AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విహారంలో విషాదం.. సముద్ర తీరంలో కొట్టుకుపోయి ముగ్గురు యువతులు, యువకుడు మృతి!

ఆనందంగా గడపాల్సిన సెలవులు ఆ కుటుంబాలకు జీవితాంతం మిగిలే తీరని విషాదాన్ని మిగిల్చాయి. దసరా పండుగ సందర్భంగా సరదాగా విహారయాత్రకు వెళ్లిన కొందరు యువతీ యువకులు అలల ఉద్ధృతికి సముద్రంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగింది?

విహారంలో విషాదం.. సముద్ర తీరంలో కొట్టుకుపోయి ముగ్గురు యువతులు, యువకుడు మృతి!
Srikakulam Beach Tragedy
Jyothi Gadda
|

Updated on: Oct 22, 2026 | 9:03 AM

Share

శ్రీకాకుళం రూరల్ మండలం పీజీపేట సముద్ర తీరంలో జరిగిన ఘోర విషాదంలో ముగ్గురు యువతులు, వారిని రక్షించేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటనతో మృతుల కుటుంబాల్లో, స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ శిక్షణ సంస్థకు చెందిన సుమారు 25 మంది విద్యార్థులు దసరా సెలవులను పురస్కరించుకుని శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని పీజీపేట సముద్ర తీరానికి విహారయాత్ర నిమిత్తం వెళ్లారు. అక్కడ అందరూ సంతోషంగా గడుపుతూ, సముద్రపు ఒడ్డున సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా గడిపారు. ఈ క్రమంలో కొంతమంది యువతులు ఉత్సాహంతో మరింత లోతైన ప్రాంతానికి వెళ్లారు. అదే సమయంలో వచ్చిన పెద్ద అలల తాకిడికి వారు అకస్మాత్తుగా నీటిలో చిక్కుకుపోయారు.

ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కెంగువ గ్రామానికి చెందిన కొండల మాధవి(19), రామభద్రాపురానికి చెందిన గొల్లపల్లి పావని(19), పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మావుడి గ్రామానికి చెందిన మర్రి మహి(18) సరిగ్గా ఈ ప్రాంతానికే వెళ్లి సెల్ఫీలు దిగుతుండగా ఊబిలో కూరుకుపోయారు. అదే సమయానికి సముద్రపు అలల ఉద్ధృతికి లోపలికి కొట్టుకుపోయారు. వారి హాహాకారాలు గమనించిన తోటి విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ప్రాణాలకు తెగించి కాపాడబోయి..

యువతులు మునిగిపోతుండటాన్ని గమనించిన సమీపంలోని బిడ్డిక విక్రమ్ (25) అనే యువకుడు వారిని కాపాడేందుకు ఎలాంటి వెనుకాడకుండా వెంటనే సముద్రంలోకి దూకాడు. ఎంతో సాహసంతో ఇద్దరు యువతులను (మహి, పావని) ఒడ్డుకు తీసుకురాగలిగాడు. అయితే అప్పటికే ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మరో యువతి కొండల మాధవిని రక్షించడానికి విక్రమ్ మళ్లీ ఉధృతంగా వస్తున్న సముద్రంలోకి వెళ్లగా, అలల తీవ్రతకు అతనూ గల్లంతయ్యాడు.

ఇవి కూడా చదవండి

తీరానికి చేరిన మృతదేహాలు:

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక మత్స్యకారుల సహాయంతో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాలించిన అనంతరం గల్లంతైన యువతి మాధవి, సాహసించి ప్రాణాలు కోల్పోయిన విక్రమ్ మృతదేహాలు బుధవారం సముద్రతీరానికి కొట్టుకొచ్చాయి. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తీసుకోవాల్సిన హెచ్చరికలు:

సముద్ర తీరాలు, జలపాతాలు లేదా రిజర్వాయర్ల వద్దకు విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ప్రజలు అత్యంత అప్రమత్తతతో ఉండాలి. ఈత రాకపోయినా, లోతు తెలియకపోయినా ఉత్సాహంతో నీటిలోకి దిగడం ప్రాణాలకే ముప్పు తెస్తుంది. అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేయకుండా, సరదా క్షణాలు విషాదంగా మారకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రూ.5 వేలతో ఇంట్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.. ఆదాయం లక్షల్లోనే
రూ.5 వేలతో ఇంట్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.. ఆదాయం లక్షల్లోనే
సముద్ర తీరంలో కొట్టుకుపోయి ముగ్గురు యువతులు, యువకుడు మృతి!
సముద్ర తీరంలో కొట్టుకుపోయి ముగ్గురు యువతులు, యువకుడు మృతి!
డిస్కస్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన సువర్ణ రాజ్
డిస్కస్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన సువర్ణ రాజ్
జియోఫైబర్ వర్సెస్ జియో ఎయిర్‌ఫైబర్.. ఇందులో ఏది బెస్ట్‌..
జియోఫైబర్ వర్సెస్ జియో ఎయిర్‌ఫైబర్.. ఇందులో ఏది బెస్ట్‌..
అమృత ఫలం జామ ఆకు నుండి వేరు వరకు అన్నీ ఔషధాలే! ఆరోగ్య ప్రయోజనాలు
అమృత ఫలం జామ ఆకు నుండి వేరు వరకు అన్నీ ఔషధాలే! ఆరోగ్య ప్రయోజనాలు
అమెరికాలో మిస్టరీ జీవి కలకలం.. ఏలియన్ అంటూ ప్రచారం!
అమెరికాలో మిస్టరీ జీవి కలకలం.. ఏలియన్ అంటూ ప్రచారం!
సిరిసంపదల గ్రహ సంచారం.. ఈ రాశుల వారికి లక్కే లక్కు, ధన లాభాలు!
సిరిసంపదల గ్రహ సంచారం.. ఈ రాశుల వారికి లక్కే లక్కు, ధన లాభాలు!
ఊహల్లో తేలిపోవాలా.. నవంబర్‌లో ఈ ప్లేసెస్ సందర్శించాల్సిందే
ఊహల్లో తేలిపోవాలా.. నవంబర్‌లో ఈ ప్లేసెస్ సందర్శించాల్సిందే
టీమిండియాకు ఈ ముగ్గురితోనే అసలు ముప్పు
టీమిండియాకు ఈ ముగ్గురితోనే అసలు ముప్పు
బెజవాడలో దారుణం.. ఓ వాటర్‌ బాటిల్‌ కోసం నిండు ప్రాణాలు తీశారు..
బెజవాడలో దారుణం.. ఓ వాటర్‌ బాటిల్‌ కోసం నిండు ప్రాణాలు తీశారు..