AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవి ఇడ్లీలా..? రాళ్లా..? : ఆహార కమిషన్ చైర్మన్ ఉగ్రరూపం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి గురుకుల పాఠశాలలు, హాస్టల్‌లలో తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇడ్లీలు, చట్నీ, కూరల రుచి, నాణ్యత ప్రమాణాలను ప్రశ్నించారు. మెనూ అమలు, పరిశుభ్రతపై సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ, మెరుగైన ఆహారం అందించాలని సూచించారు.

ఇవి ఇడ్లీలా..? రాళ్లా..? :  ఆహార కమిషన్ చైర్మన్ ఉగ్రరూపం..
Student Welfare
Ram Naramaneni
|

Updated on: Oct 22, 2026 | 2:04 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి గురుకుల పాఠశాలలు, హాస్టల్‌లలో విస్తృత తనిఖీలు నిర్వహించి, విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా నగరి ఎస్సీ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌లో తనిఖీ సందర్భంగా ఆయన విద్యార్థులు, వంట సిబ్బంది, వార్డెన్‌లతో నేరుగా మాట్లాడారు. ఆహార నాణ్యతపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఇడ్లీలు రాయిలా గట్టిగా ఉన్నాయని, చట్నీ నీళ్లలా ఉందని, కూరలు రుచిగా లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “మన ఇంట్లో ఇలాంటి ఆహారం చేసుకుంటామా? ఏదైనా పని చేస్తే అర్థంపర్థం ఉండదా? పిల్లలకు మంచి భోజనం పెట్టకపోతే ఎలా?” అని ప్రశ్నించారు. వంట సిబ్బందికి తెలివి లేదా అని నిలదీశారు. మహాత్మా జ్యోతిబా పూలే, అంబేద్కర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ఏపీ మోడల్, కస్తూర్బా వంటి గురుకులాల్లో మూడు పూటలా భోజనం పెట్టాల్సి ఉండగా, కేవలం రెండు పూటలే పెడుతున్నారని ఆయన గమనించారు. వారానికి 1400 రూపాయలు ఇస్తున్నప్పటికీ నాణ్యత లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం చికెన్ 105 గ్రాములు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 100 గ్రాములే ఇస్తున్నారని, గుడ్లు వారానికి ఆరు ఇవ్వాలని స్పష్టం చేశారు. మెనూలో ఎలాంటి మార్పులు చేయకూడదని, నాణ్యతలో రాజీపడకూడదని ఆదేశించారు. ఉప్మా బదులు ఎగ్ ఫ్రైడ్‌ రైస్ అందించడం ద్వారా ఖర్చు తగ్గుతుందని, వంట సిబ్బంది గుడ్లు దాచుకోకుండా అన్నిటినీ ఉపయోగించుకునేలా జాగ్రత్తలు తీసుకోవచ్చని ఆయన సూచించారు.

“వంటవాళ్లు మనసు పెట్టి రుచిగా వండాలి. మంచి భోజనం పెడితేనే పిల్లలు సంతృప్తిగా తిని బాగా చదువుకుంటారు” అని పేర్కొన్నారు. లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. కొందరు విద్యార్థులు హాస్టల్‌లోని కూరలు బాగోలేదని తనకు లోపల చెప్పారని, బయట చెప్పడానికి భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. టిఫిన్లలో ఏమైనా మార్చాలంటే సూచించాలని విద్యార్థులను అడిగారు. ఉప్మాను మార్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టవచ్చా అని ప్రత్యామ్నాయం చూపారు. హాస్టల్ వార్డెన్లు తమకు ఎలాంటి పని లేనట్టు కూర్చుంటున్నారని, వంటగది వద్ద ఉండి పనులు పర్యవేక్షించాలని సూచించారు. చివరగా, హాస్టల్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలని, ఆర్టీసీ బస్సుల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా, వారికి ఉత్తమ సౌకర్యాలు కల్పించడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.

Follow Us
"మన ఇంట్లో ఇలాగే చేసుకుందామా..?"
చికెన్‌లోని ఈ పార్ట్‌ తింటున్నారా?ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమంటే...
చికెన్‌లోని ఈ పార్ట్‌ తింటున్నారా?ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమంటే...
నేలపై పాకకుండా చక్రంలా తిరిగే పాము గురించి తెలుసా?
నేలపై పాకకుండా చక్రంలా తిరిగే పాము గురించి తెలుసా?
ఓం మంత్రం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఆధ్యాత్మిక రహస్యం..
ఓం మంత్రం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఆధ్యాత్మిక రహస్యం..
నేలపై పడిన ఆయిల్ మరకలు పోవడం లేదా? ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లీన్
నేలపై పడిన ఆయిల్ మరకలు పోవడం లేదా? ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లీన్
21 మంది భారతీయ నావికులతో వెళ్తున్న ట్యాంకర్‌పై ప్రొజెక్టైల్ దాడి!
21 మంది భారతీయ నావికులతో వెళ్తున్న ట్యాంకర్‌పై ప్రొజెక్టైల్ దాడి!
మటన్ కర్రీ ఇలా చేశారంటే దుమ్ముదుమారమే..
మటన్ కర్రీ ఇలా చేశారంటే దుమ్ముదుమారమే..
తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.. నిజానికి అతడికే కప్పు ఇవ్వాలి.
తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.. నిజానికి అతడికే కప్పు ఇవ్వాలి.
చూడటానికి మామిడి పండులా ఉంటుంది.. తింటే ప్రాణాలకే ప్రమాదం!
చూడటానికి మామిడి పండులా ఉంటుంది.. తింటే ప్రాణాలకే ప్రమాదం!
మిత్రుడి మరణం తీరని లోటు.. అండగా నిలిచిన పదో తరగతి స్నేహితులు!
మిత్రుడి మరణం తీరని లోటు.. అండగా నిలిచిన పదో తరగతి స్నేహితులు!