AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హార్ముజ్ జలసంధిలో ఘోరం.. 21 మంది భారతీయ నావికులతో వెళ్తున్న ట్యాంకర్‌పై ప్రొజెక్టైల్ దాడి..!

హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న కువైట్ జెండా కలిగిన ఆయిల్ ట్యాంకర్ పై గుర్తు తెలియని క్షిపణి లేదా ప్రొజెక్టైల్ దాడి జరిగింది. ఈ నౌకలో 21 మంది భారతీయ నావికులు ప్రయాణిస్తున్నట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో నౌకలో స్వల్పంగా మంటలు చెలరేగినప్పటికీ, వెంటనే వాటిని అదుపులోకి తెచ్చారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ వాణిజ్య నౌకలపై వరుస దాడి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

హార్ముజ్ జలసంధిలో ఘోరం.. 21 మంది భారతీయ నావికులతో వెళ్తున్న ట్యాంకర్‌పై ప్రొజెక్టైల్ దాడి..!
Hormuz Strait Attack
Jyothi Gadda
|

Updated on: Oct 22, 2026 | 2:06 PM

Share

మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ జలమార్గాలు, వాణిజ్య నౌకలపై తీవ్రంగా పడుతోంది. తాజాగా హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్‌పై గుర్తుతెలియని ప్రొజెక్టైల్ దూసుకెళ్లి దాడి చేసింది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, కువైట్ జెండా కలిగిన ఈ నౌకలో మొత్తం 21 మంది భారతీయ నావికులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అధికారికంగా వెల్లడించారు.

అసలు ఏం జరిగింది?:

కువైట్‌కు చెందిన M/T Al Dasma ఆయిల్ ప్రొడక్ట్ ట్యాంకర్ హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఒమన్‌లోని బుఖ్లాకు పశ్చిమంగా 11 నాటికల్ మైళ్ల దూరంలో ఈ నౌక వెళ్తున్న తరుణంలో, గుర్తుతెలియని ప్రొజెక్టైల్ నౌకను బలంగా తాకింది. ఈ ప్రభావంతో నౌకలో స్వల్పంగా మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే స్పందించి మంటలను విజయవంతంగా ఆర్పివేశారు. దాడి జరిగిన తర్వాత నౌక అక్కడే నిలిచిపోయింది.

భారతీయ నావికులు క్షేమం:

నౌకపై దాడి జరిగిన వెంటనే భారత్‌లో ఆందోళన వ్యక్తమైంది. అయితే, నౌకలో ఉన్న 21 మంది భారతీయ నావికులతో పాటు సిబ్బంది అందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలదని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ప్రాణనష్టం ఏదీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నావికుల భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు షిప్ మేనేజ్‌మెంట్ కంపెనీతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం టచ్‌లో ఉందని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

వరుస దాడి ఘటనలు.. ఆందోళనలో సముద్ర మార్గాలు:

గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత కొద్ది రోజులుగా వరుసగా ఇలాంటి భద్రతా వైఫల్యాలు వెలుగుచూస్తున్నాయి. అక్టోబర్ 16న కూడా 15 మంది భారతీయ నావికులతో వెళ్తున్న మరో చమురు ట్యాంకర్ MT ST 3 పై కూడా హార్ముజ్ జలసంధిలోనే ఇలాంటి దాడి జరిగింది. అప్పుడు కూడా భారతీయులంతా క్షేమంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతకుముందు అక్టోబర్ 14న రొమేనియా సమీపంలో డ్రోన్ దాడికి గురైన కెమికల్ ట్యాంకర్ YARA J లోనూ తొమ్మిది మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారు.

భారత్ ఆందోళన:

అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న ఇలాంటి దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. సముద్ర వాణిజ్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలని, నావికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని భారత్ అంతర్జాతీయ వేదికలపై పదేపదే నొక్కి చెబుతోంది. ఏదేమైనప్పటికీ, ఈ తాజా ఘటనలో భారతీయ సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడటం దేశానికి పెద్ద ఊరటనిచ్చింది.

Follow Us
దేవాలయంలో ఈ 5 ఆచారాలు ఎందుకు పాటిస్తారు? వీటి వెనుక ఉన్న అర్థాలు
దేవాలయంలో ఈ 5 ఆచారాలు ఎందుకు పాటిస్తారు? వీటి వెనుక ఉన్న అర్థాలు
"మన ఇంట్లో ఇలాగే చేసుకుందామా..?"
చికెన్‌లోని ఈ పార్ట్‌ తింటున్నారా?ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమంటే...
చికెన్‌లోని ఈ పార్ట్‌ తింటున్నారా?ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమంటే...
నేలపై పాకకుండా చక్రంలా తిరిగే పాము గురించి తెలుసా?
నేలపై పాకకుండా చక్రంలా తిరిగే పాము గురించి తెలుసా?
ఓం మంత్రం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఆధ్యాత్మిక రహస్యం..
ఓం మంత్రం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఆధ్యాత్మిక రహస్యం..
నేలపై పడిన ఆయిల్ మరకలు పోవడం లేదా? ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లీన్
నేలపై పడిన ఆయిల్ మరకలు పోవడం లేదా? ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లీన్
21 మంది భారతీయ నావికులతో వెళ్తున్న ట్యాంకర్‌పై ప్రొజెక్టైల్ దాడి!
21 మంది భారతీయ నావికులతో వెళ్తున్న ట్యాంకర్‌పై ప్రొజెక్టైల్ దాడి!
మటన్ కర్రీ ఇలా చేశారంటే దుమ్ముదుమారమే..
మటన్ కర్రీ ఇలా చేశారంటే దుమ్ముదుమారమే..
తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.. నిజానికి అతడికే కప్పు ఇవ్వాలి.
తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.. నిజానికి అతడికే కప్పు ఇవ్వాలి.
చూడటానికి మామిడి పండులా ఉంటుంది.. తింటే ప్రాణాలకే ప్రమాదం!
చూడటానికి మామిడి పండులా ఉంటుంది.. తింటే ప్రాణాలకే ప్రమాదం!