజూ గుప్పెడు తిన్నారంటే..

మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఆహారం చాలా ముఖ్యం. అదేవిధంగా, మనం ఏం తింటాము, ఎప్పుడు తింటాము అనేది కూడా ముఖ్యం. ఇవి సరిగ్గా లేనప్పుడు షుగర్ లెవల్స్ అదుపులోకి రాకపోవడం, తీవ్రమైన అలసట, అరికాళ్ల మంట వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి సిద్ధ వైద్యురాలు డాక్టర్ నిత్య ఒక అద్భుతమైన సహజమైన పరిష్కారాన్ని సూచించారు. ఇది బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంతో పాటు శరీరానికి మంచి శక్తినిస్తుంది. అరికాళ్ల మంటలను తగ్గిస్తుంది.

బ్లడ్ షుగర్, అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం.. మెంతుల కాంబినేషన్‌తో రోజూ గుప్పెడు తిన్నారంటే..
Diabetes Control
Jyothi Gadda
|

Updated on: Sep 29, 2026 | 7:54 AM

Share

మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా పెద్ద సవాలు. ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం వల్ల షుగర్ లెవల్స్ పెరగడమే కాకుండా తీవ్రమైన శరీర అలసట, నీరసం, రాత్రివేళల్లో అరికాళ్లలో తీవ్రమైన మంటలు వస్తుంటాయి. ఈ సమస్యలన్నింటికీ సిద్ధ వైద్య నిపుణురాలు డాక్టర్ నిత్య ఒక సులభమైన, అద్భుతమైన ఆహార చిట్కాను అందించారు. ఉదయాన్నే టిఫిన్‌గా మొలకెత్తిన రాగులు, మెంతుల మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తయారీ విధానం:

నానబెట్టడం: 100 గ్రాముల రాగులను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో తీసుకోండి. దానికి 1 స్పూన్ మెంతులు కలిపి మునిగేంత వరకు నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టాలి. మరుసటి రోజు నీటిని వడకట్టి, ఆ రాగులు-మెంతుల మిశ్రమాన్ని ఒక శుభ్రమైన తెల్లటి కాటన్ గుడ్డలో మూటకట్టి 24 నుండి 32 గంటల పాటు ఉంచాలి. దీనివల్ల ధాన్యాలు బాగా మొలకెత్తుతాయి. చాలామంది మొలకెత్తిన విత్తనాలను పచ్చిగానే తింటారు. కానీ, వాటిపై క్రిములు ఉండే అవకాశం ఉన్నందున, వీటిని ఇడ్లీ పాత్రలో వేసి ఆవిరిపై 5 నుండి 7 నిమిషాలు ఉడికించాలి.

ఎలా తీసుకోవాలి?:

ఆవిరిపై ఉడికించిన రాగులు-మెంతుల మిశ్రమంలో చిటికెడు ఉప్పు చేర్చుకోవాలి. దీనికి నూనె లేకుండా క్యారెట్ తురుము, దోసకాయ ముక్కలు లేదా పచ్చి కొబ్బరి తురుము కలిపి తింటే రుచిగా ఉంటుంది. కావాలనుకుంటే స్వల్పంగా పోపు కూడా వేసుకోవచ్చు. దీన్ని ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్‌గా తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆరోగ్య ప్రయోజనాలు:

రక్తంలో చక్కెర నియంత్రణ: రాగులలో ఉండే ఫైబర్, మెంతులలోని ఔషధ గుణాలు కలిసి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను చాలా వేగంగా అదుపులోకి తెస్తాయి. షుగర్ పేషెంట్లలో వచ్చే నరాల బలహీనత, అరికాళ్ల మంటలను తగ్గించడంలో ఈ ఆహారం అద్భుతంగా పనిచేస్తుంది. రాగులలో క్యాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చడంతో పాటు ఎనీమియా రాకుండా కాపాడతాయి.

షుగర్ ఉన్నవారే కాకుండా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ పోషకాహారాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. పిల్లలకు ఇచ్చేటప్పుడు ఇందులో దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు కలిపి ఇస్తే ఇష్టంగా తింటారు.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
తొలిరోజే హీటెక్కిన గొడవలు.. గాయాలతో ముగిసిన టాస్క్
తొలిరోజే హీటెక్కిన గొడవలు.. గాయాలతో ముగిసిన టాస్క్
బ్లడ్ షుగర్,అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం! మెంతుల కాంబినేషన్
బ్లడ్ షుగర్,అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం! మెంతుల కాంబినేషన్
చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు
చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు
రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ బిర్యానీ.. ఇంట్లో ఎలా చేయాలంటే?
రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ బిర్యానీ.. ఇంట్లో ఎలా చేయాలంటే?
మీరు GST చెల్లించకపోతే మీ వ్యాపారం వెంటనే మూసివేస్తారా?
మీరు GST చెల్లించకపోతే మీ వ్యాపారం వెంటనే మూసివేస్తారా?
గర్భసంచిని క్లీన్ చేసే దివ్యౌషధం..నెలసరి నొప్పులకు చెక్!
గర్భసంచిని క్లీన్ చేసే దివ్యౌషధం..నెలసరి నొప్పులకు చెక్!
ఓటటీలో వణుకు పుట్టిస్తోన్నరియల్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటటీలో వణుకు పుట్టిస్తోన్నరియల్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
4 సమస్యలకు ఒకే ఔషదం.. వెల్లుల్లిని ఇలా వాడితేనే వరం
4 సమస్యలకు ఒకే ఔషదం.. వెల్లుల్లిని ఇలా వాడితేనే వరం
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..