AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తేనె నిజంగానే తేనెటీగల వాంతినా? అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

మనం రోజూ ఎంతో ఇష్టంగా ఆస్వాదించే తీయని తేనె వెనుక ఒక ఆసక్తికరమైన నిజం దాగి ఉంది. చాలామంది తేనెను తేనెటీగలు కక్కిన పదార్థం అని పొరపడుతుంటారు. తేనెటీగలు నోటి ద్వారా దీనిని బయటికి కక్కుతాయి కాబట్టి ఈ అపోహ ప్రచారంలో ఉంది. కానీ శాస్త్రీయంగా పరిశీలిస్తే, తేనె అసలు వామిట్ కానే కాదు. ఇంతకీ తేనెటీగలు తేనెను ఎలా తయారు చేస్తాయి? దీని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తేనె నిజంగానే తేనెటీగల వాంతినా? అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Is Honey Bee Vomit
Jyothi Gadda
|

Updated on: Oct 22, 2026 | 9:49 AM

Share

తేనె అనేది తేనెటీగలు కక్కుకున్న వృథా పదార్థం కాదనేది శాస్త్రీయ సత్యం. తేనెటీగలకు ప్రత్యేకంగా హనీ స్టమక్ అనే ప్రత్యేక నిల్వ సంచి ఉంటుంది. ఇవి పూల మకరందాన్ని నేరుగా జీర్ణించుకోకుండా ఈ ప్రత్యేక సంచిలో భద్రపరుస్తాయి. తేనెటీగలు ఈ మకరందాన్ని తమ ఎంజైమ్‌లతో కలిపి, రెక్కల గాలితో తేమను తగ్గించి సువాసనగల తేనెను తయారు చేస్తాయి. అందువల్ల తేనె ఎప్పుడూ పరిశుభ్రమైన, సురక్షితమైన ఆహారమే. తేనెటీగలకు రెండు కడుపులు ఉంటాయా?

అవును, తేనెటీగల శరీర నిర్మాణంలో మకరందాన్ని నిల్వ చేయడానికి, ఆహారాన్ని జీర్ణించుకోవడానికి ప్రత్యేకంగా వేర్వేరు వ్యవస్థలు ఉంటాయి. తేనెటీగలు పూల నుండి సేకరించిన మకరందాన్ని తమ సాధారణ జీర్ణ కడుపులోకి పంపకుండా, ప్రత్యేకంగా ఉండే హనీ స్టమక్ లేదా హనీ క్రాప్ అనే సంచిలో నిల్వ చేసుకుంటాయి. ఈ ప్రత్యేక సంచి కేవలం మకరందాన్ని భద్రపరచడానికి, రవాణా చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

వామిట్, రీగర్జిటేషన్ మధ్య తేడా:

వామిట్అంటే కడుపులో పూర్తిగా జీర్ణమైన ఆహారం బలవంతంగా నోటి ద్వారా బయటికి రావటం. ఇది అనారోగ్యం లేదా విషపూరిత పదార్థాల వల్ల జరుగుతుంది. కానీ తేనెటీగల విషయంలో అలా జరగదు. మకరందాన్ని హనీ స్టమక్ నుండి బయటికి తీయడాన్ని రీగర్జిటేషన్ అంటారు. ఇక్కడ ఎలాంటి జీర్ణక్రియ ప్రక్రియ జరగదు కాబట్టి, దీనిని వామిట్‌తో పోల్చలేము.

ఇవి కూడా చదవండి

తేనె ఎలా తయారవుతుంది?

తేనెటీగలు పువ్వుల నుండి మకరందాన్ని సేకరించి తమ హనీ స్టమక్‌లో నిల్వ చేసుకొని గూటికి చేరుకుంటాయి. గూటికి చేరుకున్నాక, ఆ మకరందాన్ని ఇతర వర్కర్ బీస్‌కు నోటి ద్వారా బదిలీ చేస్తాయి. ఈ ప్రక్రియలో తేనెటీగల సాల్వా లోని ప్రత్యేక ఎంజైమ్‌లు మకరందంలోని సంక్లిష్ట చక్కెరలను సులభమైన చక్కెరలుగా మారుస్తాయి. తేనెటీగలు తమ రెక్కలతో వేగంగా గాలిని వీస్తూ, మకరందంలో ఉన్న అదనపు నీటిని ఆవిరిగా మారుస్తాయి. నీటి శాతం తగ్గి చిక్కగా మారిన తర్వాత, దానిని తేనె గూటి గదులలో భద్రపరుస్తాయి.

తేనె అనేది తేనెటీగలు తమ కడుపులో జీర్ణం చేసుకొని కక్కిన పదార్థం కాదు. ఇది కేవలం పూల మకరందాన్ని సురక్షితంగా నిల్వ చేసి, వాటి శరీరంలోని ఎంజైమ్‌లతో శుద్ధి చేసి తయారు చేసిన ఒక అద్భుతమైన సహజ ఆహార పదార్థం. కాబట్టి, ఎలాంటి అపోహలు లేకుండా తేనెను నిరభ్యంతరంగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
'ఇంకొక్కసారి నన్ను చంపకు రామా'.. జటాయువు పలికిన ఈ మాటల వెనుక..
'ఇంకొక్కసారి నన్ను చంపకు రామా'.. జటాయువు పలికిన ఈ మాటల వెనుక..
'మాయలేడి' సినిమా రివ్యూ..
'మాయలేడి' సినిమా రివ్యూ..
భారత జట్టుకు భారీ షాక్.. ఒక్క ఓటమితో నాలుగు రికార్డులు బ్రేక్
భారత జట్టుకు భారీ షాక్.. ఒక్క ఓటమితో నాలుగు రికార్డులు బ్రేక్
10 గ్రాముల బంగారం ధర లక్షకు పడిపోతుందా..? మార్కెట్ అంచనా ఇదే..
10 గ్రాముల బంగారం ధర లక్షకు పడిపోతుందా..? మార్కెట్ అంచనా ఇదే..
ఇంట్లో టమాటాలు ఉన్నాయా? ఇలా వారానికి మూడుసార్లు చేసినా వద్దనరు..
ఇంట్లో టమాటాలు ఉన్నాయా? ఇలా వారానికి మూడుసార్లు చేసినా వద్దనరు..
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
మీ ఊరు,వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..? తెలుసుకోండిలా
మీ ఊరు,వార్డు ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..? తెలుసుకోండిలా
ఇంట్లో ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే శుభప్రదం? ఏకముఖం నుంచి..
ఇంట్లో ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే శుభప్రదం? ఏకముఖం నుంచి..
టీమిండియా బ్యాటర్లపై సీరియస్.. గంభీర్‌కు మొదలైన కొత్త టెన్షన్
టీమిండియా బ్యాటర్లపై సీరియస్.. గంభీర్‌కు మొదలైన కొత్త టెన్షన్
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో