AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో మిస్టరీ జీవి కలకలం.. ఏలియన్ అంటూ ప్రచారం.. కెమెరాలో ఏం కనిపించింది?

అమెరికా-మెక్సికో సరిహద్దులో ఓ వింత జీవి గోడ దాటుతూ కనిపించి కలకలం రేపింది. సాధారణ జంతువులా కనిపించని ఈ జీవి కోళ్లు, కుందేళ్లను ఎత్తుకెళ్తోందని స్థానికులు చెబుతున్నారు. దీని కెమెరా ఫొటోలు బయటకు రావడంతో అసలు ఇది ఏ జంతువు అనే ప్రశ్నలు మొదలయ్యాయి. కొందరు ఇది భూమిపై ఇప్పటివరకు గుర్తించని జీవి కావచ్చని అనుమానిస్తుండగా, మరికొందరు ఏలియన్‌ అయి ఉంటుందంటూ ఊహాగానాలు చేస్తున్నారు.

అమెరికాలో మిస్టరీ జీవి కలకలం.. ఏలియన్ అంటూ ప్రచారం.. కెమెరాలో ఏం కనిపించింది?
Mysterious Creature Seen Near Us Border Raises Alien Theories
Sharada V
|

Updated on: Oct 22, 2026 | 8:28 AM

Share

అమెరికా-మెక్సికో సరిహద్దులో ఓ వింత జీవి గోడ దాటుతూ కనిపించి కలకలం రేపింది. సాధారణ జంతువులా కనిపించని ఈ జీవి కోళ్లు, కుందేళ్లను ఎత్తుకెళ్తోందని స్థానికులు చెబుతున్నారు. దీని కెమెరా ఫొటోలు బయటకు రావడంతో అసలు ఇది ఏ జంతువు అనే ప్రశ్నలు మొదలయ్యాయి. కొందరు ఇది భూమిపై ఇప్పటివరకు గుర్తించని జీవి కావచ్చని అనుమానిస్తుండగా, మరికొందరు ఏలియన్‌ అయి ఉంటుందంటూ ఊహాగానాలు చేస్తున్నారు.

ఆరు అడుగుల పొడవు.. మూడు అడుగుల తోక!

మెక్సికోలోని చిహువాహువా రాష్ట్రం వ్యాలీ ఆఫ్ జువారెజ్ లో ఈ వింత జీవి ప్రత్యక్షమైంది. స్థానికులు తమ పెంపుడు జంతువులు కనిపించకుండా పోతున్నాయని గగ్గోలు పెట్టడంతో కెమెరాలో ఈ వింత జీవిని గుర్తించారు అధికారులు. యూఎఫ్‌ఓలపై పరిశోధనలు చేసే జైమ్ మౌస్సాన్ బృందం విడుదల చేసిన సీసీ కెమెరా చిత్రాల్లో ఓ పెద్ద, లేత రంగులో ఉన్న జీవి కనిపించింది. దానికి పొడవైన తోక, కాళ్లు ఉన్నాయి. ఈ జీవి దాదాపు ఆరు అడుగుల పొడవు ఉండగా దాదాపు మూడు అడుగుల తోకతో ఓ పెద్ద ఇటుక గోడను ఎక్కుతూ కెమెరా కంట చిక్కింది.

ఎలుక కాదు.. కుందేలు కాదు.. మరి ఏంటి?

నేలపై కదులుతూ, పెద్ద గోడను సైతం ఎక్కుతున్న ఈ జీవి రూపం ఎలుకలు, రకూన్లు, కుందేళ్ల వంటి జంతువులను పోలి లేదని మౌస్సాన్ బృందం తెలిపింది. ఈ జీవి వెనుక కాళ్లపై మనిషిలా నిటారుగా నడవగలదని, చాలా వేగంగా కదులుతుందని, తెలివిగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోందని మౌస్సాన్ అభిప్రాయపడ్డారు. దానిలో మనిషిని పోలిన కొన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పారు. ఓ బాలుడు చూసినట్లు చెబుతున్న ప్రకారం.. ఆ వింత జీవి కోడిని పట్టుకుని, సమీపంలోని చెట్టుపైకి ఎక్కింది. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఏలియనా? మరో ప్రపంచం నుంచి వచ్చిందా?

ఈ వింత జీవి  ఇతర జీవులతో కలిసి  మరో గ్రహం నుంచి అంతరిక్ష నౌకలో వచ్చిందా?  ప్రశ్నను లేవనెత్తారు జైమ్ మౌస్సాన్ . గతంలోనూ గ్రహాంతర జీవుల ప్రకటనలతో వార్తల్లో నిలిచారు జైమ్ మౌస్సాన్. 2023లో మెక్సికో కాంగ్రెస్‌లో రెండు మమ్మీ నమూనాలను ప్రదర్శిస్తూ, అవి మానవేతర జీవులకు సంబంధించినవని వాదించారు. అప్పట్లో ఆ ప్రకటన తీవ్ర విమర్శలకు దారితీసింది. యూఎఫ్‌ఓలు లేదా గ్రహాంతర జీవుల ఉనికిని నిరూపించే భౌతిక ఆధారాలు లభించలేదని అమెరికా ప్రభుత్వం గతంలో వెల్లడించింది. గుర్తించలేని ఆకాశ వస్తువులు, వింత జీవులపై కొందరు రాజకీయ నాయకులు, మాజీ సైనిక అధికారులు, ఇతరులు ఆసక్తి చూపుతూనే ఉన్నారు. అమెరికా-మెక్సికో సరిహద్దులో కనిపించినట్లు చెబుతున్న ఈ జీవి ఏంటనేది ప్రస్తుతం మిస్టరీగా ఉంది. అది కొత్త జాతికి చెందిన జంతువా? తెలిసిన జంతువేనా? లేక ప్రచారంలో చెబుతున్నట్లు మరేదైనా ప్రత్యేకమైన జీవా? అనేది నిర్ధారించడానికి శాస్త్రీయ పరిశీలన అవసరం.

Follow Us
అమెరికాలో మిస్టరీ జీవి కలకలం.. ఏలియన్ అంటూ ప్రచారం!
అమెరికాలో మిస్టరీ జీవి కలకలం.. ఏలియన్ అంటూ ప్రచారం!
సిరిసంపదల గ్రహ సంచారం.. ఈ రాశుల వారికి లక్కే లక్కు, ధన లాభాలు!
సిరిసంపదల గ్రహ సంచారం.. ఈ రాశుల వారికి లక్కే లక్కు, ధన లాభాలు!
ఊహల్లో తేలిపోవాలా.. నవంబర్‌లో ఈ ప్లేసెస్ సందర్శించాల్సిందే
ఊహల్లో తేలిపోవాలా.. నవంబర్‌లో ఈ ప్లేసెస్ సందర్శించాల్సిందే
టీమిండియాకు ఈ ముగ్గురితోనే అసలు ముప్పు
టీమిండియాకు ఈ ముగ్గురితోనే అసలు ముప్పు
బెజవాడలో దారుణం.. ఓ వాటర్‌ బాటిల్‌ కోసం నిండు ప్రాణాలు తీశారు..
బెజవాడలో దారుణం.. ఓ వాటర్‌ బాటిల్‌ కోసం నిండు ప్రాణాలు తీశారు..
ఒకప్పుడు విడాకుల కోసం కోర్లు మెట్లెక్కిన కిచ్చా సుదీప్ దంపతులు
ఒకప్పుడు విడాకుల కోసం కోర్లు మెట్లెక్కిన కిచ్చా సుదీప్ దంపతులు
గనులు లేని దేశం.. బంగారంలో మాత్రం ప్రపంచంలోనే టాప్!
గనులు లేని దేశం.. బంగారంలో మాత్రం ప్రపంచంలోనే టాప్!
ఈ బ్యాంకుపై ఆర్బీఐ సంచలన నిర్ణయం.. రూ.5,000 మాత్రమే విత్‌డ్రా
ఈ బ్యాంకుపై ఆర్బీఐ సంచలన నిర్ణయం.. రూ.5,000 మాత్రమే విత్‌డ్రా
తొలి పోరుకు టీమిండియా రెడీ.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
తొలి పోరుకు టీమిండియా రెడీ.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
100 స్థానాల్లో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. కూటమి పార్టీల స్పందన
100 స్థానాల్లో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. కూటమి పార్టీల స్పందన