AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రుచికరంగా పూరీ కర్రీ వండాలా.. సింపుల్ టిప్స్ మీకోసమే!

పూరీలు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ పూరీలను చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే పూరీల కంటే పూరీలు తినడానికి ఉండే, చట్నీ లేదా కర్రీ చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది పూరీ కర్రీ రుచికరంగా చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మరి మీరు కూడా పూరీ కర్రీ రుచికరంగా వండాలి అనుకుంటున్నారా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే.

Samatha J
|

Updated on: Oct 22, 2026 | 1:14 PM

Share
 కావలసిన పదార్థాలు:,   నూనె: 2 టీ స్పూన్లు,   శనగపప్పు: 1/2 టీ స్పూన్,ఆవాలు: 1/2 టీ స్పూన్,  జీలకర్ర 1/4 టీ స్పూన్,   ఎండుమిర్చి: 3,   ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి: 2 ,  కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్: 1/4 టీ స్పూన్,   పసుపు 1/4 టీ స్పూన్,   నీళ్లు,  శనగపిండి: 3 టీ స్పూన్లు,   ఉడికించిన బంగాళదుంపలు 2 చిన్నవి,   ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర సన్నగా తరిగినది

1 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి వేడి చేయాలి. పాన్ వేడైన తర్వాత అందులో 2 టీ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడైన తర్వాత  శనగపప్పు,  ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడేటప్పుడు మూడు ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి.  ఆవాలు, జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న  ఉల్లిపాయ ముక్కలను వేయాలి. పూరి కర్రీలోకి ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటాయి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత, చీలికలుగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి వేయాలి.  తరువాత కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి.

2 / 5
  ఇప్పుడు  అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఈ కూరలో ఉల్లిపాయలను బ్రౌన్ రంగులోకి వేయించకూడదు, కేవలం పచ్చివాసన పోయే వరకు వేయిస్తే సరిపోతుంది. ఆ తర్వాత  పసుపు వేసి, నూనెలో కొద్దిసేపు వేయించి బాగా కలుపుకోవాలి.  పసుపు వేయించుకున్న తర్వాత, ఒక టీ గ్లాసుడు నీళ్లు పోసి ఆ నీటిని మురిగించాలి. ఈలోగా, ఒక చిన్న గిన్నెలో 3 టీ స్పూన్ల శనగపిండి తీసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా బాగా కలపాలి.

3 / 5
 పాన్‌లో నీళ్లు మరుగుతున్నప్పుడు, ముందుగా ఉడికించి మెదిపి పెట్టుకున్న రెండు చిన్న బంగాళదుంపలను వేయాలి. ఇలా మెదిపి వేయడం వల్ల కూరలో బంగాళదుంపలు బాగా కలిసిపోతాయి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత, ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి నీటి మిశ్రమాన్ని వేయాలి.  శనగపిండి మిశ్రమం వేయగానే అది నీటిని త్వరగా పీల్చుకుంటుంది, కూర చిక్కబడుతుంది.

4 / 5
శనగపిండి ఉడకడానికి మరికొన్ని నీళ్లు అవసరం కాబట్టి, కూర చిక్కదనాన్ని చూసుకుని అవసరమైనన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూడు నుండి నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి, శనగపిండి చక్కగా ఉడికి కూర కొద్దిగా చిక్కబడుతుంది. అంతే పూరీ కర్రీ రెడీ.

5 / 5
Follow Us