పెళ్లి చేసుకునేందుకు డబ్బులు లేక, ఓ ప్రేమజంట చైన్ స్నాచింగ్‌కు పాల్పడింది. హైదరాబాద్‌లో దసరా నవరాత్రుల సమయంలో ఆలయంలో పూజలు చేస్తున్న 66 ఏళ్ల వృద్ధురాలి 30 గ్రాముల బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేవలం మూడు రోజుల్లో నిందితులను పట్టుకున్నారు.