Mahesh Babu : ఎంతో అందమైన సినిమా.. నా మనసును కదిలించింది.. మహేష్ బాబుకు నచ్చిన మూవీ ఇదే..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఓ సినిమా గురించి మహేష్ బాబు చేసిన ట్వీట్ చేసి ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

మలయాళీ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పిస్తున్నారు. ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ , షోయింగ్ బిజినెస్ పతాకాలపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫహాద్ ఫాజిల్ నేరుగా తెలుగు తెరకు హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే హైదరబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా వీక్షించి సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను పంచుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..
“ఇప్పుడే ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా చూశాను. ఎంతో పరిపూర్ణమైన అనుభూతిని ఇచ్చిన చిత్రమిది! చాలా చక్కగా, మనసుకు ఆహ్లాదాన్నిచ్చేలా తెరకెక్కించారు. ఒకే సమయంలో వినోదాన్ని పంచుతూనే ఎంతో లోతైన భావోద్వేగాలకు గురిచేస్తుంది. సినిమా అంతటా ఒక అరుదైన హాయిని, వెచ్చదనాన్ని నింపారు. పూర్తిగా ఎంటర్‌టైన్ చేస్తూనే, అదే సమయంలో ఎంతో మనసును కదిలించే లోతైన భావోద్వేగాలను కూడా కలిగిస్తుంది. ఫహద్ సర్.. మీరు అద్భుతమైన నటులు. మిమ్మల్ని మీరు నిరంతరం కొత్తగా ఆవిష్కరించుకుంటూ ప్రయోగాలు చేయడం ఎంతో స్ఫూర్తిదాయకం. ఫహద్ , చిన్నారి సారా పాలేకర్ మధ్య కెమిస్ట్రీ, నటన అద్భుతం. తెరపై ప్రతి సన్నివేశంలోనూ ఆ పాత్రలు జీవిస్తున్నట్లు అనిపిస్తుంది” అంటూ ట్వీట్ చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‌తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..
చిత్ర నిర్మాత, రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ గురించి ప్రస్తావిస్తూ.. “కార్తీ.. నీకు ఇంతకంటే మంచి డెబ్యూ ప్రారంభం దొరకదు. ఈ సినిమా కోసం పడ్డ కష్టానికి ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు. నువ్వు, శోభు కలిసి చాలా స్పెషల్ ఫిల్మ్ తీశారు. దర్శకుడు శశాంక్ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాడు” అని అభినందించారు. చివరగా, “చిత్ర బృందానికి నా ప్రేమ, శుభాకాంక్షలు. మీ చేతుల్లో ఒక గొప్ప రత్నం ఉంది. అక్టోబర్ 2న ప్రతి ఒక్కరూ ఈ మ్యాజిక్‌ను థియేటర్లలో అనుభవించాలి” అని మహేష్ బాబు అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా పై మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..
మహేష్ బాబు ట్వీట్.
Just watched the #DontTroubleTheTrouble Movie!!!What a beautifully complete experience this is ❤️❤️❤️ Such a well crafted and happy film… thoroughly entertaining and deeply moving at the same time 👏🏻👏🏻👏🏻 The film carries such a rare sense of warmth throughout!!!
Fahadh sir – u…
— Mahesh Babu (@urstrulyMahesh) September 30, 2026
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..
