AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లగ్జరీ SUV ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త Audi Q3 ధర తెలిస్తే ఎగిరి గంతేస్తారు

2026 Audi Q3: లగ్జరీ ఎస్‌యూవీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఆడి ఇండియా కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2026 Audi Q3ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.51.99 లక్షలుగా నిర్ణయించింది. కొత్త మోడల్‌లో ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన టెక్నాలజీ, ప్రీమియం ఇంటీరియర్‌తో పాటు శక్తివంతమైన టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఎస్‌యూవీ నోవా, జెనిత్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

లగ్జరీ SUV ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త Audi Q3 ధర తెలిస్తే ఎగిరి గంతేస్తారు
2026 Audi Q3
Nikhil
|

Updated on: Oct 20, 2026 | 9:40 PM

Share

లగ్జరీ కార్ల విభాగంలో తన పోటీని మరింత పెంచుకునే లక్ష్యంతో ఆడి కొత్త Q3ను తీసుకొచ్చింది. డిజిటల్ డిస్‌ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్, అధునాతన భద్రతా ఫీచర్లు ఈ మోడల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు Quattro ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను అందించడం ద్వారా పనితీరుకు ప్రాధాన్యం ఇచ్చింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కారు కేవలం 7.1 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠ వేగం గంటకు 229 కిలోమీటర్లుగా ఉంది.

కొత్త డిజైన్‌తో ప్రీమియం లుక్

2026 Audi Q3 ఎక్స్‌టీరియర్‌లో పలు ఆకర్షణీయమైన మార్పులు కనిపిస్తాయి. ముందు భాగంలో స్ప్లిట్ LED హెడ్‌లైట్లు, డిజిటల్ మ్యాట్రిక్స్ LED లైటింగ్, హనీకోంబ్ డిజైన్‌తో కూడిన పెద్ద ఫ్రంట్ గ్రిల్‌ను అందించారు. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, సన్నని రూఫ్ రైల్స్, క్రోమ్ విండో లైన్ ఎస్‌యూవీకి స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి.

వెనుక భాగంలో స్ప్లిట్ LED టెయిల్ లైట్లు, వాటిని కలిపే సన్నని లైట్ బార్, ప్రకాశించే ఆడి లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మొత్తంగా కొత్త డిజైన్‌తో ఈ ఎస్‌యూవీకి మరింత ఆధునికమైన రూపాన్ని తీసుకొచ్చారు.

డిజిటల్ క్యాబిన్..

క్యాబిన్‌లో 12.8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 11.9 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. నాలుగు స్పోక్‌ల హెక్సాగనల్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి సదుపాయాలు అందించారు.

పనోరమిక్ సన్‌రూఫ్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, 12 స్పీకర్ల Sonos ఆడియో సిస్టమ్, హెడ్‌అప్ డిస్‌ప్లే, పవర్డ్ టెయిల్‌గేట్ కూడా ఉన్నాయి. ముందు సీట్లకు పవర్ అడ్జస్ట్‌మెంట్‌తో పాటు హీటింగ్ సదుపాయాన్ని కల్పించారు. భద్రత కోసం 9 ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా, హిల్ అసిస్ట్, ADAS ఫీచర్లను అందించారు.

ఈ ఎస్‌యూవీలో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 204 హెచ్‌పీ పవర్, 320 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేసిన ఈ ఇంజిన్‌కు Quattro ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను అందించారు.

BMW X1, Mercedes-Benz GLAలకు పోటీ

2026 Audi Q3 ధర నోవా వేరియంట్‌కు రూ.51.99 లక్షలుగా ఉండగా, టాప్ వేరియంట్ జెనిత్ ధర రూ.55.99 లక్షలుగా ఉంది. ఈ మోడల్‌ను భారత్‌లోనే అసెంబుల్ చేస్తున్నారు. లగ్జరీ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో BMW X1, Mercedes-Benz GLA వంటి మోడళ్లకు ఇది పోటీ ఇవ్వనుంది. ధర, ఫీచర్లు, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో ప్రీమియం ఎస్‌యూవీ కోరుకునే వినియోగదారులను ఆకట్టుకోవడమే కొత్త Audi Q3 లక్ష్యంగా కనిపిస్తోంది.

Follow Us