AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీటీడీ కీలక నిర్ణయం! తిరుమలలో ఏఐ టెక్నాలజీతో ఉద్యానవనాల అభివృద్ధి

టీటీడీ కీలక నిర్ణయం! తిరుమలలో ఏఐ టెక్నాలజీతో ఉద్యానవనాల అభివృద్ధి

Phani CH
|

Updated on: Oct 20, 2026 | 4:24 PM

Share

తిరుమలలోని ఉద్యానవనాలను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించింది. కొండపై ఉన్న 34 ఉద్యానవనాల నిర్వహణ, అభివృద్ధి కోసం భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇటీవల జరిగిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 60 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 5 లక్షల కట్ ఫ్లవర్స్, 80 వేల సీజనల్ పూలతో అలంకరణలు చేపట్టారు. పురాణ ఇతివృత్తాలతో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మికతకు అధునాతన సాంకేతికతను జోడిస్తూ భక్తులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు అడుగులు వేస్తోంది. అందులో భాగంగా తిరుమలలోని ఉద్యానవనాల నిర్వహణ, అభివృద్ధి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. తిరుమల కొండపై ప్రస్తుతం మొత్తం 34 ఉద్యానవనాలు ఉన్నాయి. వీటిలో 20 గార్డెన్లను వివిధ దాతలు నిర్వహిస్తుండగా, మిగిలిన 14 ఉద్యానవనాలను టీటీడీ స్వయంగా పర్యవేక్షిస్తోంది. ఏఐ టెక్నాలజీ భాగస్వామ్యంతో ఈ ఉద్యానవనాలను మరింత శోభాయమానంగా, రమణీయంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. మరోవైపు, ఇటీవల జరిగిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో చేపట్టిన పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం దాదాపు 30 మంది దాతలు ముందుకు వచ్చి సహకారం అందించారు. ఈ వేడుకల కోసం దాదాపు 60 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 5 లక్షల కట్ ఫ్లవర్స్, 80 వేల సీజనల్ ఫ్లవర్స్‌ను వినియోగించారు. ఆలయం వద్ద తొలిరోజు, గరుడసేవ, ఏడో రోజున అలంకరణలను మార్చారు. జీఎన్సీ వద్ద ఏర్పాటు చేసిన అలంకరణలతో పాటు కళ్యాణవేదిక వద్ద పిల్లలకు పురాణాలపై అవగాహన కలిగేలా 24 రకాల కాన్సెప్ట్‌లతో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనలు భక్తుల నుంచి విశేష ప్రశంసలు అందుకున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. కంటిలో పెరిగిన పన్ను!

డ్రైవర్ లేకుండానే రివర్స్‌లో దూసుకెళ్లిన కారు..

అమలాపురంలో అరుదైన వేలం.. అమ్మవారి మెడలో దండ వేయాలంటే..

తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తున్న విద్యుత్‌ డిమాండ్‌

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ఆహార నిల్వల్లో దూసుకెళ్తున్న చైనా.. మరి భారత్‌ పరిస్థితేంటి?

Follow Us