AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలయ్యతో అనుకుని ఎన్టీఆర్‌తో తీశారు.. సినిమా ఫలితం ఏమైందంటే..?

ఎన్టీఆర్ నటించిన యమగోల చిత్రం 1977లో విడుదలయ్యి సంచలనం సృష్టించింది. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని "యమ అర్జన్సీ"గా వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ రాజకీయ సామాజిక అంశాలను స్పృశించింది. దీర్ఘకాలంగా నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, తెలుగు చిత్రసీమలో ఒక మైలురాయిగా నిలిచింది.

బాలయ్యతో అనుకుని ఎన్టీఆర్‌తో తీశారు.. సినిమా ఫలితం ఏమైందంటే..?
Balakrishna Sr Ntr
Ram Naramaneni
|

Updated on: Oct 22, 2026 | 12:32 PM

Share

సోషల్ మీడియా ప్రభావం లేని, టీవీ చానెళ్లు లేని ఆనాటి కాలంలో, ప్రజలు తమ భావాలను మనసులోనే దాచుకునేవారు. సరిగ్గా అలాంటి సమయంలో, ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో విధించిన ఎమర్జెన్సీ పరిస్థితులు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ నిరంకుశ పాలనను యముడి పాలనతో పోలుస్తూ, “ఎమర్జెన్సీని యమ అర్జన్సీ”గా వ్యాఖ్యానిస్తూ, ఎన్టీఆర్ నటించిన ‘యమగోల’ చిత్రం రూపుదిద్దుకుంది. సరిగ్గా 49 ఏళ్ల క్రితం, 1977 అక్టోబర్ 21న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, తెలుగు చిత్రసీమలో ఒక ప్రభంజనాన్ని సృష్టించింది.

యమగోల పుట్టుక – ఒక సుదీర్ఘ ప్రయాణం

యముడిని భూలోకానికి తీసుకువచ్చి, అతడిని నరుడు టీజ్ చేసే సోషియో-ఫాంటసీ ఫార్ములాను తెలుగులో తొలిసారిగా సి. పుల్లయ్య రూపొందించిన దేవాంతకుడు చిత్రంతో పరిచయం చేశారు. ఆ తర్వాత అనేక చిత్రాలకు స్ఫూర్తినిచ్చిన ఈ ఫార్ములాను మరింత విస్తరింపజేయాలని పుల్లయ్య “యమగోల” టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. అయితే, పలు కారణాలతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఆయన మరణానంతరం, ఆయన తనయుడు సి.ఎస్.రావు కథపై కొంత కృషి చేశారు. నిర్మాత డి.ఎన్. రాజు, డి.వి.ఎస్. రాజు వంటి ప్రముఖులు ఈ కథను పరిశీలించినప్పటికీ, వారికి నచ్చకపోవడంతో పక్కన పెట్టారు. చివరకు, 17 ఏళ్ల తర్వాత ఛాయాగ్రాహకుడు ఎస్. వెంకటరత్నం ఈ కథకు మోక్షం కల్పించారు. ఈ తరం మనిషి చిత్రంతో నష్టపోయిన వెంకటరత్నం, ఒక హిట్ సినిమా తీసి తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో రచయిత డి.వి. నరసరాజును కలిశారు. నరసరాజు, దేవాంతకుడు ఫార్ములాను అనుసరిస్తూ కథను సిద్ధం చేసి, రామారావు వద్ద ఉన్న “యమగోల” టైటిల్‌ను 5000 రూపాయలకు కొనుగోలు చేశారు.

ఎన్టీఆర్ ప్రవేశం – కథకు కొత్త మలుపు

వెంకటరత్నం, నరసరాజు సలహా మేరకు ఎన్టీఆర్‌ను హీరోగా సంప్రదించారు. మొదట, బాలకృష్ణను హీరోగా చేసి, ఎన్టీఆర్‌ను యముడి పాత్రలో నటించమని కోరగా, ఎన్టీఆర్ నిరాకరించారు. బాలయ్య చదువుకుంటున్నాడని, తన చిత్రాలకే పరిమితం కావాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే, నరసరాజు కథను వివరించగానే, ముఖ్యంగా యముడు, చిత్రగుప్తుడు బ్రోతల్ కేసులో అరెస్ట్ అయ్యే సన్నివేశం వినగానే ఎన్టీఆర్ పగలబడి నవ్వారు. కథలోని వైవిధ్యాన్ని గుర్తించి, “ఈ హీరో వేషం బాలయ్య వెయ్యలేడు, నేనే చేయాల్సినంత ప్రాధాన్యం కథలో ఉంది” అని చెబుతూ, హీరోగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యముడి పాత్రకు ఎస్.వి. రంగారావు లేకపోవడంతో సత్యనారాయణను ఎంపిక చేశారు.

చిత్ర నిర్మాణం, సంగీతం, సంభాషణలు

ఎన్టీఆర్ ఓకే చెప్పడంతో వెంకటరత్నం మిగిలిన పనులను చకచకా పూర్తిచేశారు. జయప్రదను హీరోయిన్‌గా, రావు గోపాలరావును విలన్‌గా, అల్లు రామలింగయ్యను చిత్రగుప్తుడిగా ఎంపిక చేశారు. ఎన్టీఆర్‌తో తాతినేని రామారావుకు ఇది తొలి సినిమా. 1977 జూన్ 4న వాహిని స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది. యమలోకం సెట్‌తో పాటు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపి, కేవలం 27 రోజుల్లోనే చిత్రీకరణను పూర్తిచేయడం ఒక విశేషం. చక్రవర్తి సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాటలు చిలక కొట్టుడు కొడితే, ఆడవే అందాల సురభామిని, ఓ లమ్మీ తిక్కరేగిందా, గుడివాడ వెళ్ళాను, సమరానికి నేడే ఆరంభం వంటివి అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రం చక్రవర్తిని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నిలబెట్టింది. డి.వి. నరసరాజు రాసిన సంభాషణలు బాగా పేలాయి. ముఖ్యంగా “తాళం వేసితిని, గొళ్లెం మరిచితిని” అనే సంభాషణ, ఎన్టీఆర్ సూర్యకాంతమ్మను చూసి “అత్తా నువ్వెప్పుడు చచ్చావ్” అని అడిగిన డైలాగ్‌లు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.

రాజకీయ వ్యంగ్యం, సవాళ్లు, అద్భుత విజయం

ఈ చిత్రంలో అప్పటి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తనయుడు సంజయ్ గాంధీ గురించి కొన్ని సెటైర్లు ఉన్నాయి. “ఎమర్జెన్సీని గుర్తు చేస్తూ యమ అర్జెన్సీ ఇకపై రద్దు” అనే పాట అప్పట్లో ఒక సంచలనం. సినిమా విడుదల కావడానికి కొన్ని నెలల ముందు ఇందిరా గాంధీ ప్రభుత్వం ఓడిపోయి జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పట్టు కోల్పోలేదు. అందుకే కొన్ని కేంద్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం చెప్పడంతో కొన్ని డైలాగ్‌లను తొలగించారు. అయితే, అప్పటికే గ్రామఫోన్ రికార్డుల రూపంలో ఆ సంభాషణలు ప్రజల్లోకి వెళ్లిపోవడంతో, వాటిని పదేపదే వింటూ ఆనందించారు. నిర్మాత వెంకటరత్నం అడవి రాముడు విడుదలైన థియేటర్లలోనే యమగోలను విడుదల చేయాలనుకున్నారు. అడవి రాముడు 175 రోజులు పూర్తి చేసుకునే వరకు వేచి చూడాల్సి వచ్చింది. రెండు నెలల పాటు సినిమా విడుదలను ఆపడం అప్పట్లో ఒక సాహసోపేత నిర్ణయం.

1977 అక్టోబర్ 21న విడుదలైన యమగోల వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. 40 ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రం 28 కేంద్రాల్లో 100 రోజులు, ఆరు సెంటర్లలో 175 రోజులు, విజయవాడ, హైదరాబాద్‌లలో 40 వారాలు ఆడింది. 90 రోజులకు కోటి రూపాయలు వసూలు చేసిన నాలుగవ తెలుగు చిత్రంగా యమగోల రికార్డు సృష్టించింది. ఈ చిత్రం తదనంతర కాలంలో యముడికి మొగుడు, యమలీల, యమదొంగ వంటి అనేక చిత్రాలకు స్ఫూర్తినిచ్చింది. యమగోల తెలుగు చిత్ర చరిత్రలో ఒక ఆణిముత్యంగా, ఎన్టీఆర్ నటనా వైభవానికి నిదర్శనంగా నిలిచింది.

Follow Us
లాట్రీ తగిలినట్లే.. బుధుడి తిరోగమనంతో వీరికి లక్కే లక్కు
లాట్రీ తగిలినట్లే.. బుధుడి తిరోగమనంతో వీరికి లక్కే లక్కు
బాలయ్యతో చేద్దామనుకున్నారు.. ఫైనల్‌గా ఎన్టీఆర్ హీరో.. రిజల్ట్..?
బాలయ్యతో చేద్దామనుకున్నారు.. ఫైనల్‌గా ఎన్టీఆర్ హీరో.. రిజల్ట్..?
ప్రదోష వ్రతం ఎప్పుడు?.. శివుడి అనుగ్రహం కోసం ఈ మంత్రాలు జపించండి!
ప్రదోష వ్రతం ఎప్పుడు?.. శివుడి అనుగ్రహం కోసం ఈ మంత్రాలు జపించండి!
వాస్తు టిప్స్ : ఇంట్లో చిలకను పెంచుకోవడం శుభమా? అశుభమా?
వాస్తు టిప్స్ : ఇంట్లో చిలకను పెంచుకోవడం శుభమా? అశుభమా?
మృత్యువును జయించిన తారలు.. ప్రాణాంతక వ్యాధులను ఓడించిన స్టార్స్
మృత్యువును జయించిన తారలు.. ప్రాణాంతక వ్యాధులను ఓడించిన స్టార్స్
అంజలీ దేవికి ఏకలవ్య శిష్యురాలు సావిత్రి
అంజలీ దేవికి ఏకలవ్య శిష్యురాలు సావిత్రి
భారత్ -న్యూజిలాండ్ టీ20 పోరు.. అరుదైన రికార్డుపై అర్షదీప్ కన్ను
భారత్ -న్యూజిలాండ్ టీ20 పోరు.. అరుదైన రికార్డుపై అర్షదీప్ కన్ను
శరీరం బలంగా మారుతుంది.. అన్నం బదులు ఈ రొట్టెలు తినండి..
శరీరం బలంగా మారుతుంది.. అన్నం బదులు ఈ రొట్టెలు తినండి..
టాస్ గెలిచిన భారత్.. న్యూజిలాండ్‌కు ముందుగా బ్యాటింగ్!
టాస్ గెలిచిన భారత్.. న్యూజిలాండ్‌కు ముందుగా బ్యాటింగ్!
ధనవంతులు కావాలంటే పర్సులో ఈ 3 వస్తువులు పెట్టుకోవద్దు..
ధనవంతులు కావాలంటే పర్సులో ఈ 3 వస్తువులు పెట్టుకోవద్దు..