AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pratyusha Banerjee: 10 ఏళ్ల తర్వాత సంచలన ట్విస్ట్.. చిన్నారి పెళ్లికూతురు ప్రత్యూష కేసులో హైకోర్టు తీర్పు..

చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ ప్రత్యూష బెనర్జీ సూసైడ్ కేసులో అతి పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. న్యాయవాదులు తీసుకువచ్చిన ఒకే ఒక్క సాక్ష్యం ఈ కేసును ఊహించని మలుపులు తిప్పింది. దాదాపు పదేళ్ల సుధీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు ఈ కేసులో బాంబే హైకోర్ట్ తీర్పు వెల్లడించింది. ఇంతకీ అసలు హైకోర్ట్ ఏం చెప్పిందంటే..

Pratyusha Banerjee: 10 ఏళ్ల తర్వాత సంచలన ట్విస్ట్.. చిన్నారి పెళ్లికూతురు ప్రత్యూష కేసులో హైకోర్టు తీర్పు..
Pratyusha Banerjee Case Update
Rajitha Chanti
|

Updated on: Oct 01, 2026 | 11:25 AM

Share

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ఒకప్పుడు బుల్లితెరపై ఎంతగా దూసుకుపోయిందో చెప్పక్కర్లేదు. ఈ సీరియల్ ద్వారా ఇంటింటా అభిమానాన్ని సొంతం చేసుకున్న టీవీ నటి ప్రత్యూష బెనర్జీ. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనుహ్యంగా ఆమె సూసైడ్ చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. 2016లో ప్రత్యుష ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. అయితే ఇప్పుడు పదేళ్ల తర్వాత ఆమె సూసైడ్ కేసులో బాంబే హైకోర్ట్ తీర్పు వెల్లడించింది. ప్రత్యూష మరణం తర్వాత ప్రారంభమైన విచారణ 10 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు ముగిసింది. ఇందులో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ కు పెద్ద ఊరటనిచ్చింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, బాంబే హైకోర్టు రాహుల్‌ను అన్ని ఆరోపణల నుండి పూర్తిగా నిర్దోషిగా విడుదల చేస్తూ తీర్పునిచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‏తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..

వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, ప్రత్యూష బెనర్జీ కేసులో జస్టిస్ శివకుమార్ డిగే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును ప్రకటించింది. ఈసారి, ఆయన ఒక సాక్ష్యాన్ని కోర్టు ముందు పెట్టారు. ఏప్రిల్ 1, 2026న, గోరేగావ్‌లోని ఒక అద్దె ఇంట్లో ప్రత్యూష తీవ్ర నిర్ణయం తీసుకుంది. కానీ అంతకు ముందే, ఆమె రాహుల్‌తో తన చివరిసారిగా ఫోన్ కాల్ మాట్లాడింది. అందులో ప్రత్యుష మాట్లాడుతూ తన మానసిక స్థితి బాగాలేదని చెప్పింది. అంతేకాకుండా తన పరిస్థితికి కారణం కేవలం ఒక్కరు కాదని.. తన తల్లిదండ్రులతోపాటు అందరినీ నిందించింది ప్రత్యూష. అప్పుడే రాహుల్ ఆమెతో మాట్లాడుతూ.. “అలాంటిదేమీ చేయకు, నేను వస్తున్నాను…” అంటూ చెప్పాడు. కానీ అంతలోనే ప్రత్యూష ఊహించని నిర్ణయం తీసుకుంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..

రాహుల్ , ప్రత్యూషల చివరి కాల్ రికార్డింగ్‌ల ఆధారంగా పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కోర్టు ప్రశ్నించడంతో, రాహుల్ ఆరోపణల నుండి నిర్దోషిగా విడుదలయ్యాడు. అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, చివరి క్షణంలో ప్రత్యూష ‘మార్కే భీ మాహీ తుఝ్సే ముహ్ నా మోడ్నా…’ ( “నా ప్రాణం పోయినా సరే నా ప్రియతమా… నీ నుండి నా ముఖాన్ని తిప్పుకోను, నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను” అని అర్థం. చావు కూడా తమను విడదీయలేనంత గాఢమైన ప్రేమను మరియు ఎప్పటికీ తోడుంటానని అర్థం) అని సోషల్ మీడియాలో స్టేటస్ పోస్ట్ చేసి సూసైడ్ చేసుకుంది. చివరకు, రాహుల్ సింగ్ ఈ కేసు నుండి విడుదలయ్యాడు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార.

Follow Us