September 01, 2026
venkata chari
ప్రకృతిలో ఎనో విచిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటి గురించి తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతుంటాం. తాజాగా అలాంటి ఓ ఊరు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పగటిపూట కూడా చీకటిగా ఉంటుంది. మిట్టమధ్యాహ్నం కూడా అర్థరాత్రిలా మారిపోతుంది.
ఈ విచిత్రమై ఊరిలో మనకు ఎదురుగా వచ్చే మనుషులు, జంతువులు, వాహనాలు కూడా స్పష్టంగా కనిపించవు. అలాంటి సీక్రెట్ ప్రదేశం ఎక్కడో కాదండోయ్, మన దేశంలోనే ఉందని తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.
ఇది భారతదేశంలోని ఓ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. అదే మాథేరాన్ నగర పరిధిలో ఉన్న ఓ హిల్ స్టేషన్. సౌండ్ పోల్యూషన్ లేని పచ్చని చెట్లు మధ్య మట్టి రోడ్లలోనే ప్రయాణిస్తేనే ఈ ప్రదేశానికి చేరుకోవాలన్నమాట.
పట్ట పగలు రాత్రిలా కనిపించే ఈ ప్రదేశాన్ని మథేరాన్ హిల్ స్టేషన్ అని పిలుస్తుంటారు. ఇది మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఉంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 800 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ పట్టణంలోకి వాహనాలు, కార్లు, బైక్‌లకు ఎంట్రీ లేదు.
ఈ సీక్రెట్ ప్రదేశాన్ని చేరుకోవడానికి పర్యాటకులు కొన్ని కీలక సూచనలు పాటించాలి. కార్లు లేదా టాక్సీలకు దస్తురి నాకా అనే ప్రాంతం వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి గ్రామానికి చేరుకోవాలంటూ కచ్చితంగా నడవాల్సిందే.
మాథేరన్ అనే ఈ కొండ ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం కూడా చిమ్మ చీకటిగా ఉంటుంది. ఈ చీకటి వెనుక ప్రకృతికి అందించిన సీక్రెట్ ఒకటి ఉంది. ఈప్రాంతం అంతా దట్టమైన చెట్లతో కప్పబడి ఉంటుంది.
ఇక్కడ రోడ్లకు ఇరువైపులా భారీ చెట్లు ఉన్నాయి. వీటి కొమ్మలు, ఆకులతో ఆకాశమంతా ఓ పైకప్పులా పచ్చగా పెనవేసుకుని ఉంటాయి. దీని గుండా సూర్యరశ్మి ప్రసరించలేదు. దీంతో మిట్ట మధ్యాహ్నం కూడా ఇక్కడ చీకటిగా ఉంటుంది.
ఇక్కడ 38కి పైగా సందర్శనా స్థలాలు ఉన్నాయి. పసోనా పాయింట్, లూయిసా పాయింట్, ఎకో పాయింట్ వంటి ప్రదేశాల నుంచి కనిపించే లోయలు ఎంతో అందంగా కనిపిస్తాయి.